Headlines

ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగులకు 20 లక్షల ఉద్యోగాలు కల్పనకు ప్రభుత్వం చర్యలు | AP Government Latest News About 20 Lakh Jobs | AP Jobs

ఆంధ్రప్రదేశ్ లో 2024 ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని అమలు చేసేందుకు కూటమి ప్రభుత్వం మరో ముందడుగు వేసింది. రాష్ట్రంలో 20 లక్షలు ఉద్యోగాలు కల్పనకు సూచనలు చేసేందుకు ప్రభుత్వం మంత్రులతో ఒక కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీకి చైర్మన్ గా మానవ వనరులు మరియు ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ గారిని నియమించింది. 

ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఈ కమిటీలో మంత్రులు TG భరత్, గొట్టిపాటి రవికుమార్, P. నారాయణ, కొండపల్లి శ్రీనివాస్, కందుల సురేష్ సభ్యులుగా ఉన్నారు. 

🏹 APRTC లో జిల్లాల వారీగా ఖాళీలు భర్తీ – Click here 

🏹 ఆంధ్ర బ్యాంకులో 1500 ఉద్యోగాలు – Click here 

🏹 APRTC లో 7545 ఉద్యోగాలు భర్తీ – Click here 

✅ ఫ్రెండ్స్ మీ వాట్సాప్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాల సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ , టెలిగ్రామ్ ఛానల్స్ లో జాయిన్ అవ్వండి.

ఎన్నికల హామీ అమలు భాగంగా 20 లక్షలు ఉద్యోగాల కల్పనకు ప్రభుత్వం తీసుకోవాల్సిన చర్యలు, వివిధ రంగాల్లో ఉన్న అవకాశాలపై అధ్యయనం చేసి ఈ కమిటీ ప్రభుత్వానికి నివేదిక అందజేయాలి. 

ముఖ్యంగా ప్రభుత్వ శాఖల్లో పెట్టుబడులను ఆకర్షించడం, తద్వారా ఉద్యోగాలను సృష్టించడం, నైపుణ్యాభివృద్ధికి శిక్షణ మరియు ఇతర అంశాలపై ఈ కమిటీ అధ్యయనం చేసి ప్రభుత్వానికి నివేదిక అందజేస్తుంది. 

కమిటీ ఇచ్చిన నివేదికపై పరిశీలన చేసిన తర్వాత ప్రభుత్వం వీటిపై చర్యలు చేపట్టి నిరుద్యోగులకు వివిధ రంగాల్లో ఉద్యోగాలను కల్పించే ప్రయత్నం చేస్తుంది. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!