భారత ప్రభుత్వం పరిధిలో గల భారత దేశంలోనే అతి పెద్ద పబ్లిక్ సెక్టార్ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ అయినటువంటి యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ ( UIIC) సంస్థ నుండి జనరలిస్ట్ & స్పెషలిస్ట్ విభాగాల లో అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ స్కేల్ -1 పోస్ట్ ల భర్తీ కొరకు మంచి నోటిఫికేషన్ విడుదల చేసారు.
ఈ నోటిఫికేషన్ కి సంబంధించి పూర్తి వివరాలు కొరకు ఈ ఆర్టికల్ ను చివరి వరకు చదవండి. ఈ ఆర్టికల్ చివరిలో పూర్తి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేయడానికి ఆన్లైన్లో ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవడానికి అవసరమైన లింక్స్ ఇవ్వబడినవి.
✅ ఫ్రెండ్స్ మీ వాట్సాప్ / టెలిగ్రామ్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాల సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ , టెలిగ్రామ్ ఛానల్స్ లో జాయిన్ అవ్వండి.
🔥 రిక్రూట్మెంట్ చేపట్టే సంస్థ : యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ ( UIICL)
🔥 భర్తీ చేయబోయే ఉద్యోగాలు :
అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ స్కేల్ -1 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.
🔥 ఉద్యోగాల సంఖ్య : 200
- జనరలిస్ట్ విభాగం -100
- స్పెషలిస్ట్ విభాగం -100
- రిస్క్ మేనేజ్మెంట్ విభాగం లో 10
- ఫైనాన్స్ & ఇన్వెస్ట్మెంట్ విభాగం లో 20
- ఆటోమొబైల్ ఇంజనీర్స్ విభాగంలో 20
- కెమికల్ ఇంజనీర్స్ / మెకట్రానిక్స్ ఇంజనీర్స్ విభాగం లో 10
- డేటా అనలిటిక్స్ విభాగం లో 20
- లీగల్ విభాగం లో 20
స్పెషలిస్ట్ విభాగం లో 100 ఖాళీలు , జనరలిస్ట్ విభాగం లో 100 ఖాళీలు కలిపి మొత్తం 200 ఖాళీలు భర్తీ చేస్తున్నారు.
🔥 విద్యార్హతలు :
- జనరలిస్ట్ విభాగం కి సంబంధించి గుర్తింపు పొందిన సంస్థ నుండి ఏదైనా గ్రాడ్యుయేట్ డిగ్రీ / పోస్ట్ గ్రాడ్యుయేట్ 60 శాతం మార్కులు ( ఎస్సీ / ఎస్టీ అభ్యర్థులు : 55శాతం మార్కులు ) సాధించి వున్న వారు అర్హులు.
- స్పెషలిస్ట్ విభాగం :
క్రమ సంఖ్య | విభాగం | విద్యార్హతలు |
1 | రిస్క్ మేనేజ్మెంట్ | 60 శాతం మార్కులతో B.E / B.Tech ( ఎస్సీ ఎస్టీ వారికి 55 శాతం ) ఉత్తీర్ణత తో పాటు రిస్క్ మేనేజ్మెంట్ లో పీజీ / పిజిడిమ్ పూర్తి చేయాలి లేదా M.E/ M.Tech ఉత్తీర్ణత తో పాటు రిస్క్ మేనేజ్మెంట్ లో పీజీ / పిజిడిమ్ పూర్తి చేయాలి |
2 | ఫైనాన్స్ & ఇన్వెస్ట్మెంట్ | చార్టర్ అకౌంటెంట్ ( ICAI ) కాస్ట్ అకౌంటెంట్ ( ICWA )లేదా60 శాతం మార్కులతో ( ఎస్సీ ఎస్టీ వారికి 55 శాతం ) B.com ఉత్తీర్ణత లేదా M.Com ఉత్తీర్ణత |
3 | ఆటోమొబైల్ ఇంజనీర్స్ | 60 శాతం మార్కులతో ( ఎస్సీ ఎస్టీ వారికి 55 శాతం ) ఆటోమొబైల్ ఇంజనీరింగ్ లో B.E / B.Tech ఉత్తీర్ణత లేదా ఆటోమొబైల్ ఇంజనీరింగ్ లో M.E / M.Tech ఉత్తీర్ణత |
4 | కెమికల్ ఇంజనీర్స్ / మెకట్రానిక్స్ ఇంజనీర్స్ | 60 శాతం మార్కులతో ( ఎస్సీ ఎస్టీ వారికి 55 శాతం ) కెమికల్ ఇంజినీరింగ్ మెకట్రానిక్స్ లో B.E / B.Tech ఉత్తీర్ణత లేదా కెమికల్ ఇంజినీరింగ్ మెకట్రానిక్స్ లో M.E / M.Tech ఉత్తీర్ణత |
5 | డేటా అనాలిటిక్స్ | 60 శాతం మార్కులతో ( ఎస్సీ ఎస్టీ వారికి 55 శాతం ) కంప్యూటర్ సైన్స్ / కంప్యూటర్ అప్లికేషన్స్ / IT / గ్రాడ్యుయేట్ ఇన్ స్టాటిస్టిక్స్ / డేటా సైన్స్ / actuarial సైన్స్ లో B.E / B.Tech ఉత్తీర్ణతలేదా స్టాటిస్టిక్స్ / actuarial సైన్స్ / డేటా సైన్స్ లో MCA లేదా పోస్ట్ గ్రాడ్యుయేషన్ లేదా కంప్యూటర్ సైన్స్ / ఐటి లో M.E / M. Tech ఉత్తీర్ణత |
6 | లీగల్ | 60 శాతం మార్కులతో ( ఎస్సీ ఎస్టీ వారికి 55 శాతం ) లా లో బ్యాచిలర్ డిగ్రీ లేదా మాస్టర్ డిగ్రీ ఇన్ లా అభ్యర్థి బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా తో గుర్తింపు పొంది వుండాలి. |
🔥 వయస్సు :
- ఈ పోస్టులకు అప్లై చేయాలి అనుకునే అభ్యర్థులు కనీస వయస్సు 21 సంవత్సరాలు నుండి వుండి, గరిష్ఠ వయస్సు 30 సంవత్సరాలు లోపు వుండాలి , అంటే అభ్యర్థి 01/10/1994 కంటే ముందు, 30/09/2023 తర్వాత పుట్టి వుండరాదు
- వయస్సు నిర్ధారణకు 30/09/2024 ను కట్ ఆఫ్ తేది గా నిర్ణయించారు.
