Headlines

విశాఖపట్నం & విజయవాడ విమానాశ్రయాల్లో ఉద్యోగాలు | Vizag & Vijayawada Airport’s Jobs | AI Airport Services Recruitment 2024 | Jobs in Airports

మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ పరిధిలో గల ఏఐ ఎయిర్పోర్ట్ సర్వీసెస్ సంస్థ నుండి వివిధ ఉద్యోగాల భర్తీ కొరకు నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ నోటిఫికేషన్ ద్వారా జూనియర్ ఆఫీసర్ – కస్టమర్ సర్వీస్ , ర్యాంప్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్ , యుటిలిటీ ఏజెంట్ కమ్ ర్యాంప్ డ్రైవర్ ఉద్యోగాల భర్తీ చేయనున్నారు.

ఈ ఉద్యోగాలకు ఎంపిక కాబడిన వారు విశాఖపట్నం మరియు విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయాలు లో పని చేయాల్సి వుంటుంది.

ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించిన పూర్తి వివరాలు కోసం ఈ ఆర్టికల్ మొత్తం చదవండి.

🏹 TTD లో ఉద్యోగాలు – Click here 

🏹 10th అర్హతతో 545 కానిస్టేబుల్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ – Click here 

🔥 రిక్రూట్మెంట్ చేపట్టే సంస్థ : ఏఐ ఎయిర్పోర్ట్ సర్వీసెస్ సంస్థ 

🔥 మొత్తం ఉద్యోగాల సంఖ్య : 10

🔥 భర్తీ చేయబోయే ఉద్యోగాలు : 

  • జూనియర్ ఆఫీసర్ – కస్టమర్ సర్వీస్  – 04
  • ర్యాంప్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్  – 01
  • యుటిలిటీ ఏజెంట్ కమ్ ర్యాంప్ డ్రైవర్ – 08

🔥 విద్యార్హత : 

      1)జూనియర్ ఆఫీసర్ – కస్టమర్ సర్వీస్ :

  • ఏదైనా గుర్తింపు పొందిన సంస్థ నుండి గ్రాడ్యుయేట్ ( 10+2+3)అయి వుండాలి
  • టికెటింగ్ , రిజర్వేషన్స్ , కంప్యూటరైస్డ్ ప్యాసింజర్ చెక్ ఇన్ , కార్గో హ్యాండ్లింగ్ వంటి విభాగాలలో 9 సంవత్సరాల అనుభవం కలిగి వుండాలి.

                    (లేదా)

గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఎంబీఏ పూర్తి చేసిన అభ్యర్థులకు పైన పేర్కొన్న విభాగాలలో 6 సంవత్సరాల అనుభవం వుంటే అర్హులు.

  • కంప్యూటర్ పరిజ్ఞానం కలిగి వుండాలి.
  • ఇంగ్లీష్ మరియు హిందీ భాష మాట్లాడడం & రాయడం వచ్చి వుండాలి.

       2) ర్యాంప్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్ :

  • రాష్ట్ర ప్రభుత్వం ద్వారా గుర్తింపు పొందిన సంస్థ నుండి మెకానికల్  / ఎలక్ట్రికల్ / ప్రొడక్షన్ / ఎలక్ట్రానిక్స్ / ఆటోమొబైల్ విభాగాలలో డిప్లొమా పూర్తిచేసి వుండాలి.

                     (లేదా)

మోటార్ వెహికల్ / ఆటో ఎలక్ట్రికల్ / ఎయిర్ కండిషనింగ్ / డీజిల్ మెకానిక్ / బెంచ్ ఫిట్టర్ / వెల్దేర్ విభాగాలలో ఐటిఐ పూర్తి చేసి వుండాలి.

  • అభ్యర్థి వాలిడ్ హెవీ మోటార్ వెహికల్ లైసెన్స్ కలిగి వుండాలి

       3)యుటిలిటీ ఏజెంట్ కమ్ ర్యాంప్ డ్రైవర్:

  • పదవ తరగతి ఉత్తీర్ణత అయి వుండాలి
  • అభ్యర్థి ట్రేడ్ టెస్ట్ నాటికి  వాలిడ్ హెవీ మోటార్ వెహికల్ లైసెన్స్ కలిగి వుండాలి

🔥 గరిష్ఠ వయస్సు :

  • జూనియర్ ఆఫీసర్ – కస్టమర్ సర్వీస్ – 35 సంవత్సరాలు
  • ర్యాంప్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్ – 28 సంవత్సరాలు 
  • యుటిలిటీ ఏజెంట్ కమ్ ర్యాంప్ డ్రైవర్ – 28 సంవత్సరాలు 
  • ఎస్సీ, ఎస్టీ వారికి 5 సంవత్సరాలు
  • ఓబీసీ (నాన్ క్రిమి లేయర్) వారికి 3 సంవత్సరాలు వయో సడలింపు కలదు.

🔥 దరఖాస్తు విధానం :

అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ నుండి అప్లికేషన్ ను డౌన్లోడ్ చేసుకొని ,ఫీల్ చేసి తేది :11/11/2024 మరియు 12/11/2024 నాడు ఉదయం 9:00 గణల నుండి 12:00 గంటల వరకు నిర్వహించే ఇంటర్వ్యూ & ట్రేడ్ టెస్ట్ నకు హాజరు కావాలి.

🔥 ఇంటర్వ్యూ నిర్వహణ ప్రాంతం

  • NTR College of Veterinary Science. Opposite to Vijayawada International Airport, Gannavaram,  Krishna district Andhra Pradesh – 521101.

🔥 అప్లికేషన్ ఫీజు

  • అభ్యర్థులు 500/- రూపాయల నాన్ రిఫండబుల్ అప్లికేషన్ ఫీజు ను AI airport services limited సంస్థ పేరు మీదుగా డిమాండ్ డ్రాఫ్ట్ చేయాలి.
  • ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు, Ex – సర్వీస్ మాన్ అభ్యర్థులు ఎటువంటి అప్లికేషన్ ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు.

🔥 జీతం :

  • జూనియర్ ఆఫీసర్ – కస్టమర్ సర్వీస్ ఉద్యోగాలకు నెలకు 29,760/- రూపాయల జీతం లభిస్తుంది.
  • ర్యాంప్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలకు నెలకు 24,960/- రూపాయల జీతం లభిస్తుంది.
  • యుటిలిటీ ఏజెంట్ కమ్ ర్యాంప్ డ్రైవర్ : నెలకు 21,270/- రూపాయల జీతం లభిస్తుంది.

🔥 ఎంపిక విధానం :

  • జూనియర్ ఆఫీసర్ – కస్టమర్ సర్వీస్ : పర్సనల్ ఇంటర్వ్యూ లేదా వర్చువల్ ఇంటర్వ్యూ నిర్వహణ ద్వారా ఎంపిక చేస్తారు.
  • ర్యాంప్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్ / యుటిలిటీ ఏజెంట్ కమ్ ర్యాంప్ డ్రైవర్ : ట్రేడ్ టెస్ట్ నిర్వహణ మరియు పర్సనల్ ఇంటర్వ్యూ / వర్చువల్ ఇంటర్వ్యూ నిర్వహణ ద్వారా ఎంపిక చేస్తారు.
  • ఇంటర్వ్యూ నిర్వహణ తేదీలు: 11/11/2024 & 12/11/2024.
  • అర్హత నిర్ధారణ కొరకు కట్ ఆఫ్ తేది : 01/11/2024

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!