Headlines

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థలో 295 ఖాళీలు భర్తీ | APSRTC Notification 2024 | APSRTC Latest Notification

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్ ట్రాన్స్ పోర్ట్ కార్పొరేషన్ (APSRTC) సంస్థ నుండి ఐటిఐ పూర్తి చేసిన అభ్యర్థులకు అప్రెంటిస్ షిప్ కల్పించేందుకు గాను నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది. మొత్తం 295 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. 

ఈ ఉద్యోగాలకు కర్నూల్, నంద్యాల, అనంతపూర్, శ్రీ సత్యసాయి, కడప , అన్నమయ్య జిల్లాల నందు వున్న ఐటిఐ కాలేజీ ల నుండి  ఉత్తీర్ణత సాధించిన వారు దరఖాస్తు చేసుకోవచ్చు.

ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించిన పూర్తి వివరాలు కోసం ఈ ఆర్టికల్ మొత్తం చదవండి.

🏹 TTD అన్న ప్రసాదం ట్రస్ట్ నోటిఫికేషన్ – Click here 

🏹 10th అర్హతతో 545 కానిస్టేబుల్ పోస్టులు భర్తీ – Click here 

🔥 రిక్రూట్మెంట్ చేపట్టే సంస్థ

  • ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్ ట్రాన్స్ పోర్ట్ కార్పొరేషన్ నుండి ఈ నోటిఫికేషన్ విడుదల చేసారు.

🔥 మొత్తం ఉద్యోగాల సంఖ్య

  • 295 అప్రెంటిస్ పోస్టులను భర్తీ చేస్తున్నారు.

🔥 భర్తీ చేయబోయే ఉద్యోగాలు

క్రింది అప్రెంటిస్ పోస్టులు భర్తీ చేస్తున్నారు.

  • డీజిల్ మెకానిక్ 
  • మోటార్ మెకానిక్
  • ఎలక్ట్రీషియన్ 
  • వెల్డర్
  • పెయింటర్ 
  • మెషనిస్ట్
  • ఫిట్టర్
  • డ్రాఫ్ట్ మాన్ సివిల్ 

🔥 విద్యార్హత

  • కర్నూల్, నంద్యాల, అనంతపూర్, శ్రీ సత్యసాయి, కడప , అన్నమయ్య జిల్లాల నందు గల కళాశాలలో సంబంధిత విభాగం లో  ఐటిఐ పూర్తి చేసిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు..

🔥దరఖాస్తు విధానం :

  • అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ ద్వారా ఆన్లైన్ విధానం లో అప్లై చేయాలి.
  • అభ్యర్థి అప్రెంటిస్ వెబ్సైట్ లో రిజిస్టర్ అయి , అప్రెంటిస్ రిజిస్ట్రేషన్ నెంబర్ ను కలిగి వుండాలి.
  • అభ్యర్థి తను అప్లై చేయాలి అనుకుంటున్న ట్రేడ్ కి దరఖాస్తు చేసుకోవాలి.
  • అభ్యర్థులు ఆన్లైన్ దరఖాస్తు చేసుకున్న తర్వాత క్రింద పేర్కొన్న సర్టిఫికెట్ వెరిఫికేషన్ నిర్వహణ స్థలం వద్ద సంబంధిత దృవపత్రాలతో హాజరు కావాలి.

🔥 ఫీజు :  

  • అభ్యర్థి సర్టిఫికెట్ వెరిఫికేషన్ సమయంలో  118/-  రూపాయల  (100 + 18  GST ) processing ఫీజు చెల్లించాల్సి వుంటుంది.

🔥 ఎంపిక విధానం

  • దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల కు ఇంటర్వ్యూ నిర్వహణ ,  సర్టిఫికెట్ వెరిఫికేషన్ ద్వారా  మెరిట్ ఆధారంగా  , అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

🔥 సర్టిఫికెట్ వెరిఫికేషన్ నిర్వహణ స్థలం :

  • జోనల్ సిబ్బంది శిక్షణ కళాశాల , ఏ. పి. ఎస్. ఆర్. టి. సి,బళ్ళారి చౌరస్తా, కర్నూల్ .

🔥 సర్టిఫికెట్ వెరిఫికేషన్ సమయంలో అవసరమగు ధృవ పత్రాలు:

  •  SSC మార్క్స్ లిస్ట్
  • ఐటిఐ మార్క్స్ లిస్ట్
  • NCVT సర్టిఫికేట్
  • కుల దృవీకరణ పత్రం (6 నెలల లోపు గల)
  • దివ్యాంగులయించో దృవీకరణ పత్రం
  • మాజీ సైనిక ఉద్యోగుల పిల్లలు అయినచో దృవీకరణ పత్రం
  • NCC & స్పోర్ట్స్ సర్టిఫికెట్లు వున్నచో ఆ సర్టిఫికెట్లు
  • ఆధార్ కార్డు
  • పాన్ కార్డు / డ్రైవింగ్ లైసెన్స్
  • రెండు పాస్ పార్ట్ సైజ్ ఫోటోలు 

పైన పేర్కొన్న ధృవ పత్రాలు ఒరిజినల్ సర్టిఫికెట్లు తో పాటు ఒక జత జిరాక్స్ కాపీ తీసుకొని వెళ్లవలెను.

🔥 ముఖ్యమైన తేదిలు

  • ఆన్లైన్ విధానం ద్వారా అప్లై చేసుకోవడానికి ప్రారంభ తేది : 05/11/2024
  • ఆన్లైన్ విధానం ద్వారా అప్లై చేసుకోవడానికి చివరి తేది : 19/11/2024

🔥 ముఖ్యమైన అంశాలు :

  • అభ్యర్థులు 19/11/2024 లోపు గా మాత్రమే దరఖాస్తు చేసుకోవలెను.
  • అభ్యర్థి ప్రొఫైల్ లో ఆధార్ కార్డు ekyc చేసుకోవలెను మరియు ఆధార్ కార్డ్,SSC సర్టిఫికెట్ నందు వివరాలు తప్పనిసరిగా సరిపోలవలెను.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!