డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్స్ , మినిస్ట్రీ ఆఫ్ కమ్యూనికేషన్ పరిధిలో గల ఇండియన్ పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ లిమిటెడ్ ( IPPB ) నుండి 344 గ్రామీణ డాక్ సేవక్ ( ఎగ్జిక్యూటివ్) పోస్టుల భర్తీ నిమిత్తం నోటిఫికేషన్ జారీ చేసారు.
ఈ నోటిఫికేషన్ కి సంబంధించిన పూర్తి వివరాలు కోసం ఈ ఆర్టికల్ చివరి వరకు చదవండి
🏹 AP ప్లానింగ్ డిపార్ట్మెంట్లో ఉద్యోగాలు – Click here
✅ ఫ్రెండ్స్ మీ వాట్సాప్ / టెలిగ్రామ్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాల సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ , టెలిగ్రామ్ ఛానల్స్ లో జాయిన్ అవ్వండి.
🔥 రిక్రూట్మెంట్ చేపట్టే సంస్థ :
ఇండియన్ పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ లిమిటెడ్ ఈ నోటిఫికేషన్ విడుదల చేసింది.
🔥 ఉద్యోగాల సంఖ్య: 344
- మొత్తం దేశవ్యాప్తంగా గా 344 ఉద్యోగాలు వుండగా , ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 8 , తెలంగాణ లో 15 ఖాళీలు వున్నాయి.
🔥 భర్తీ చేయబోయే ఉద్యోగాలు: గ్రామీణ డాక్ సేవక్ (ఎగ్జిక్యూటివ్ )
🔥 విద్యార్హతలు :
- గుర్తింపు పొందిన సంస్థ నుండి ఏదైనా డిగ్రీ చేసి వుండాలి.
- అలానే 2 సంవత్సరాలు GDS గా పనిచేసిన అనుభవం కావాలి.
🔥 వయస్సు :
- 20 సంవత్సరాల నుండి 35 సంవత్సరాల వరకు వయసు వున్న వారు అప్లై చేసుకోవచ్చు.
- తేది 01/09/2024 ను వయస్సు లెక్కింపు కు కట్ ఆఫ్ తేదిగా నిర్ణయించారు.
- ఎస్సీ , ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు & ఓబిసి వారికి 3 సంవత్సరాలు వయో సడలింపు కలదు.
🔥 అప్లికేషన్ ఫీజు :
నాన్ రిఫండెబుల్ ఫీజు 750/- రూపాయలు ఆన్లైన్ ద్వారా చెల్లించాలి.
🔥 జీతం : నెలకి 30,000/- రూపాయల జీతం లభిస్తుంది.
🔥దరఖాస్తు విధానం :
- అభ్యర్థులు ఆన్లైన్ విధానం లో అధికారిక వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
🔥ఎంపిక విధానం :
- అభ్యర్థుల యొక్క అకడమిక్ క్వాలిఫికేషన్ డిగ్రీ మార్కుల మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు.
- అవసరం అయితేనే వ్రాత పరీక్ష నిర్వహణ జరుగుతుంది.
🔥 ముఖ్యమైన తేదీలు :
- ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ యొక్క రిజిస్ట్రేషన్ మరియు ఎడిట్ కోసం 11/10/2024 నుండి 30/11/2024 వరకు అవకాశం కల్పించారు.
- అప్లికేషన్ ఫైనల్ సబ్మిషన్ & ఫీజు పేమెంట్ కొరకు చివరి తేది : 31/11/2024.
✍️ నోట్ :
మరిన్ని వివరాలకు అధికారిక నోటిఫికేషన్ ను పూర్తిగా చదవగలరు.
👉 Click here for official notification
👉 Click here for official website