ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖలో 500 ఉద్యోగాలు భర్తీ | AP Endowment Jobs Recruitment 2024 | AP Latest jobs Notifications in Telugu

ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖలో 500 ఉద్యోగాలను భర్తీ చేసేందుకు త్వరలో నోటిఫికేషన్ విడుదల చేయబోతున్నట్లు ఆ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి గారు తెలిపారు. దేవదాయ శాఖ పరిధిలోని ఆలయాల పరిపాలన విభాగాల్లో ఖాళీలు మరియు అర్చక విభాగంలో ఉన్న ఖాళీలను కలిపి మొత్తం 500 పోస్టులను భర్తీ చేస్తామని ఆయన వెల్లడించారు. 

భర్తీ చేయబోతున్న పోస్టుల్లో క్లర్క్ ఉద్యోగాలు, జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలు, AE వంటి వివిధ రకాల ఉద్యోగాలు ఉంటాయి. ఈ ఉద్యోగాలకు ఏదైనా డిగ్రీ విద్యార్హతతో పాటు, ఇంజనీరింగ్ డిగ్రీ వంటి విద్యార్హతలు కలిగి ఉండాలి. ఈ ఉద్యోగాలను భర్తీ చేసేందుకు త్వరలో నోటిఫికేషన్స్ విడుదల చేసే అవకాశం ఉంది.

🏹 విశాఖపట్నం & విజయవాడ విమానాశ్రయాల్లో ఉద్యోగాలు భర్తీ – Click here 

✅ ఫ్రెండ్స్ మీ వాట్సాప్ / టెలిగ్రాం కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాల సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ , టెలిగ్రామ్ ఛానల్స్ లో జాయిన్ అవ్వండి.

🏹 రిక్రూట్మెంట్ కి సంబంధించిన మరికొంత ముఖ్యమైన సమాచారం కోసం ఈ ఆర్టికల్ పూర్తిగా చెప్పండి. 

🔥 నోటిఫికేషన్ విడుదల చేయబోయే సంస్థ : 

  • ఈ నోటిఫికేషన్ ఆంధ్రప్రదేశ్ దేవదాయ శాఖ విడుదల చేస్తుంది లేదా జాబ్ క్యాలెండర్ లో ఈ ఉద్యోగాలను నోటిఫై చేసి నోటిఫికేషన్స్ విడుదల చేస్తారు.

🔥 మొత్తం ఖాళీల సంఖ్య : 

  • దేవదాయ శాఖ మంత్రి చేసిన ప్రకటన ప్రకారం 500 ఉద్యోగాలను భర్తీ చేయబోతున్నారు. 

🔥 భర్తీ చేయబోయే ఉద్యోగాలు : 

  • పరిపాలన విభాగంలో ఉన్న ఖాళీలు మరియు అర్చక విభాగంలో ఉన్న ఖాళీలను కూడా భర్తీ చేస్తారు.
  • ఇందులో క్లర్క్, జూనియర్ అసిస్టెంట్, AE వంటి పోస్టులతో పాటు వివిధ రకాల ఉద్యోగాలు ఉండే అవకాశం ఉంది. 

🔥 నోటిఫికేషన్ విడుదల తేదీ : 

  • నోటిఫికేషన్ విడుదలకు సంబంధించి మంత్రి గారు స్పష్టమైన తేదీ వెల్లడించలేదు. కానీ దేవాదాయ శాఖలో కొన్ని సంవత్సరాల నుంచి చాలా ఖాళీలు ఉన్నాయి. ఇటీవల కాలంలో ఈ ఉద్యోగాల భర్తీకి ఎటువంటి నోటిఫికేషన్ విడుదల చేయలేదు. కాబట్టి ఈ ఉద్యోగాలను భర్తీ చేసేందుకు త్వరలో నోటిఫికేషన్స్ విడుదల చేస్తారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం త్వరలో జాబ్ క్యాలెండర్ విడుదల చేసే అవకాశం ఉంది. ఈ జాబ్ క్యాలెండర్లో ఈ ఉద్యోగాలను నోటిఫై చేసి భర్తీ చేయవచ్చు. 

🔥 విద్యార్హతలు : 

  • పోస్టులను అనుసరించి విద్యార్హతలు ఉంటాయి. 12th , డిగ్రీ , బి.టెక్ మరియు వివిధ రకాల అర్హతలు ఉన్నవారికి ఉద్యోగ అవకాశాలు ఉంటాయి. 

🔥 ఎంపిక విధానం : 

  • ఈ ఉద్యోగాలకు ఎంపిక ప్రక్రియలో భాగంగా రాత పరీక్షలు నిర్వహిస్తారు. 
  • రాత పరీక్షలో వచ్చిన మార్కుల మెరిట్ ఆధారంగా అభ్యర్థులని ఎంపిక చేసి డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి ఫైనల్ సెలక్షన్ పూర్తి చేస్తారు .

🔥 పరీక్ష విధానం : 

  • అప్లై చేసిన అభ్యర్థుల సంఖ్యను ఆధారంగా చేసుకుని ఆన్లైన్ లేదా ఆఫ్లైన్ విధానంలో పరీక్ష నిర్వహిస్తారు. 

🏹 అభ్యర్థులకు ముఖ్య గమనిక : 

  • ఈ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసిన తర్వాత మా వెబ్సైట్ ద్వారా మీకు సమాచారం తెలియజేస్తాం. ఇలాంటి నోటిఫికేషన్స్ సమాచారం కోసం మా వెబ్సైట్ ప్రతిరోజు ఓపెన్ చేస్తూ ఉండండి.
  • మరి కొన్ని ఉద్యోగాల కోసం మా టెలిగ్రామ్ వాట్సాప్ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.

✅ ఫ్రెండ్స్ మీ వాట్సాప్ / టెలిగ్రాం కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాల సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ , టెలిగ్రామ్ ఛానల్స్ లో జాయిన్ అవ్వండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!