భారతదేశంలోని వివిధ మేజర్ పోర్ట్ లలో ఎగ్జిక్యూటివ్ లెవెల్ పోస్టుల భర్తీ కొరకు ఇండియన్ పోర్ట్స్ అసోసియేషన్ సంస్థ నోటిఫికేషన్ విడుదల చేసింది.
ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించిన పూర్తి వివరాలు కోసం ఈ ఆర్టికల్ మొత్తం చదవండి.
🔥 రిక్రూట్మెంట్ చేపట్టే సంస్థ : ఇండియన్ పోర్ట్స్ అసోసియేషన్
🔥 మొత్తం ఉద్యోగాల సంఖ్య : 33
🔥 భర్తీ చేయబోయే ఉద్యోగాలు :
- అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ( సివిల్ ) – 25
- జూనియర్ ఎగ్జిక్యూటివ్ ( సివిల్ ) – 08
🔥 విద్యార్హత :
1) అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ( సివిల్) :
- గుర్తింపు పొందిన సంస్థ లేదా యూనివర్సిటీ నుండి సివిల్ ఇంజనీరింగ్ లో డిగ్రీ పూర్తి చేసి వుండాలి లేదా తత్సమాన అర్హత కలిగి వుండాలి.
2) జూనియర్ ఎగ్జిక్యూటివ్ ( సివిల్ ) :
- గుర్తింపు పొందిన సంస్థ లేదా యూనివర్సిటీ నుండి సివిల్ ఇంజనీరింగ్ విభాగంలో 60 శాతం మార్కులతో B.E / B.Tech పూర్తి చేసి వుండాలి.
🔥 గరిష్ఠ వయస్సు :
- దరఖాస్తు చేసుకోవాలి అనుకుంటున్న అభ్యర్థులు వయస్సు 30 సంవత్సరాలు దాటి వుండరాదు.
- ఎస్సీ మరియు ఎస్టీ వారికి 5 సంవత్సరాలు
- ఓబీసీ ( నాన్ క్రిమి లేయర్) వారికి 3 సంవత్సరాలు
- PWBD వారికి 10 సంవత్సరాలు వయో సడలింపు కలదు.
🔥దరఖాస్తు విధానం :
- అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ ద్వారా ఆన్లైన్ విధానం లో అప్లై చేయాలి.
🔥 అప్లికేషన్ ఫీజు :
- అన్ రిజర్వడ్ అభ్యర్థులు – 400 రూపాయలు
- ఓబీసీ & EWS అభ్యర్థులు – 300 రూపాయలు
- ఎస్సీ & ఎస్టీ & మహిళలు – 200 రూపాయలు
- PwBD & ఎక్స సర్వీస్ మాన్ – ఎటువంటి ఫీజు లేదు.
🔥 జీతం :
- అభ్యర్థులు ఎంపిక కాబడిన పోస్ట్ ఆధారంగా బేసిక్ పే , DA, కేఫెటీరియా అలోవన్స్ & హౌస్ రెంట్ అలొవన్స్ మొదలగునవి లభిస్తాయి.
🔥 ఎంపిక విధానం :
- అభ్యర్థులకు ఆన్లైన్ పరీక్ష నిర్వహించి ఎంపిక చేస్తారు.
- ఆన్లైన్ పరీక్ష మొత్తం 110 ప్రశ్నలు , 160 మార్కులకు కాను , 120 నిముషాల కాలపరిమితి తో నిర్వహిస్తారు.
- సివిల్ ఇంజనీరింగ్ విభాగ ప్రశ్నలు 50 ప్రశ్నలకు కాను 100 మార్కులు కేటాయించారు.
- రీజనింగ్ ,క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ , జనరల్ అవేర్నెస్ , ఇంగ్లీష్ లాంగ్వేజ్ సబ్జెక్టుల్లో 15 ప్రశ్నలు చొప్పున 60 ప్రశ్నలు ,60 మార్కులు కేటాయించారు.
- ప్రతి ప్రశ్నకు తప్పు సమాధానం గుర్తిస్తే ¼ నెగెటివ్ మార్కులు కలవు.
🔥 పరీక్ష కేంద్రాలు :
- ఆన్లైన్ పరీక్ష ను అన్ని రాష్ట్రాల రాజధానులలో , మేజర్ పోర్ట్ సిటీలలో నిర్వహిస్తారు.
🔥 ముఖ్యమైన తేదిలు :
- ఆన్లైన్ విధానం ద్వారా అప్లై చేసుకోవడానికి ప్రారంభ తేది : 28/10/2024
- ఆన్లైన్ విధానం ద్వారా అప్లై చేసుకోవడానికి చివరి తేది : 20/11/2024
👉 Click here for official website