APPSC Group 2 Mains Date Announced | APPSC Group 2 Latest News Today | APPSC Group 2 Update

ఆంధ్రప్రదేశ్ లో గ్రూప్స్ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు శుభవార్త ! అభ్యర్థులు ఎన్నో రోజుల నుండి ఎదురుచూస్తున్న గ్రూప్ – 2 మెయిన్స్ ఎగ్జామ్ తేది ను ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రకటించింది. ఈ మేరకు తేది 30/10/2024 న కమిషన్ అధికారిక వెబ్ నోట్ ను వెబ్సైట్ లో పోస్ట్ చేసింది.

ఈ సమాచారాన్ని సంబధించిన పూర్తి సమాచారం కొరకు ఈ ఆర్టికల్ ను చివరి వరకు చదవండి.

ఆంధ్రప్రదేశ్ లో గ్రూప్ – 2 ఉద్యోగాల భర్తీ కొరకు డిసెంబర్ 2023 లో ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వారు నోటిఫికేషన్ విడుదల చేసారు.ఏదైనా సాధారణ డిగ్రీ ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులు ఈ పోస్టులకు అర్హులు కావడంతో  రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 4,80000  పైగా దరఖాస్తులు వచ్చాయి.

తేది : 25/02/2024 న కమిషన్ వారు నిర్వహించిన ప్రిలిమ్స్ పరిక్ష కు  4,04039 మంది అభ్యర్థులు హాజరు అయ్యారు.అయితే ఈ ప్రిలిమ్స్ పరీక్షా మునుపెన్నడూ లేనంత కఠినంగా వుండడం , నోటిఫికేషన్ లో ప్రస్తావించిన సిలబస్ ను ప్రామాణికం గా తీసుకోలేదు అన్న వుద్దేశ్యం తో అభ్యర్థులు వుండడంతో , అభ్యర్థుల విజ్ఞప్తి మేరకు APPSC వారు 1:100 నిష్పత్తిలో అభ్యర్థులను మెయిన్స్ కి ఎంపిక చేశారు.

ఏపీపీఎస్సీ వారు విడుదల చేసిన 899 గ్రూప్ –  2 ఉద్యోగాలలో ఖాళీల వివరాలు ఇలా వున్నాయి.

  • డిప్యూటీ తహసీల్దార్ –  114
  • ఎక్సైజ్  సబ్ ఇన్స్పెక్టర్ – 150
  • మున్సిపల్ కమిషనర్ ( గ్రేడ్ – 3 ) – 4
  • సబ్ రిజిస్టర్ ( గ్రేడ్ – 2 ) -16
  • అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ – 28 వంటి ప్రముఖ పోస్ట్లు కలవు.
  • మొత్తం ఎగ్జిక్యూటివ్ పోస్ట్లు – 331
  • మొత్తం నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్ట్లు – 568

ప్రిలిమ్స్ పరీక్షా ఫలితాలను ఏప్రిల్ 05 / 2024 న ప్రకటించగా ఇందులో 89,900 మంది మెయిన్స్ పరీక్ష కు అర్హత సాధించారు.

2024 జూన్  నెలలోనే మెయిన్స్ పరీక్ష నిర్వహించాల్సివుంది కాగా , షెడ్యూల్ ను వెబ్ నోట్ ద్వారా ప్రకటించినప్పటికీ ఆ తర్వాత కాలంలో ఏపీపీఎస్సీ చైర్మన్ పదవికి రాజీనామా చేయడం ,చైర్మన్ పదవి ఖాళీగా వుండడం తో మరియు ఇతర కారణాలతో మెయిన్స్ పరీక్ష ను వాయిదా వేయడం జరిగింది.

ఇటీవల కొత్త ఏపీపీఎస్సీ ఛైర్మన్ గా మాజీ  ఐపీఎస్   అధికారిణి AR అనురాధ గారు బాధ్యతలు చేపట్టడంతో ఏపీపీఎస్సీ వారు పెండింగ్ విషయాలపై మళ్ళీ దృష్టి సారించారు.

  • ఇందులో మొదటిగా తేది :30/10/2024 న విడుదల చేసిన వెబ్ నోట్ ద్వారా ఏపీపీఎస్సీ గ్రూప్ – 2 మెయిన్స్ పరీక్ష తేది ను జనవరి 05 /2025 న నిర్వహించనున్నట్లు తెలిపింది. 
  • ఈ పరీక్ష  ఆఫ్లైన్ విధానం లో నిర్వహిస్తారు.
  • మెయిన్స్ పరీక్ష లో మొత్తం 2 పేపర్లు వుంటాయి.మొత్తం 309 మార్కులకు గాను నిర్వహించే ఈ పరీక్ష లో పేపర్ -1 లో ఆంధ్రప్రదేశ్ చరిత మరియు భారత దేశం రాజ్యాంగం సబ్జెక్టులు , పేపర్ – 2 లో సైన్స్ అండ్ టెక్నాలజీ & భారత , ఆంధ్రప్రదేశ్  ఎకానమీ సబ్జెక్టులు వుంటాయి. అన్ని ప్రశ్నలు ఆబ్జెక్టివ్ విధానంలో వుంటాయి. ⅓ వంతు నెగెటివ్ మార్కింగ్ విధానం కలదు.
  • పరీక్ష కు అతి తక్కువ సమయం అందుబాటులో వుండడం తో  ఈ ఉద్యోగం సాదించేందుకు అభ్యర్థులు అధిక కృషి చేయాల్సి వుంది. 

🏹 Apply GROUP 2 పూర్తి కోర్సు మా app లో సీనియర్ ఫ్యాకల్టీతో చెప్పించడం జరిగింది. పూర్తి కోర్సు 499/- Only 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!