భారత ప్రభుత్వ, మినిస్ట్రీ ఆఫ్ పవర్ పరిధిలో గల మహారత్న పబ్లిక్ సెక్టార్ ఎంటర్ప్రైస్ పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (PGCIL) సంస్థ నుండి డిప్లొమా ట్రైనీ (ఎలక్ట్రికల్ ) , డిప్లొమా ట్రైనీ ( సివిల్) , జూనియర్ ఆఫీసర్ ట్రైనీ (HR) జూనియర్ ఆఫీసర్ ట్రైనీ (F & A) , అసిస్టెంట్ ట్రైనీ (F&A) పోస్టుల భర్తీ కొరకు నోటిఫికేషన్ విడుదల అయ్యింది.
ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించిన పూర్తి వివరాలు కోసం ఈ ఆర్టికల్ మొత్తం చదవండి.
🏹 ఎరువులు తయారీ సంస్థలో జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలు భర్తీ – Click here
🏹 రాత పరీక్ష లేకుండా పోస్టల్ డిపార్ట్మెంట్లో ఉద్యోగాలు – Click here
✅ ఫ్రెండ్స్ మీ వాట్సాప్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాల సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ , టెలిగ్రామ్ ఛానల్స్ లో జాయిన్ అవ్వండి.
🔥 రిక్రూట్మెంట్ చేపట్టే సంస్థ : పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్
🔥 మొత్తం ఉద్యోగాల సంఖ్య : 802
రీజియన్ ల వారీగా పోస్టుల వారీగా పోస్టుల సంఖ్య కొరకు ఆర్టికల్ చివరన గల అఫిషియల్ నోటిఫికేషన్ ను డౌన్లోడ్ చేసుకోగలరు.
🔥 భర్తీ చేయబోయే ఉద్యోగాలు:
- డిప్లొమా ట్రైనీ (ఎలక్ట్రికల్ ) – DTE
- డిప్లొమా ట్రైనీ ( సివిల్) – DTC
- జూనియర్ ఆఫీసర్ ట్రైనీ ( HR) – JOT ( HR)
- జూనియర్ ఆఫీసర్ ట్రైనీ (F&A) – JOT (F&A)
- అసిస్టెంట్ ట్రైనీ ( F&A )
🔥 విద్యార్హత :
- డిప్లొమా ట్రైనీ ఎలక్ట్రికల్ :
- గుర్తింపు పొందిన సంస్థ నుండి ఎలక్ట్రికల్ / ఎలక్ట్రికల్ ( పవర్) / ఎలక్ట్రికల్ మరియు ఎలక్ట్రానిక్స్ / పవర్ సిస్టమ్స్ ఇంజనీరింగ్ / పవర్ ఇంజనీరింగ్ ( ఎలక్ట్రికల్ ) విభాగాలలో 3సంవత్సరాల పూర్తి కాలపు డిప్లొమా ఉత్తీర్ణత ( జనరల్ / ఓబీసీ (NOC) / EWS అభ్యర్థులు 70 శాతం మార్కులు & ఎస్సీ , ఎస్టీ PwBD వారు పాస్ మార్కులు తప్పనిసరి)
- ఉన్నత చదువులు వున్న వారు అనర్హులు ( B. E/ B.Tech / M.E / M.Tech)
- డిప్లొమా ట్రైనీ సివిల్ :
- గుర్తింపు పొందిన సంస్థ నుండి సివిల్ విభాగం లో 3 సంవత్సరాల పూర్తి కాలపు డిప్లొమా పూర్తి చేసి వుండాలి.( జనరల్ / ఓబీసీ (NOC) / EWS అభ్యర్థులు 70 శాతం మార్కులు & ఎస్సీ , ఎస్టీ PwBD వారు పాస్ మార్కులు తప్పనిసరి)
- ఉన్నత చదువులు వున్న వారు అనర్హులు ( B. E / B.Tech / M.E / M.Tech)
- జూనియర్ ఆఫీసర్ ట్రైనీ ( HR) :
- గుర్తింపు పొందిన సంస్థ నుండి 3 సంవత్సరాల పూర్తి కాలపు BBA / BBM / తత్సమాన అర్హత పూర్తి చేసి వుండాలి.
- జనరల్ / ఓబీసీ (NOC) / EWS అభ్యర్థులు 60 శాతం మార్కులు తప్పనిసరి.
- ఉన్నత చదువులు వున్న వారు అనర్హులు
- జూనియర్ ఆఫీసర్ ట్రైనీ ( F & A) :
- ఇంటర్ CA/ ఇంటర్ CMA పూర్తి చేసి వుండాలి.
- ఉన్నత చదువులు వున్న వారు అనర్హులు
- అసిస్టెంట్ ట్రైనీ (F & A) :
- గుర్తింపు పొందిన సంస్థ నుండి B.com ఉత్తీర్ణత
- జనరల్ / ఓబీసీ (NOC) / EWS అభ్యర్థులు 60 శాతం మార్కులు తప్పనిసరి.
