తెలంగాణ రాష్ట్రంలో కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయాల్లో ఏఎన్ఎం మరియు అకౌంటెంట్ అనే ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతూ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న పోస్టులకు అర్హత ఉండేవారు తమ దరఖాస్తులను అక్టోబర్ 25వ తేదీ నుండి నవంబర్ 1వ తేదీ మధ్య అప్లికేషన్ పెట్టుకోవాలి.
ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించిన మరికొన్ని ముఖ్యమైన వివరాలు ఈ ఆర్టికల్ చివరి వరకు చదివి తెలుసుకొని మీకు అర్హత ఉంటే అప్లికేషన్ పెట్టుకోండి. నోటిఫికేషన్ వివరాలు డౌన్లోడ్ చేయడానికి ఈ ఆర్టికల్ చివర్లో ఒక లింక్ ఇవ్వబడినది.
🏹 ఎరువులు తయారీ సంస్థలో జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలు భర్తీ – Click here
🏹 రాత పరీక్ష లేకుండా పోస్టల్ డిపార్ట్మెంట్లో ఉద్యోగాలు – Click here
✅ ఫ్రెండ్స్ మీ వాట్సాప్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాల సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ , టెలిగ్రామ్ ఛానల్స్ లో జాయిన్ అవ్వండి.
🔥 రిక్రూట్మెంట్ చేపట్టే సంస్థ :
జిల్లా విద్యాశాఖ అధికారి కార్యాలయం , రంగారెడ్డి జిల్లా నుండి ఈ నోటిఫికేషన్ విడుదల చేయబడినది
🔥 భర్తీ చేయబోయే ఉద్యోగాలు :
ANM మరియు అకౌంటెంట్ అనే ఉద్యోగాలను భర్తీ చేసేందుకు ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేశారు.
🔥 మొత్తం ఖాళీల సంఖ్య : 07
- ANM – 02 పోస్టులు
- అకౌంటెంట్ – 05 పోస్టులు
🔥 విద్యార్హతలు :
- ANM ఉద్యోగాలకు ఇంటర్మీడియట్ అర్హతతో పాటు ANM సర్టిఫికెట్ కోర్స్ పూర్తి చేసి ఉండాలి.
- అకౌంటెంట్ ఉద్యోగాలకు కామర్స్ లో డిగ్రీ పూర్తి చేసి ఉండి బిఎస్సి కంప్యూటర్ స్కిల్స్ కోర్స్ పూర్తి చేసి ఉండాలి. లేదా బీకాం కంప్యూటర్స్ పూర్తి చేసిన వాళ్లు కూడా ఈ ఉద్యోగాలకు అర్హులు.
🔥 కనీస వయస్సు : 18 సంవత్సరాలు
🔥 వయస్సు: 46 సంవత్సరాలు
🔥 వయస్సులో సడలింపు :
- SC, ST, BC అభ్యర్థులకు వయస్సులో ఐదు సంవత్సరాలు సడలింపు వర్తిస్తుంది.
- వికలాంగులకు 10 సంవత్సరాలు వయసులో సడలింపు వర్తిస్తుంది.
🔥దరఖాస్తు విధానం : అర్హత కలిగిన అభ్యర్థులు జిల్లా విద్యాశాఖ అధికారి కార్యాలయంలో లభించే దరఖాస్తు నింపి , అవసరమైన అన్ని సర్టిఫికెట్స్ జిరాక్స్ కాపీల పైన అట్టేస్టేషన్ చేయించి అప్లికేషన్ అందజేయాలి.
🔥 అప్లికేషన్ అందించాల్సిన చిరునామా : జిల్లా విద్యాశాఖ కార్యాలయం, రెండవ అంతస్తు (S-27) , కలెక్టరేట్ (IDOC) , రంగారెడ్డి జిల్లా.
🔥 ఫీజు : ఈ పోస్టులకు అప్లై చేయడానికి ఎటువంటి ఫీజు లేదు.
🏹 Note : ఈ ఉద్యోగాలకు అప్లై చేసే ముందు అభ్యర్థులు క్రింద ఉన్న లింకు పైన క్లిక్ చేసి పూర్తి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసి చదివి పూర్తి వివరాలు తెలుసుకొని అప్లై చేయండి.
👉 Download Notification – Click here