Headlines

ECIL లో రాత పరీక్ష లేకుండా ఉద్యోగాలు భర్తీ | ECIL Recruitment 2024 | Latest jobs in ECIL | Latest Jobs Alerts in Telugu

భారత ప్రభుత్వం , డిపార్టుమెంటు అఫ్ అటామిక్ ఎనర్జీ పరిధిలో గల ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ సంస్థ నుండి వివిధ ఉద్యోగాల భర్తీ కొరకు నోటిఫికేషన్ విడుదల అయ్యింది.

ఈ రిక్రూట్మెంట్ ద్వారా సెలెక్ట్ కాబడిన అభ్యర్థులు ఒక సంవత్సరం కాలానికి గాను రిక్రూట్ చేయబడినప్పటికి ప్రాజెక్టు అవసరాల బట్టి & అభ్యర్థి యొక్క పనితనం బట్టి 4 సంవత్సరాల వరకు కొనసాగించబడతారు.

ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించిన పూర్తి వివరాలు కోసం ఈ ఆర్టికల్ మొత్తం చదవండి.

🏹 PF ఆఫీస్ లో ఉద్యోగాలు భర్తీ – Click here 

🏹 APCRDA లో ఉద్యోగాలు భర్తీ – Click here 

✅ ఫ్రెండ్స్ మీ వాట్సాప్ / టెలిగ్రాం కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాల సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ , టెలిగ్రామ్ ఛానల్స్ లో జాయిన్ అవ్వండి.

🔥 రిక్రూట్మెంట్ చేపట్టే సంస్థ

  • ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ నుండి ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేసారు.

🔥 మొత్తం ఉద్యోగాలు :  82

🔥 భర్తీ చేయబోయే ఉద్యోగాలు :

  • ప్రాజెక్ట్ ఇంజనీర్
  • టెక్నికల్ ఆఫీసర్
  • అసిస్టెంట్ ప్రాజెక్టు ఇంజనీర్ 
  • అసిస్టెంట్ ఇంజనీర్

🔥 విద్యార్హత :

  • గుర్తింపు పొందిన సంస్థ నుండి 60 శాతం మార్కులతో బి.ఈ / బి.టెక్ , డిప్లొమా పూర్తి చేసి వుండాలి.
  • పోస్టులను అనుసరించి పని అనుభవం అవసరం అగును.

🔥 గరిష్ఠ వయస్సు :

  • ప్రాజెక్ట్ ఇంజనీర్ కి దరఖాస్తు చేసుకొనే వారికి 33 సంవత్సరాలు 
  • టెక్నికల్ ఆఫీసర్ కి దరఖాస్తు చేసుకొనే వారికి 30 సంవత్సరాలు
  • అసిస్టెంట్ ప్రాజెక్టు ఇంజనీర్ కి దరఖాస్తు చేసుకొనే వారికి 25 సంవత్సరాలు లోపు వయస్సు వుండాలి.

🔥 వయస్సులో సడలింపు : 

  • ఎస్సీ , ఎస్టీ వారికి 5 సంవత్సరాలు
  • ఓబీసీ (నాన్ క్రిమి లేయర్) వారికి 3 సంవత్సరాలు
  • PWBD వారికి 10 సంవత్సరాలు వయో సడలింపు కలదు.

🔥 జీతం :

  • ప్రాజెక్ట్ ఇంజనీర్ : మొదటి సంవత్సరం నెలకు 40,000/- రూపాయలు నుండి ప్రారంభం అయి 4 వ సంవత్సరం 55,000/- రూపాయలకు చేరుతుంది. ( సంవత్సరానికి 5,000/- చొప్పున పెరుగుతుంది )
  • టెక్నికల్ ఆఫీసర్ : మొదటి సంవత్సరం నెలకు 25,000/- రూపాయలు నుండి ప్రారంభం అయి 3 , 4 వ సంవత్సరం 31000/- రూపాయలకు చేరుతుంది. ( సంవత్సరానికి 3,000/- చొప్పున పెరుగుతుంది)
  • అసిస్టెంట్ ప్రాజెక్టు ఇంజనీర్ / అసిస్టెంట్ ఇంజనీర్ : మొదటి సంవత్సరం నెలకి 24500/- రూపాయలు 2వ సంవత్సరం నెలకి 26950/- రూపాయలు

3 , 4 వ సంవత్సరం నెలకి 30000/- రూపాయలు లభిస్తుంది.

🔥 ఎంపిక విధానం :

  • ఇంటర్వ్యూ నిర్వహణ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
  • అభ్యర్థులకు వారి క్వాలిఫికేషన్ లో వచ్చిన మార్కులకు 20 శాతం వెయిటిజి ఇస్తారు.
  • సంబంధిత విభాగంలో పని అనుభవంనకు 30 శాతం వెయిట్ఏజ్ ఇస్తారు.
  • పర్సనల్ ఇంటర్వ్యూ కి 50 శాతం వెయిటిజి ఇస్తారు.

🔥 ఇంటర్వ్యూ  తేది & కేంద్రాలు :

  • అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ నుండి అప్లికేషన్ ను డౌన్లోడ్ చేసుకొని , దరఖాస్తు ను ఫీల్ చేసి  ఇంటర్వ్యూ నిర్వహణ తేది నాడు సంబంధిత ఇంటర్వ్యూ కేంద్రానికి ఉదయం 9:00 గంటలకు హాజరు కావాలి.
  • ఇంటర్వ్యూ కి హాజరు అయినప్పుడు క్రింది డాక్యుమెంట్స్ ను తీసుకొని వెళ్ళాలి.

🔥 అవసరమగు ధృవపత్రాలు :

  • 10 వ తరగతి సర్టిఫికెట్
  • బి. ఈ / బి. టెక్ లేదా డిప్లొమా అర్హత కి సంబంధించిన సర్టిఫికెట్లు మరియు మార్క్స్ షీట్లు
  • ఎక్సపీరియన్స్ సర్టిఫికెట్
  • కుల ధ్రువీకరణ పత్రం
  • ఆధార్ లేదా పాస్పోర్ట్ ( దృవీకరణ కోసం )
  • పాస్పోర్ట్ సైజ్ కలర్ ఫోటోలు
  • ఇతర సర్టిఫికెట్లు
  • ఇంటర్వ్యూ తేది నాడు  రిజిస్ట్రేషన్ ఉదయం 11:30 నిముషాలకి క్లోజ్ అవుతుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!