హైదరాబాద్ లో భారత అణుశక్తి సంస్థలో ఉద్యోగాలు భర్తీ | TIFR Hyderabad Recruitment 2024 | Latest jobs Notifications in Telugu

భారత ప్రభుత్వం , డిపార్టుమెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ పరిధిలో గల అటానమస్ సంస్థ అయినటువంటి టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్ ( TIFR ) సంస్థ నుండి వివిధ ఉద్యోగాల భర్తీ కొరకు నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ ఉద్యోగాలకు అన్ని కేటగిరీ ల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.

ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించిన పూర్తి వివరాలు కోసం ఈ ఆర్టికల్ మొత్తం చదవండి.

🔥 ICSIL లో ఉద్యోగాలు – Click here

🔥 Google లో డిగ్రీ అర్హతతో ఇంటి నుండి పనిచేసే ఉద్యోగాలు – Click here 

✅ ఫ్రెండ్స్ మీ WhatsApp / Telegram కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ / టెలిగ్రామ్ ఛానల్ లో జాయిన్ అవ్వండి.. 

🔥 రిక్రూట్మెంట్ చేపట్టే సంస్థ

  • టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్ ( TIFR ) అనే సంస్థ ఈ నోటిఫికేషన్ విడుదల చేసింది.

🔥 మొత్తం ఉద్యోగాల సంఖ్య : 05

🔥 భర్తీ చేయబోయే ఉద్యోగాలు :

  • మెడికల్ ఆఫీసర్ ( D)
  • పార్ట్ టైం సైకాలజిస్టు 
  • ప్రాజెక్టు నర్స్  ( A )
  • ప్రాజెక్ట్ సైంటిఫిక్ అసిస్టెంట్ (B)
  • ప్రాజెక్ట్ క్లర్క్  (A)

🔥 విద్యార్హత :

1)మెడికల్ ఆఫీసర్ : 

  • మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ద్వారా గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా  సంస్థ నుండి ఫుల్ టైం  MD ( జనరల్ మెడిసిన్ ) తో పాటు ఏదైనా సంస్థ నందు లేదా హాస్పిటల్ నందు  మెడికల్ ఆఫీసర్ లేదా సీనియర్ రిజిస్టర్ గా ఒక సంవత్సరం అనుభవం కలిగి వుండాలి. 

                    ( లేదా )

మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ద్వారా గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా  సంస్థ నుండి 60 శాతం మార్కులతో ఫుల్ టైమ్ ఎంబీబీఎస్ తో పాటు ఏదైనా సంస్థ నందు లేదా హాస్పిటల్ నందు  మెడికల్ ఆఫీసర్ లేదా సీనియర్ రిజిస్టర్ గా 5 సంవత్సరాల అనుభవం కలిగి వుండాలి.

2) పార్ట్ టైం సైకాలజిస్టు :

  • గుర్తింపు పొందిన సంస్థ లేదా యూనివర్సిటీ నుండి సైకాలజీ లో మాస్టర్స్ డిగ్రీ లేదా Ph.D పూర్తి చేసి వుండాలి.
  • దీనితో పాటుగా గుర్తింపు పొందిన సంస్థ నందు 3 సంవత్సరాల సైకాలజిస్టు లేదా స్టూడెంట్ కౌన్సెలింగ్ అనుభవం అవసరం
  • అభ్యర్థి రీహాబిలిటేషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా లైసెన్స్ పొంది వుండాలి.

3) ప్రాజెక్ట్ నర్స్

  • మూడు సంవత్సరాల ఫుల్ టైం నర్సింగ్ మరియు మిడ్ వైఫరీ డిప్లొమా & ఫుల్ టైం HSC పూర్తి చేసి వుండాలి.
  • “A” గ్రేడ్ నర్స్ గా రిజిస్టర్ అయి వుండాలి.
  • కనీసం 2 సంవత్సరాలు హాస్పిటల్ లో పనిచేసిన అనుభవం వుండాలి.
  • కంప్యూటర్ నాలెడ్జ్ కలిగి వుండాలి.

4) ప్రాజెక్టు సైంటిఫిక్ అసిస్టెంట్ : 

  •  గుర్తింపు పొందిన సంస్థ లేదాయూనివర్సిటీ నుండి 60 శాతం మార్కులతో ల్యాబ్ బయోలాజికల్ సైన్సెస్ లేదా బయోటెక్నాలజీ లేదా  ల్యాబ్ టెక్నాలజీ ఉత్తీర్ణత సాధించాలి.
  • హిస్టాలజీ , హిస్టో కెమిస్ట్రీ , టిష్యూ ప్రాసెసింగ్ అండ్ సెక్షనింగ్ లో ఒక సంవత్సరం పని అనుభవం అవసరం.

