Headlines

APPSC లో మార్పులకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ | APPSC Reforms | APPSC Latest News Today | APPSC Notifications

ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ లో మార్పులు చేసేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఏపీపీఎస్సీ లో మార్పులు చేపట్టేందుకు అవసరమైన అంశాలు పైన అధ్యయనం చేయడానికి ప్రభుత్వం ప్రస్తుతం ఒక కమిటీని కూడా నియమించింది.

ఈ కమిటీకి అధ్యక్షుడిగా ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బి.రాజశేఖర్ గారిని నియమించింది. ఏడుగురు ఉన్నతాధికారులను సభ్యులుగా ఈ కమిటీ నియమించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ గారు ఉత్తర్వులు కూడా జారీ చేశారు.

🏹 విశాఖపట్నం మత్స్య పరిశోధన కేంద్రంలో ఉద్యోగాలు – Click here

ఈ కమిటీ చేయాల్సిన పని : 

  • ఈ కమిటీ ఇతర రాష్ట్రాల్లో సర్వీస్ కమిషన్స్ అనుసరిస్తున్న విధానాలు, పోస్టులు భర్తీ ఎలా చేస్తున్నారు ? పోస్టులు భర్తీకి నోటిఫికేషన్ జారీ చేస్తున్న విధానం , పరీక్షలు నిర్వహిస్తున్న విధానం మరియు ఇతర ముఖ్యమైన అంశాలు పైన అధ్యయనం చేసి నివేదిక అందజేస్తుంది.

🔥 నివేదిక ఎప్పుడు ఇస్తారు ? : 

  • తాజాగా జారీ చేసిన ఉత్తర్వుల్లో నివేదికను ఈ నెల 30వ తేదీ లోపు అందజేయాలి అని పేర్కొన్నారు.

ఈ కమిటీ ప్రభుత్వానికి అందజేసిన నివేదికపై చర్చించి ఏపీపీఎస్సీ లో కీలకమైన మార్పులు చేసే అవకాశం ఉంది. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు జాబ్ క్యాలెండర్ విడుదల చేసేందుకు ప్రభుత్వం కసరత్తు కూడా చేస్తున్నట్లు సమాచారం.

🏹 ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ లో ఉద్యోగాలు – Click here 

✅ ఫ్రెండ్స్ మీ వాట్సాప్ / టెలిగ్రాం కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాల సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ , టెలిగ్రామ్ ఛానల్స్ లో జాయిన్ అవ్వండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!