మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ పరిధిలో గల జమ్ము కంటోన్మెంట్ బోర్డు నుండి జూనియర్ అసిస్టెంట్ పోస్టుల భర్తీ కొరకు నోటిఫికేషన్ విడుదల చేసారు.
ఈ నోటిఫికేషన్ కి సంబంధించి పూర్తి వివరాలు కొరకు ఈ ఆర్టికల్ ను చివరి వరకు చదవండి. అర్హత ఉంటే త్వరగా అప్లై చేయండి..
🏹 ఎరువులు తయారీ సంస్థలో జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలు భర్తీ – Click here
🔥 రిక్రూట్మెంట్ చేపట్టే సంస్థ :
జమ్ము కంటైన్మెంట్ బోర్డు నుండి ఈ నోటిఫికేషన్ విడుదల చేయబడింది.
🔥 భర్తీ చేయబోయే ఉద్యోగాలు:
జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.
🔥 మొత్తం ఖాళీల సంఖ్య : 03
🔥 విద్యార్హతలు :
ఏదైనా గుర్తింపు పొందిన సంస్థ నుండి ఏదైనా డిగ్రీ పూర్తి చేసి వుండాలి మరియు నిముషానికి 35 పదాలు టైప్ చేయగలిగే సామర్థ్యం కలిగి వుండాలి.
🔥వయస్సు:
- 21 నుండి 30 సంవత్సరాల లోపు వయసు వుండాలి.
- వయసు లెక్కింపు కి కట్ ఆఫ్ తేదిగా 01.11.2024 ను పరిగణిస్తారు.
🔥 జీతము : 25,500/- నుండి 81,100/- వరకు పే స్కేల్ ఉంటుంది.
🔥 వయస్సులో సడలింపు :
ప్రభుత్వ నిబంధనల ప్రకారం క్రింది విధంగా వయస్సులో సడలింపు ఉంటుంది.
- ఎస్సీ& ఎస్టీ వారికి 5 సంవత్సరాలు
- ఓబీసీ వారికి 3 సంవత్సరాలు
- PH వారికి 10 సంవత్సరాలు నిబంధనల మేరకు వయో సడలింపు కలదు.
🔥దరఖాస్తు విధానం:
అర్హత కలిగిన అభ్యర్థులు ఆఫ్లైన్ విధానం (by hand / by post) ద్వారా 10/10/2024 తేది నుండి 31/10/2024 తేది లోగా ఫిల్ చేసిన అప్లికేషన్ తో పాటు సంబంధిత దృవపత్రాలు అటాచ్ చేసి ఆఫీస్ చిరునామా కి పంపించాలి.
🔥 అప్లికేషన్ తో పాటు పంపించాల్సిన ధృవపత్రాలు:
- డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్
- రెండు కలర్ పాస్పోర్ట్ ఫోటోలు
- విద్యార్హత కి సంబంధించిన సర్టిఫికెట్లు
- కుల ధ్రువీకరణ పత్రం/ EWS సర్టిఫికెట్ ( సంబంధిత వర్గాల వారు)
- ఒరిజినల్ డిమాండ్ డ్రాఫ్ట్ ఆఫ్ అప్లికేషన్ ఫీ
🔥 ధృవపత్రాలు పంపించాల్సిన చిరునామా:
Office of the Jammu Cantonment Board, Satwari Jammu Cantt -180003.
🔥 ఫీజు:
- ఓబీసీ& EWS & ex – సర్వీస్ మెన్ వారికి 1200/- రూపాయలు
- ఎస్సీ, ఎస్టీ, PH, ట్రాన్స్జెండర్ వారికి 800/- రూపాయలు
- ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తు ఫీజు ను చెల్లించాలి.
- ఫీజు ను డిమాండ్ డ్రాఫ్ట్ (DD) ద్వారా చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ – జమ్ము కంటైనమెంట్ బోర్డు వారి పేరు మీదుగా చెల్లించాలి.
- రిజర్వేషన్ కేటగిరీ వారికి ఫీజు రీఫండ్ చేయడం జరుగును.
🔥ఎంపిక విధానం:
- వ్రాత పరీక్ష మరియు స్కిల్ టెస్ట్ నిర్వహించి అభ్యర్థులు ను ఎంపిక చేస్తారు.
- OMR ఆధారిత వ్రాత పరీక్ష 100 ఆబ్జెక్టివ్ ప్రశ్నలను కలిగి వుంటుంది. 120 నిముషాల సమయం ఇస్తారు. ఈ పరీక్ష లు ఇంగ్లీష్ కాంప్రహెన్సన్, జనరల్ నాలెడ్జ్, న్యూమరికల్ ఆప్టిట్యూడ్, జనరల్ ఇంటెలిజన్స్ సబ్జెక్టు లు కలవు.
- ఆ తర్వాత స్కిల్ టెస్ట్ నిర్వహిస్తారు.
🔥 ముఖ్యమైన తేదీలు
- ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తు కొరకు ప్రారంభ తేది : 10/10/2024
- దరఖాస్తు కొరకు చివరి తేది : 31/10/2024
🏹 Note :
ఈ ఉద్యోగాలకు అప్లై చేసే ముందు అభ్యర్థులు క్రింద ఉన్న లింకు పైన క్లిక్ చేసి పూర్తి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసి చదివి పూర్తి వివరాలు తెలుసుకొని అప్లై చేయండి.
👉 Click here for official website