ఇంటిలిజెంట్ కమ్యూనికేషన్ సిస్టమ్స్ ఇండియా లిమిటెడ్ (ICSIL) నుండి ల్యాబ్ హెల్పర్ అనే ఉద్యోగాలను కాంట్రాక్ట్ , ఔట్సోర్సింగ్ విధానంలో భర్తీ చేసేందుకు అర్హత కలిగిన వారి నుంచి దరఖాస్తులు కోరుతూ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేశారు.
ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు అర్హత కలిగిన వారు నవంబర్ 10వ తేదీలోపు ఆన్లైన్ విధానంలో రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకొని నవంబర్ 12వ తేదీన జరిగే ఇంటర్వ్యూకు స్వయంగా హాజరు కావాలి.
ఇంటర్వ్యూకు హాజరయ్యేవారు ఒరిజినల్ సర్టిఫికెట్లు మరియు ఒక సెట్ జిరాక్స్ కాపీలతో పాటు రెండు పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు పట్టుకొని వెళ్ళాలి. ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకుని అప్లికేషన్ ఫీజ్ ఆన్లైన్ విధానంలో చెల్లించిన వారికి మాత్రమే ఇంటర్వ్యూకు హాజరు కావడానికి అవకాశం ఉంటుంది.
✅ ఫ్రెండ్స్ మీ వాట్సాప్ / టెలిగ్రామ్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాల సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ , టెలిగ్రామ్ ఛానల్స్ లో జాయిన్ అవ్వండి.
🔥 రిక్రూట్మెంట్ చేపట్టే సంస్థ :
- ప్రస్తుతం ఈ నోటిఫికేషన్ ఇంటెలిజెంట్ కమ్యూనికేషన్ సిస్టమ్స్ ఇండియా లిమిటెడ్ (ICSIL) అనే ప్రభుత్వ రంగ సంస్థ విడుదల చేసింది.
🔥 మొత్తం ఉద్యోగాల సంఖ్య : 08
- ICSIL విడుదల చేసిన ఈ నోటిఫికేషన్ ద్వారా ల్యాబ్ హెల్పర్ అనే ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.
🔥 జీతం :
- ఈ ఉద్యోగాలకు ఎంపికైన వారికి 21,927/- జీతము ఇస్తారు.
🔥 విద్యార్హతలు :
- పదో తరగతి విద్యార్హత కలిగి ఉండాలి.
- ఆహార ఉత్పత్తి/ బేకరీ మరియు మిఠాయి / F&B / వసతి / ఫ్రంట్ ఆఫీస్ / హౌస్ కీపింగ్ లో ఒకటి లేదా ఒకటిన్నర సంవత్సరం ట్రేడ్ డిప్లమో కోర్సు పూర్తి చేసి ఉండాలి. లేదా 1 / 1 ½ / 2 సంవత్సరాల అప్రెంటిస్ పూర్తి చేసి ఉండాలి.
🔥 కనీస వయస్సు :
- కనీసం 18 సంవత్సరాలు వయస్సు కలిగి ఉండాలి.
🔥 గరిష్ట వయస్సు :
- గరిష్ట వయసు 35 సంవత్సరాలు
🔥 దరఖాస్తు విధానం :
- ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు అర్హత కలిగిన వారు నవంబర్ 10వ తేదీలోపు ఆన్లైన్ విధానంలో రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకొని నవంబర్ 12వ తేదీన జరిగే ఇంటర్వ్యూకు స్వయంగా హాజరు కావాలి.
🔥 ఎంపిక విధానం :
- అర్హత కలిగిన అభ్యర్థులను ఇంటర్వ్యూ మరియు సర్టిఫికెట్ వెరిఫికేషన్ వంటి వాటి ఆధారంగా ఎంపిక చేస్తారు.
🔥 అప్లికేషన్ ఫీజు : 590/-
🔥 ముఖ్యమైన తేదీలు :
- దరఖాస్తు కొరకు చివరి తేది : 10/11/2024
- ఇంటర్వ్యూ తేదీ : 12/11/2024
🔥 ఇంటర్వ్యూ ప్రదేశం : Venue: Delhi Institute of Hotel Management & Catering Technology, Lajpat Nagar-IV, New Delhi – 110024