5) ప్రాజెక్టు క్లర్క్

  •  గుర్తింపు పొందిన సంస్థ నుండి 50 శాతం మార్కులతో ఏదైనా విభాగంలో డిగ్రీ ఉత్తీర్ణత 
  •  కంప్యూటర్ నాలెడ్జ్ కలిగి వుండాలి , ప్రభుత్వం ద్వారా గుర్తింపు పొందిన సంస్థ నుండి కంప్యూటర్ నాలెడ్జ్ సర్టిఫికెట్ కలిగి వుండాలి.
  • టైపింగ్ సామర్థ్యం కలిగి వుండాలి.
  • ఒక సంవత్సరం పాటు ఏదైనా సంస్థ నందు క్లెరికల్ అనుభవం వుండాలి.

🔥 గరిష్ఠ వయస్సు :

  • మెడికల్ ఆఫీసర్ మరియు పార్ట్ టైం సైకాలజిస్టు పోస్టులకు 40 సంవత్సరాల లోపు వయస్సు వుండాలి.
  • ప్రాజెక్ట్ నర్స్ పోస్టు నకు 30 సంవత్సరాలలోపు వయస్సు వుండాలి.
  • ప్రాజెక్ట్ సైంటిఫిక్ అసిస్టెంట్ & ప్రాజెక్టు క్లర్క్ ఉద్యోగాలకు 28 సంవత్సరాల లోపు వయస్సు కలిగి వుండాలి.
  • గరిష్ట వయస్సు నిర్ధారణ కొరకు జూలై 01 / 2024 ను కట్ ఆఫ్ తేది గా నిర్ధారించారు.
  • PWBD వారికి 10 సంవత్సరాలు వయో సడలింపు కలదు.

🔥దరఖాస్తు విధానం :

  • అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ ద్వారా ఆన్లైన్ విధానం లో అప్లై చేయాలి.
  • Ex సర్వీస్ మాన్ మరియు PwBD అభ్యర్థులు  వయస్సు సడలింపు కోరితే ఆన్లైన్ విధానం ద్వారా అప్లై చేసి , ఆ దరఖాస్తును పొస్ట్ ద్వారా అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ ,  TIFR హైదరాబాద్ వారికి ఆ దరఖాస్తు తో పాటు సంబంధిత దృవపత్రాలు ను తేది : 08/11/2024 లోగా పంపించాలి.

🔥 జీతం :

  • పోస్టులను అనుసరించి జీతం లభిస్తుంది.
  • మెడికల్ ఆఫీసర్ ( D) : 132660/- రూపాయల జీతం తో పాటు 20 శాతం NPA లభిస్తుంది.
  • పార్ట్ టైం సైకాలజిస్టు : ఒక విజిట్ కి 3076 /- రూపాయలు లభిస్తుంది.
  •  ప్రాజెక్టు నర్స్  ( A ) : 77550/- రూపాయల జీతం లభిస్తుంది.
  • ప్రాజెక్ట్ సైంటిఫిక్ అసిస్టెంట్ (B) : 62200/- రూపాయల జీతం లభిస్తుంది.
  • ప్రాజెక్ట్ క్లర్క్  (A) : 40000)- రూపాయల జీతం లభిస్తుంది.

🔥 ఎంపిక విధానం :

  • మెడికల్ ఆఫీసర్ వారిని వ్రాత పరీక్ష లేదా పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు.
  • పార్ట్ టైం సైకాలజిస్టు వారిని పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు.
  • ప్రాజెక్ట్ నర్స్ వారిని వ్రాత పరీక్ష లేదా ట్రేడ్ టెస్ట్ & పర్సనల్ ఇంటర్వ్యూ నిర్వహణ ద్వారా ఎంపిక చేస్తారు.
  •  ప్రాజెక్ట్ సైంటిఫిక్ అసిస్టెంట్ వారిని వ్రాత పరీక్ష లేదా పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు.
  • ప్రాజెక్ట్ క్లర్క్ ఉద్యోగాలకు వ్రాత పరీక్ష మరియు స్కిల్ టెస్ట్ నిర్వహణ ద్వారా ఎంపిక చేస్తారు.

🔥 ముఖ్యమైన తేదిలు: 

  • ఆన్లైన్ విధానం ద్వారా అప్లై చేసుకోవడానికి చివరి తేది : 08/11/2024
  • వయస్సు నిర్ధారణ కొరకు కట్ ఆఫ్ తేది : 01/07/2024

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!