Headlines

గ్రామీణ విద్యుత్ కార్యాలయాల్లో ట్రైనీ సూపర్వైజర్ ఉద్యోగాలు భర్తీ | PGCIL Trainee Supervisor Jobs Recruitment 2024 | Latest Government Jobs Recruitment 2024

భారత ప్రభుత్వం , పవర్ మినిస్ట్రీ పరిధిలో గల మహారత్న పబ్లిక్ సెక్టార్ ఎంటర్ ప్రైజ్ అయినటువంటి పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (PGCIL) సంస్థ నుండి ట్రైనీ సూపర్వైజర్ (ఎలక్ట్రికల్) ఉద్యోగాల భర్తీ కొరకు నోటిఫికేషన్ విడుదల అయ్యింది.

మొత్తం 70 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు , ఈ ఉద్యోగాలకు డిప్లొమా పూర్తి చేసిన అభ్యర్థులు అర్హులు.

ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించిన పూర్తి వివరాలు కోసం ఈ ఆర్టికల్ మొత్తం చదవండి.

🔥 ICSIL లో ఉద్యోగాలు – Click here

🔥 Google లో డిగ్రీ అర్హతతో ఇంటి నుండి పనిచేసే ఉద్యోగాలు – Click here 

✅ ఫ్రెండ్స్ మీ WhatsApp / Telegram కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ / టెలిగ్రామ్ ఛానల్ లో జాయిన్ అవ్వండి.. 

📌 Join Our What’s App Channel 

📌 Join Our Telegram Channel

🔥 రిక్రూట్మెంట్ చేపట్టే సంస్థ : 

పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్  (PGCIL) నుండి ఈ నోటిఫికేషన్ విడుదల చేసారు.

🔥 మొత్తం ఉద్యోగాల సంఖ్య : 70

🔥 భర్తీ చేయబోయే ఉద్యోగాలు : 

  • ట్రైనీ సూపర్వైజర్ ( ఎలక్ట్రికల్ ) అనే పోస్టులు భర్తీ చేస్తున్నారు.

🔥 విద్యార్హత :  

  • గుర్తింపు పొందిన సంస్థ లేదా యూనివర్సిటీ నుండి ఎలక్ట్రికల్ / ఎలక్ట్రికల్ ( పవర్ ) / ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ / పవర్ సిస్టమ్స్ ఇంజనీరింగ్ / పవర్ ఇంజనీరింగ్ ( ఎలక్ట్రికల్ ) విభాగం లో 3 సంవత్సరాలు రెగ్యులర్ డిప్లొమా పూర్తి చేసి వుండాలి.
  • జనరల్ / EWS / ఓబీసీ ( నాన్ క్రీములేయర్ ) అభ్యర్థులు పైన పేర్కొన్న డిప్లొమా లో 70 శాతం మార్కులు తప్పనిసరి గా రావాలి.
  • ఎస్సీ , ఎస్టీ &  PwBD అభ్యర్థులు కి పాస్ మార్కులు తప్పనిసరిగా రావాలి.
  • బి. టెక్ / బి. ఈ / ఏం. ఈ / ఏం. టెక్ పూర్తి చేసిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి అనర్హులు.

🔥 గరిష్ఠ వయస్సు : 

  • అభ్యర్థుల గరిష్ట వయస్సు 27 సంవత్సరాల లోపు వుండాలి.
  • వయస్సు నిర్ధారణకు 06/11/2024 ను కట్ ఆఫ్ తేదిగా నిర్ణయించారు.
  • ఎస్సీ , ఎస్టీ వారికి 5 సంవత్సరాలు
  • ఓబీసీ ( నాన్ క్రిమి లేయర్) వారికి 3 సంవత్సరాలు
  • PWBD వారికి 10 సంవత్సరాలు వయో సడలింపు కలదు.

🔥దరఖాస్తు విధానం :

  • అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ ద్వారా ఆన్లైన్ విధానం లో అప్లై చేయాలి.

🔥 అప్లికేషన్ ఫీజు

  • ఎస్సీ , ఎస్టీ , PwBD, ex – సర్వీస్ మాన్ అభ్యర్థులు ఎటువంటి అప్లికేషన్ ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు.
  • పైన పేర్కొన్న అభ్యర్థులు తప్ప మిగతావారు అందరూ 300 /- రూపాయల అప్లికేషన్ ఫీజును ఆన్లైన్ విధానం లో చెల్లించాలి.

🔥 పే స్కేల్ :

  • ఈ ఉద్యోగానికి ఎన్నిక కాబడిన అభ్యర్థులు ఒక సంవత్సరం ట్రైనింగ్ పీరియడ్ లో వుంటారు.

వీరికి 24,000/- రూపాయల బేసిక్ పే తో పాటు వివిధ రకాల అలవెన్స్ లు లభిస్తాయి.

  • ట్రైనింగ్ కాలం తర్వాత వీరు సబ్ జూనియర్ ఇంజనీర్ గా పరిగణించబడతారు.

🔥 ఎంపిక విధానం :

  • వ్రాత పరీక్ష లేదా కంప్యూటర్ ఆధారిత పరీక్ష నిర్వహణ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
  • ఈ వ్రాత పరిక్ష లేదా కంప్యూటర్ ఆధారిత పరీక్ష మొత్తం 170 మార్కులకు గాను నిర్వహిస్తారు. 2 గంటల సమయంలో పరీక్ష నిర్వహిస్తారు.
  • ఇందులో టెక్నికల్ నాలెడ్జ్ టెస్ట్ & ఆప్టిట్యూడ్ టెస్ట్ వుంటాయి.
  •  ¼ వ వంతు నెగెటివ్ మార్కింగ్ విధానం కలదు.

🔥 పరీక్ష కేంద్రాలు : భారతదేశం లోని ప్రముఖ నగరాలతో పాటు తెలుగు రాష్ట్రాల లోని హైదరాబాద్ లో పరీక్ష నిర్వహిస్తారు.

🔥 ముఖ్యమైన తేదిలు

  • ఆన్లైన్ విధానం ద్వారా అప్లై చేసుకోవడానికి ప్రారంభ తేది : 16/10/2024
  • ఆన్లైన్ విధానం ద్వారా అప్లై చేసుకోవడానికి చివరి తేది :06/11/2024

👉  Click here for notification 

👉 Click here for official website

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!