తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు చేయబడ్డ మున్సిపాలిటీలలో పలు ఉద్యోగాలను భర్తీ చేసేందుకు గాను ఉత్తర్వులు జారీ చేయబడ్డాయి.
మొత్తం 316 పోస్టులను మంజూరు చేస్తూ ఫైనాన్స్ సెక్రటరీ సందీప్ కుమార్ సుల్తానియా ఉత్తర్వులు జారీ చేసారు.
భర్తీ చేయబోవు ఈ ఉద్యోగాలలో మున్సిపల్ కమిషనర్లు (గ్రేడ్ -1, గ్రేడ్ -2 & గ్రేడ్ -3) , హెల్త్ ఆఫీసర్లు, రెవెన్యూ మేనేజర్లు , శానిటరీ సూపర్వైజర్ లు , శానిటరీ ఇన్స్పెక్టర్ , హెల్త్ అసిస్టెంట్ , జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలు కలవు.
ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించిన పూర్తి వివరాలు కోసం ఈ ఆర్టికల్ మొత్తం చదవండి.
🏹 తెలంగాణ తపాల శాఖలో పదో తరగతి ఉద్యోగ అవకాశాలు – Click here
🏹 తెలంగాణ నీటిపారుదల శాఖలో ఉద్యోగాలు – Click here
✅ ఫ్రెండ్స్ మీ వాట్సాప్ / టెలిగ్రామ్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాల సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ , టెలిగ్రామ్ ఛానల్స్ లో జాయిన్ అవ్వండి.
🔥 రిక్రూట్మెంట్ చేపట్టే సంస్థ : తెలంగాణ మున్సిపల్ శాఖ
🔥 మొత్తం ఉద్యోగాల సంఖ్య : 316
🔥 భర్తీ చేయబోయే ఉద్యోగాలు:
- గ్రేడ్ -1 సెలక్షన్ గ్రేడ్ మున్సిపల్ కమిషనర్లు – 7
- గ్రేడ్ -2 అసిస్టెంట్ మున్సిపల్ కమిషనర్లు – 43
- గ్రేడ్ -3 మున్సిపల్ కమిషనర్లు – 41
- హెల్త్ ఆఫీసర్లు – 7
- రెవెన్యూ మేనేజర్లు – 11
- సానిటరీ సూపర్వైజర్ – 10
- సానిటరీ ఇన్స్పెక్టర్ – 86
- హెల్త్ అసిస్టెంట్ – 96
- జూనియర్ అసిస్టెంట్ ( HDO & రీజినల్ ఆఫీస్ ) – 15
🔥 విద్యార్హత :
- ఏదైనా డిగ్రీ లేదా పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ లేదా తత్సమాన అర్హత కలిగి వుండాలి.
🔥 వయస్సు :
- 18 సంవత్సరాల నుండి 46 సంవత్సరాల లోపు గా వయస్సు వున్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగలరు.
- ఎస్సీ , ఎస్టీ వారికి 5 సంవత్సరాలు
- ఓబీసీ ( నాన్ క్రిమి లేయర్) వారికి 3 సంవత్సరాలు
- PWBD వారికి 10 సంవత్సరాలు వయో సడలింపు కలదు.
🔥దరఖాస్తు విధానం :
- అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ ద్వారా ఆన్లైన్ విధానం లో అప్లై చేయాలి.
🔥 ఎంపిక విధానం :
- వ్రాత పరీక్ష నిర్వహించి ఎంపిక చేస్తారు.
🔥 జీతం :
- ఎంపిక కాబడిన పోస్ట్ ఆధారంగా 40వెలకి పైగా జీతం లభిస్తుంది
🔥 పరీక్ష కేంద్రాలు :
- రాష్ట్రంలో ప్రముఖ నగరాలలో పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేస్తారు.
🔥 నోట్ :
- ఈ ఉద్యోగాలకు నోటిఫికేషన్ కి మరికొద్ది రోజులలో విడుదల కానుంది , కావున అభ్యర్థులు అధికారిక నోటిఫికేషన్ విడుదల అయ్యాక పూర్తి నోటిఫికేషన్ చదివి ఈ పోస్టులకు అప్లై చేసుకోగలరు.
- అధికారిక నోటిఫికేషన్ విడుదల అయ్యాక పూర్తి నోటిఫికేషన్ సమాచారాన్ని మరో ఆర్టికల్ ద్వారా మీకు తెలియచేస్తాము.