🔥 వయసులో సడలింపు :
- ఎస్సీ ,ఎస్టీ వారికి 5 సంవత్సరాలు
- ఓబీసీ వారికి 3 సంవత్సరాలు
- PWBD వారికి 10 సంవత్సరాలు
- Ex – సర్వీస్ మాన్ కి 5 సంవత్సరాలు వయో సడలింపు కలదు.
- వయస్సు & విద్యార్హత కి కట్ ఆఫ్ తేదిగా 20/10/2024 ను నిర్ణయించారు.
🔥 జీతం : సరాసరిగా 88,000/- రూపాయల సాలరీ లభిస్తుంది.
🔥దరఖాస్తు విధానం :
- అర్హత కలిగిన అభ్యర్థులు ఆన్లైన్ విధానం ద్వారా 15/10/2024 నుండి 05/11/2024 లోగా అప్లై చేసుకోవాలి.
- దరఖాస్తు పూర్తి చేయడంలో మూడు అంశాలు వుంటాయి.
- అప్లికేషన్ రిజిస్ట్రేషన్
- పేమెంట్ ఆఫ్ ఫీజ్
- డాక్యుమెంట్ స్కాన్ & అప్లోడ్
🔥 అప్లికేషన్ ఫీజు :
- ఎస్సీ ఎస్టీ PWBD అభ్యర్థులు 250/- రూపాయలు + GST
- మిగతా అందరు అభ్యర్థులు 1000/- రూపాయలు + GST
నాన్ రిఫండబల్ అప్లికేషన్ ఫీజు ను పే చేయాలి.
🔥ఎంపిక విధానం : దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు జనరలిస్ట్ విభాగం వారికి మరియు స్పెషలిస్ట్ విభాగం వారికి వేరు వేరు గా ఆన్లైన్ పరీక్ష నిర్వహిస్తారు.
ఈ ఆన్లైన్ పరీక్షలో
- రీజనింగ్
- ఇంగ్లీష్ లాంగ్వేజ్
- క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్
- జనరల్ అవేర్నెస్ ( ఫైనాన్షియల్ సెక్టార్ స్పెషల్ రిఫరెన్స్ గా )
- కంప్యూటర్ నాలెడ్జ్
- టెక్నికల్ & ప్రొఫెషనల్ నాలెడ్జ్ ( స్పెశలిస్ట్ విభాగం వారికి ) సబ్జెక్టులు వుంటాయి.
- మొత్తం 250 మార్కులకు గాను 200 ప్రశ్నలు వుంటాయి. 150 నిముషాలలో పరీక్ష ను పూర్తి చేయాలి.
- ఆన్లైన్ టెస్ట్ తర్వాత డిస్క్రిప్టివ్ పరీక్ష నిర్వహిస్తారు. ఇది కేవలం క్వాలిఫైయింగ్ పరీక్ష మాత్రమే.
🔥 పరీక్షా కేంద్రాలు : దేశంలోని పలు ముఖ్య నగరాల తో పాటు తెలుగు రాష్ట్రాల్లో కూడా పరీక్ష కేంద్రాలు ఉన్నాయి.
- ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లోని చీరాల , శ్రీకాకుళం, గుంటూరు , కడప , కర్నూల్ , నెల్లూరు ,రాజమండ్రి , విజయవాడ , విశాఖపట్నం , తిరుపతి, కాకినాడ , చిత్తూరు , కంచిక చెర్ల , ఏలూరు , విజయనగరం
- తెలంగాణ రాష్ట్రం లోని హైదరాబాద్ / రంగారెడ్డి , వరంగల్ ,ఖమ్మం నగరాలలో పరీక్ష ను నిర్వహిస్తారు.
🔥 ముఖ్యమైన తేదీలు :
- ఆన్లైన్ విధానం ద్వారా అప్లై చేయడానికి ప్రారంభ తేది : 15/10/2024
- ఆన్లైన్ విధానం ద్వారా అప్లై చేయడానికి చివరి తేది : 05/11/2024
- అప్లికేషన్ ఫీజు పే చేయడానికి చివరి తేది: 05/11/2024
- వయసు లెక్కింపు ,విద్యార్హత పరిగణన కొరకు కట్ ఆఫ్ తేది :30/09/2024.
- ఆన్లైన్ పరీక్ష కి పది రోజుల ముందు అడ్మిట్ కార్డు డౌన్లోడ్ చేసుకోవడానికి అవకాశం వుంటుంది.
🏹 పూర్తి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేయడానికి క్రింద ఉన్న లింకుపై క్లిక్ చేసి డౌన్లోడ్ చేయండి. నోటిఫికేషన్ల వివరాలు పూర్తిగా చదివిన తర్వాత అప్లికేషన్ పెట్టండి.
👉 Click here for official website