తెలంగాణ రాష్ట్రంలో వైద్య, ఆరోగ్యశాఖలో ఉద్యోగాల జాతర కొనసాగుతుంది. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖలో మరో 371 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ మేరకు తెలంగాణ మెడికల్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు రెండు అనుబంధ నోటిఫికేషన్స్ విడుదల చేసింది. అంటే గతంలో విడుదల చేసిన నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలలో ఈ పోస్టులను కూడా కలిపి భర్తీ చేయడం జరుగుతుంది. ఈ మొత్తం 371 ఉద్యోగాలు మెడికల్ ఇన్సూరెన్స్ డైరెక్టర్ పరిధిలో ఉన్న పోస్టులు.
✅ ఫ్రెండ్స్ మీ వాట్సాప్ / టెలిగ్రామ్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాల సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ , టెలిగ్రామ్ ఛానల్స్ లో జాయిన్ అవ్వండి.
తాజాగా మెడికల్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు జారీ చేసిన ఈ అనుబంధ నోటిఫికేషన్స్ ద్వారా 272 నర్సింగ్ ఆఫీసర్ ఉద్యోగాలను మరియు 99 ఫార్మసిస్ట్ ఉద్యోగాలను భర్తీ చేస్తారు.
ఈ పోస్టుల భర్తీకి అనుబంధ నోటిఫికేషన్లు జారీ చేయడంతో గత నోటిఫికేషన్ లో ఇచ్చిన 2050 నర్సింగ్ ఆఫీసర్ పోస్టులకు అదనంగా 272 పోస్టులు కలిపి మొత్తం 2322 నర్సింగ్ ఆఫీసర్ ఉద్యోగాలను భర్తీ చేస్తారు.
ఇదేవిధంగా ఇప్పటికే విడుదలైన 633 ఫార్మసిస్ట్ ఉద్యోగాలకు 99 పోస్టులు కలుపుకొని 732 ఫార్మసిస్ట్ ఉద్యోగాలను భర్తీ చేస్తారు.
- నర్సింగ్ ఆఫీసర్ ఉద్యోగాలకు అక్టోబర్ 14వ తేదీ వరకు అప్లికేషన్ పెట్టుకునేందుకు అవకాశం ఉంది. ఫార్మసిస్ట్ ఉద్యోగాలకు అక్టోబర్ 21వ తేదీ వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది.
- నర్సింగ్ ఆఫీసర్ ఉద్యోగాలకు సంబంధించిన కంప్యూటర్ ఆధారత పరీక్ష నవంబర్ 23వ తేదీన నిర్వహిస్తారు. ఫార్మసిస్ట్ ఉద్యోగాలకు సంబంధించిన కంప్యూటర్ ఆధారిత పరీక్ష నవంబర్ 30 వ తేదీన నిర్వహిస్తారు.
మెడికల్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు ఇప్పటికే జోన్లవారీగా మరియు కేటగిరీలు వారీగా ఉన్న ఖాళీలు వివరాలను అధికారిక వెబ్సైట్లో ఇటీవల విడుదల చేసింది.
ఈ ఉద్యోగాలు అన్నింటికీ సంబంధించిన పూర్తి నోటిఫికేషన్లు, క్యాటగిరి వారీగా ఖాళీల వివరాలు, తాజాగా విడుదల చేసిన అనుబంధ నోటిఫికేషన్ వివరాలు MHSRB అధికారిక వెబ్సైట్లో అందుబాటులో ఉన్నాయి.
🏹 MHSRB Official Website – Click here
నర్సింగ్ ఆఫీసర్, ఫార్మసిస్ట్, ల్యాబ్ టెక్నీషియన్ ఉద్యోగాల ఆన్లైన్ క్లాసులు మరియు టెస్ట్ సిరీస్ కోర్సులు కోసం మా యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ( మా యాప్ లో అతి తక్కువ ధరలో ఈ కోర్సులు మీకు లభిస్తాయి.)
🏹 Download Our App – Click here