APSRTC లో 311 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల | APSRTC Latest Notification | APSRTC Apprentice Notification 2024

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్ ట్రాన్స్ పోర్ట్ కార్పొరేషన్ (APSRTC) సంస్థ నుండి ఐటిఐ పూర్తి చేసిన అభ్యర్థులకు అప్రెంటిస్ షిప్ కల్పించేందుకు గాను నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది. ఎన్టీఆర్ , కృష్ణ , పశ్చిమ గోదావరి, ఏలూరు, గుంటూరు , బాపట్ల , పల్నాడు జిల్లాల నందు వున్న ఐటిఐ కాలేజీ ల నుండి  ఉత్తీర్ణత సాధించిన వారు దరఖాస్తు చేసుకోవచ్చు.

ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించిన పూర్తి వివరాలు కోసం ఈ ఆర్టికల్ మొత్తం చదవండి.

🏹 విశాఖపట్నం & విజయవాడ విమానాశ్రయాల్లో ఉద్యోగాలు భర్తీ – Click here 

🔥 రిక్రూట్మెంట్ చేపట్టే సంస్థ

  • ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ నుండి నోటిఫికేషన్ విడుదల చేసారు.

🔥 మొత్తం ఉద్యోగాల సంఖ్య : 311

🔥 భర్తీ చేయబోయే ఉద్యోగాలు

: అప్రెంటిస్ ఉద్యోగాలు పోస్టులు భర్తీ చేయుటకు ఈ నోటిఫికేషన్ విడుదల చేసారు.

  • డీజిల్ మెకానిక్ 
  • మోటార్ మెకానిక్
  • ఎలక్ట్రీషియన్ 
  • వెల్డర్
  • పెయింటర్ 
  • మెషనిస్ట్
  • ఫిట్టర్
  • డ్రాఫ్ట్ మాన్ సివిల్ 

🔥 విద్యార్హత

  • ఎన్టీఆర్ , కృష్ణ , పశ్చిమ గోదావరి ,ఏలూరు ,గుంటూరు , బాపట్ల , పల్నాడు జిల్లాల నందు గల కళాశాలలో సంబంధిత విభాగం లో  ఐటిఐ పూర్తి చేసిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.

🔥దరఖాస్తు విధానం :

  • అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ ద్వారా ఆన్లైన్ విధానం లో అప్లై చేయాలి.
  • అభ్యర్థి అప్రెంటిస్ వెబ్సైట్ లో రిజిస్టర్ అయి , అప్రెంటిస్ రిజిస్ట్రేషన్ నెంబర్ ను కలిగి వుండాలి.
  • అభ్యర్థి తను అప్లై చేయాలి అనుకుంటున్న ట్రేడ్ కి దరఖాస్తు చేసుకోవాలి.

🔥 ఫీజు :  

  • అభ్యర్థి సర్టిఫికెట్ వెరిఫికేషన్ సమయంలో  118/-  రూపాయల  (100 + 18  GST ) processing ఫీజు చెల్లించాల్సి వుంటుంది.

🔥 ఎంపిక విధానం

  • దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల సర్టిఫికెట్ వెరిఫికేషన్ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

🔥 సర్టిఫికెట్ వెరిఫికేషన్ సమయంలో అవసరమగు ధృవ పత్రాలు :

  • SSC మార్క్స్ లిస్ట్
  • ఐటిఐ మార్క్స్ లిస్ట్
  • NCVT సర్టిఫికేట్
  • కుల దృవీకరణ పత్రం ( 6 నెలల లోపు గల )
  • దివ్యాంగులయించో దృవీకరణ పత్రం
  • మాజీ సైనిక ఉద్యోగుల పిల్లలు అయినచో దృవీకరణ పత్రం
  • NCC & స్పోర్ట్స్ సర్టిఫికెట్లు వున్నచో ఆ సర్టిఫికెట్లు
  • ఆధార్ కార్డు
  • పాన్ కార్డు / డ్రైవింగ్ లైసెన్స్
  • రెండు పాస్ పార్ట్ సైజ్ ఫోటోలు 
  • పైన పేర్కొన్న ధృవ పత్రాలు ఒరిజినల్ సర్టిఫికెట్లు తో పాటు ఒక జత జిరాక్స్ కాపీ తీసుకొని వెళ్లవలెను.

🔥 ముఖ్యమైన తేదిలు

  • ఆన్లైన్ విధానం ద్వారా అప్లై చేసుకోవడానికి ప్రారంభ తేది : 06/11/2024
  • ఆన్లైన్ విధానం ద్వారా అప్లై చేసుకోవడానికి చివరి తేది : 20/11/2024

🔥 ముఖ్యమైన అంశాలు :

  • అభ్యర్థులు 20/11/2024 లోపు గా మాత్రమే దరఖాస్తు చేసుకోవలెను.
  • అభ్యర్థి ప్రొఫైల్ లో ఆధార్ కార్డు ekyc చేసుకోవలెను మరియు ఆధార్ కార్డ్,SSC సర్టిఫికెట్ నందు వివరాలు తప్పనిసరిగా సరిపోలవలెను.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!