ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పోలీస్ శాఖలో ఉన్న ఖాళీలు మరియు ఉద్యోగాల భర్తీకి సంబంధించి తాజాగా ఒక ముఖ్యమైన సమాచారం రావడం జరిగింది.
ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖలో ఖాళీగా ఉన్న 19,999 పోలీస్ ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుంటుందో తెలియజేయాలి అంటూ హైకోర్టు ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది.
🏹 AP ప్లానింగ్ డిపార్ట్మెంట్లో ఉద్యోగాలు – Click here
✅ ఫ్రెండ్స్ మీ వాట్సాప్ / టెలిగ్రామ్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాల సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ , టెలిగ్రామ్ ఛానల్స్ లో జాయిన్ అవ్వండి.
ఏపీ పోలీస్ శాఖలో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయకపోవడాన్ని సవాల్ చేస్తూ హెల్ప్ ది పీపుల్ చారిటబుల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టి హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం వేశారు. దీనిపై విచారణ చేపట్టిన హైకోర్టు ధర్మాసనం తాజాగా ప్రభుత్వానికి పూర్తి వివరాలతో అఫీడివిట్ దాఖలు చేయాలని కోరింది.
ఈ విచారణ సందర్భంగా పిటిషనర్ తరపు న్యాయవాది వాదనలు వినిపిస్తూ సమాచార హక్కు చట్టం ద్వారా పోలీస్ శాఖలో 19,999 పోస్టులు ఖాళీగా ఉన్నాయని తెలిసిందన్నారు. సుప్రీంకోర్టు కూడా అన్ని రాష్ట్రాల్లో పోలీస్ శాఖలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేయాలి అని ఆదేశిస్తూ ఇచ్చిన ఉత్తర్వులను కోర్టు ముందు ఉంచడం జరిగింది.
ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు తీర్పును అమలు చేయాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు తేల్చి చెప్పింది. ఈ ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై తదుపరి విచారణ మూడు వారాలకు వాయిదా వేసింది హైకోర్టు.
పోలీస్ శాఖలో 6,100 పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాలకు సంబంధించి గతంలో విడుదల చేసిన నోటిఫికేషన్ యెుక్క ప్రిలిమినరీ పరీక్షలో ఉత్తీర్ణులైన వారికి ఇంతవరకు శారీరిక దారుఢ్య పరీక్షలు మరియు మెయిన్స్ పరీక్షలు ఇంకా జరగని విషయం మీ అందరికీ తెలిసిందే.