- ఎస్సీ , ఎస్టీ , PwBD వారు పాస్ మార్కులు తప్పనిసరి
🔥 గరిష్ఠ వయస్సు :
- తేది 12/11/2024 నాటికి 27 సంవత్సరాల వయస్సు దాటి వుండరాదు.
- ఎస్సీ, ఎస్టీ వారికి 5 సంవత్సరాలు
- ఓబీసీ ( నాన్ క్రిమి లేయర్) వారికి 3 సంవత్సరాలు
- PWBD వారికి 10 సంవత్సరాలు వయో సడలింపు కలదు.
🔥దరఖాస్తు విధానం :
- అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ ద్వారా ఆన్లైన్ విధానం లో అప్లై చేయాలి.
- ఈ నోటిఫికేషన్ ద్వారా వివిధ రీజియన్ లలో ఒకే సారి రిక్రూట్మెంట్ జరిపి ,ఒకే సారి పరిక్ష నిర్వహిస్తారు కావున అభ్యర్థులు ఏదో ఒక రీజియన్ కి మాత్రమే అప్లై చేసుకోగలరు.
🔥 అప్లికేషన్ ఫీజు :
- ఎస్సీ , ఎస్టీ , PwBD, ex – సర్వీస్ మాన్ వారికి ఎటువంటి ఫీజు లేదు.
- మిగతా అభ్యర్థులుకు ఫీజు ఉంది.
- డిప్లొమా ట్రైనీ (ఎలక్ట్రికల్ ) , డిప్లొమా ట్రైనీ ( సివిల్) , జూనియర్ ఆఫీసర్ ట్రైనీ ( HR) జూనియర్ ఆఫీసర్ ట్రైనీ (F & A) పోస్ట్ లకు అప్లై చేయాలి అనుకుంటే – 300/- రూపాయలు
- అసిస్టెంట్ ట్రైనీ ( F&A) – పోస్ట్ లకు అప్లై చేయాలి అనుకుంటే 200/- రూపాయలు నాన్ రిఫండబుల్ అప్లికేషన్ ఫీజు ను చెల్లించాలి.
🔥 ఎంపిక విధానం :
- DTE / DTC పోస్టులకు అప్లై చేసుకున్న వారికి వ్రాత పరీక్ష లేదా కంప్యూటర్ ఆధారిత పరిక్ష నిర్వహణ ద్వారా ఎంపిక చేస్తారు.
- JOT ( HR) / (F&A) , అసిస్టెంట్ ట్రైనీ ( F&A) పోస్టులకు అప్లై చేసుకున్న వారికి వ్రాత పరిక్ష / కంప్యూటర్ ఆధారిత పరీక్ష తో పాటు కంప్యూటర్ స్కిల్ టెస్ట్ నిర్వహణ ద్వారా ఎంపిక చేస్తారు.
- వ్రాత పరీక్ష / కంప్యూటర్ ఆధారిత పరిక్ష లో టెక్నికల్ నాలెడ్జ్ ప్రశ్నలు 120 , ఆప్టిట్యూడ్ ఆధారిత ప్రశ్నలు 50 , మొత్తం 170 ప్రశ్నలు వుంటాయి.
- ప్రతీ సరైన సమాధానానికి 1 మార్కు , తప్పు సమాధానానికి ¼ రుణాత్మక మార్కులు.
🔥 పరీక్ష కేంద్రాలు :
దేశం లోని పలు ముఖ్య పట్టణాల తో పాటు తెలుగు రాష్ట్రాలలో హైదరాబాద్ , విజయవాడ, విశాఖపట్నం లలో పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేస్తారు.
🔥 సర్వీస్ బాండ్ :
- కనీసం 3 సంవత్సరాలకి క్రింద తెలిపిన విధంగా సర్వీస్ బాండ్ కి కట్టుబడి వుండాలి.
- DTE / DTC / JOT ( HR) / JOT ( F&A) :
- జనరల్ / ఓబీసి(NCL) / EWS వారు – 2,50,000/- రూపాయలు
- ఎస్సీ / ఎస్టీ/ PwBD / ex – సర్వీస్ మాన్ – 1,25,000 /- రూపాయలు
2) అసిస్టెంట్ ట్రైనీ ( F&A) :
- జనరల్ / ఓబీసి(NCL) / EWS వారు – 1,25,000/- రూపాయలు
- ఎస్సీ / ఎస్టీ / PwBD / Ex – సర్వీస్ మాన్ – 62,500 /- రూపాయలు
🔥 ముఖ్యమైన తేదిలు :
- ఆన్లైన్ విధానం ద్వారా అప్లై చేసుకోవడానికి ప్రారంభ తేది : 22/10/2024
- ఆన్లైన్ విధానం ద్వారా అప్లై చేసుకోవడానికి చివరి తేది : 12/11/2/024
- అర్హత నిర్ధారణ కొరకు కట్ ఆఫ్ తేది : 12/11/2024
👉 Click here for official website