అంధ్రప్రదేశ్ విశాఖపట్నం లో టాటా మెమోరియల్ ట్రస్ట్ పరిధి లో గల హోమీ బాబా క్యాన్సర్ హాస్పిటల్ రీసెర్చ్ సెంటర్ లో సెక్రటేరియల్ అసిస్టెంట్ ( కాంట్రాక్టు ప్రాధిపతికన ) ఉద్యోగాలకు వాక్ ఇన్ ఇంటర్వ్యూ నిర్వహిస్తున్నారు.
కేవలం ఇంటర్వ్యూ కి హాజరు కావడం ద్వారా ఈ ఉద్యోగాలను పొందవచ్చు.
ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించిన పూర్తి వివరాలు కోసం ఈ ఆర్టికల్ మొత్తం చదవండి.
🔥 రిక్రూట్మెంట్ చేపట్టే సంస్థ :
- హోమీ బాబా క్యాన్సర్ హాస్పిటల్ రీసెర్చ్ సెంటర్, విశాఖపట్నం నుండి ఈ నోటిఫికేషన్ విడుదల చేసారు.
🔥 మొత్తం ఉద్యోగాల సంఖ్య : 04
🔥 భర్తీ చేయబోయే ఉద్యోగాలు:
- సెక్రటేరియల్ అసిస్టెంట్ అనే ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.
🔥 విద్యార్హత :
- హెచ్.ఎస్సీ (ఇంటర్మీడియట్) పూర్తి చేసిన అభ్యర్థులు అర్హులు
- ఏదైనా గుర్తింపు పొందిన సంస్థ నుండి 6 నెలల కంప్యూటర్ కోర్సు లేదా MS – CIT పూర్తి చేసి వుండాలి.
🔥 గరిష్ఠ వయస్సు :
- 30 సంవత్సరాల లోపు వయస్సు గల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
🔥దరఖాస్తు విధానం :
- అభ్యర్థులు అప్డేట్ రెజ్యుమ్ , ఇటీవలి పాస్పోర్ట్ సైజ్ ఫొటోగ్రాఫ్, పాన్ కార్డు జిరాక్స్, ఆధార్ కార్డు జిరాక్స్ , ఒరిజినల్ సర్టిఫికెట్లు , అన్ని సర్టిఫికారు ల సెల్ఫ్ అట్టేస్టడ్ కాపీస్ తో ఇంటర్వ్యూ కి డైరెక్ట్ గా హాజరు అయితే సరిపోతుంది.
🔥 ఇంటర్వ్యూ నిర్వహణ ప్రదేశం :
- హోమీబాబా క్యాన్సర్ హాస్పిటల్ & రీసెర్చ్ సెంటర్ , అగనంపూడి , విశాఖపట్నం – 530053.
🔥 జీతం :
- నెలకు 19100/- రూపాయల జీతం లభిస్తుంది
🔥 ఎంపిక విధానం :
- అభ్యర్థులు తేది:08/11/2024 న ఉదయం 9:30 నుండి 10:30 గంటల మధ్య నిర్వహించు వాక్ ఇన్ ఇంటర్వ్యూ కి హాజరు అవ్వాలి.
- ఇంటర్వ్యూ నిర్వహణ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
🔥 ముఖ్యమైన తేదిలు:
- ఇంటర్వ్యూ నిర్వహణ తేది 08/11/2024 న ఉదయం 9:30 నుండి 10:30 గంటల మధ్య నిర్వహించనున్నారు.
🔥 ముఖ్యమైన అంశాలు :
- ఈ ఉద్యోగాలను తాత్కాలిక ప్రాతిపదికన ఎంపిక చేస్తున్నారు , అవసరం మేరకు కొనసాగిస్తారు.
- ఈ ఉద్యోగాలకు సంబంధించి ఏమైనా సందేహాలు వుంటే ఫోన్ నెంబర్ 0891-2871 ను సంప్రదించగలరు.