ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పాఠశాల విద్యా శాఖకు చెందిన సమగ్ర శిక్ష నుండి 729 పోస్టులతో నాన్ టీచింగ్ ఉద్యోగాలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న 352 టైప్ -3 కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయాల్లో 547 పోస్టులు మరియు 145 టైప్ -4 కస్తూరిబా గాంధీ బాలిక విద్యాలయాల్లో 182 పోస్టులను భర్తీ చేసేందుకు అర్హత కలిగిన వారి నుంచి దరఖాస్తుల కోరుతున్నారు. ఈ ఉద్యోగాలను అవుట్సోర్సింగ్ పద్ధతిలో భర్తీ చేస్తున్నారు కాబట్టి ఈ ఉద్యోగాలు ఎంపికలో ఎటువంటి రాత పరీక్ష నిర్వహించరు.
ఈ ఉద్యోగాలకు అర్హత ఉన్నవారు అక్టోబర్ 15వ తేదీ లోపు తమ అప్లికేషన్ మండల విద్యాశాఖ అధికారి (MEO) కార్యాలయంలో అందజేయాల్సి ఉంటుంది. ఎటువంటి విద్యార్హత లేని వారు, 7వ తరగతి పూర్తి చేసిన వారు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు.
నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి ముఖ్యమైన వివరాలు ఈ ఆర్టికల్ చివరి వరకు చదివి తెలుసుకొని మీకు అర్హత ఉంటే తప్పనిసరిగా త్వరగా అప్లై చేయండి.
🏹 విద్యుత్ సరఫరా సంస్థలో ట్రైనింగ్ + జాబ్ – Click here
🏹 రైల్వేలో 3115 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల – Click here
✅ ఫ్రెండ్స్ మీ వాట్సాప్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాల సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ , టెలిగ్రామ్ ఛానల్స్ లో జాయిన్ అవ్వండి.
🔥 నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ : సమగ్ర శిక్ష, ఆంధ్రప్రదేశ్
🔥 భర్తీ చేస్తున్న పోస్టులు : హెడ్ కుక్, అసిస్టెంట్ కుక్, వాచ్ ఉమెన్, స్కావెంజర్, స్వీపర్, చౌకీదారు అనే ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు.
🔥 అర్హతలు : ఎటువంటి విద్యార్హత లేని వారు మరియు 7వ తరగతి పాస్ అయిన వారు కూడా ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు.
🔥 మొత్తం ఖాళీల సంఖ్య : 729
- టైప్ -3 కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయాల్లో 547 పోస్టులు భర్తీ చేస్తున్నారు.
- టైప్ -4 కస్తూరిబా గాంధీ బాలిక విద్యాలయాల్లో 182 పోస్టులు భర్తీ చేస్తున్నారు.
🔥 జీతము : టైప్ -3 మరియు టైప్ -4 KGBV ల్లో అన్ని రకాల ఉద్యోగాలకు జీతము 15,000/- ఇస్తారు.
🔥 ఫీజు : ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి ఎటువంటి ఫీజు లేదు
🔥 వయస్సు : 18 నుండి 42 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన వారు ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి అర్హులు.
🔥 వయస్సులో సడలింపు :
- SC, ST, BC, EWS అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు వయస్సులో సడలింపు ఉంటుంది.
- PWD అభ్యర్థులకు 10 సంవత్సరాలు వయస్సులో సడలింపు ఉంటుంది.
🔥 ఎంపిక విధానం ఎలా ఉంటుంది :
- ఈ ఉద్యోగాలకు ఎంపికలో ఎటువంటి రాత పరీక్ష నిర్వహించరు.
🔥 అప్లికేషన్ ప్రారంభ తేదీ : 07-10-2024
🔥 అప్లికేషన్ చివరి తేదీ : 15-10-2024
🔥 అప్లికేషన్ అందజేయాల్సిన చిరునామా : స్థానిక మండల విద్యాశాఖ అధికారి కార్యాలయంలో అభ్యర్థులు తమ అప్లికేషన్ అందజేయాలి.
Note : ఈ పోస్టులకు అప్లై చేయాలి అనుకునే అభ్యర్థులు తప్పనిసరిగా క్రింద ఇచ్చిన లింక్ పైన క్లిక్ చేసి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసి, పూర్తి వివరాలు చదివి అప్లై చేయండి.
✅ Download Full Notification – Click here
✅ Download Application – Click here