తెలంగాణ రెవెన్యూ శాఖలో 10,954 ఉద్యోగాలు భర్తీ చేయనున్న ప్రభుత్వము | Telangana Revenue Department Jobs Recruitment 2024

తెలంగాణలో నిరుద్యోగులకు శుభవార్త ! తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గ్రామీణ రెవెన్యూ శాఖలో 10,954 ఉద్యోగాల భర్తీకి మరికొద్ది రోజులలో  నోటిఫికేషన్ విడుదల చేయనుంది. 

మొత్తం 10954 ఉద్యోగాలలో కొన్ని డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా ,  మరికొన్ని ప్రమోషన్ ద్వారా భర్తీ చేసేందుకు గాను ప్రయత్నాలు ముమ్మరం చేస్తుంది.వీరి ద్వారా నూతన ROR చట్టం – 2024 ను అమలు చేయనున్నారు. ఈ రిక్రూట్మెంట్ ద్వారా ఊరుకి ఒకరు రెవెన్యూ డిపార్ట్మెంట్ నుండి పనిచేసే విధంగా ,  అందుబాటులో ఉండేలా చేస్తారు.

ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించి పూర్తి వివరాలు కోసం ఈ ఆర్టికల్ ను చివరి వరకు చదవండి.

🏹 ఎరువులు తయారీ సంస్థలో జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలు భర్తీ – Click here 

🏹 రాత పరీక్ష లేకుండా పోస్టల్ డిపార్ట్మెంట్లో ఉద్యోగాలు – Click here 

✅ ఫ్రెండ్స్ మీ వాట్సాప్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాల సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ , టెలిగ్రామ్ ఛానల్స్ లో జాయిన్ అవ్వండి.

🔥 రిక్రూట్మెంట్ చేపట్టే సంస్థ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం

🔥 పోస్ట్ పేరు :

గతంలో మాదిరి గా VRO అని కాకుండా గ్రేడ్ -1 , గ్రేడ్ – 2 ,గ్రేడ్ – 3 అధికారులుగా నియమింపవచ్చు.

🔥 మొత్తం పోస్టుల సంఖ్య : 10,954

🔥 విద్యార్హతలు :

  • ఇంటర్మీడియట్ / డిగ్రీ / పీజీ వంటి అర్హతలు అవసరం అగును.

🔥  వయస్సు

  • 18 సంవత్సరాలు నుండి 46 సంవత్సరాల లోపు వయస్సు గల వారు దరఖాస్తు చేసుకోవచ్చు.

 🔥 దరఖాస్తు విధానం : 

  • ఆన్లైన్ / ఆఫ్లైన్ ద్వారా అవకాశం కల్పిస్తారు.

 🔥 జీతం : 

  • నెలకి 25000/- రూపాయల తో పాటు ఇతర అన్ని అలవెన్స్ లు లభిస్తాయి.
  • వీరికి జూనియర్ అసిస్టెంట్ లేదా సీనియర్ అసిస్టెంట్ హోదా కల్పించవచ్చు.

🔥 ఎంపిక విధానం :

దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు వ్రాత పరీక్ష నిర్వహణ ద్వారా ఎంపిక చేస్తారు.

 🔥 నోట్ :

తెలంగాణ లో మొత్తం 10954 రెవెన్యూ గ్రామాలు కి , మొత్తం క్లస్టర్లు, గ్రామ విస్తీర్ణము, పట్టణ – గ్రామీణ స్వభావం వంటి అంశాలు ను తేల్చి , CCLA స్థాయిలో పోస్టుల సంఖ్య నిర్ధారిస్తారు. ఇవి కొత్తగా రిక్రూట్ చేస్తున్న పోస్ట్లు కావున కేబినెట్ ఆమోదం తర్వాత వివిధ డిపార్ట్మెంట్ ల నుండి అప్రూవల్ పొంది , తర్వాత నోటిఫికేషన్ విడుదల చేస్తారు. ఈ రిక్రూట్మెంట్  కి సంబంధించి , అధికారిక నోటిఫికేషన్ ఇంకా విడుదల కాలేదు,అధికారిక నోటిఫికేషన్ విడుదల అయ్యాక పూర్తి సమాచారాన్ని మన వెబ్సైట్ ద్వారా మీకు తెలియచేస్తాము. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!