Headlines

రైల్వే పరీక్ష తేదీలు విడుదల | RRB Exam Dates Announced | RRB ALP, Technician, JE, RPF SI Exam Dates | Download Railway jobs Hall Tickets

2024 లో విడుదలైన వివిధ రైల్వే ఉద్యోగాల పరీక్ష తేదీలను రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ అధికారికంగా ఈరోజు వెల్లడించింది. ఈ పరీక్ష తేదీలకు సంబంధించిన వివరాలు క్రింది విధంగా ఉన్నాయి. 

✅ ఫ్రెండ్స్ మీ వాట్సాప్ / టెలిగ్రాం కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాల సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ , టెలిగ్రామ్ ఛానల్స్ లో జాయిన్ అవ్వండి.

  • అసిస్టెంట్ లోకో పైలట్ ఉద్యోగాలకు సంబంధించిన కంప్యూటర్ ఆధారిత పరీక్షలు (CBT-1) నవంబర్ 25వ తేదీ నుండి నవంబర్ 29వ తేదీ వరకు నిర్వహిస్తారు. 
  • రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ లో సబ్ ఇన్స్పెక్టర్ ఉద్యోగాలకు సంబంధించిన కంప్యూటర్ ఆధారిత పరీక్షలు డిసెంబర్ 2వ తేదీ నుండి డిసెంబర్ 5వ తేదీ వరకు నిర్వహిస్తారు.
  • రైల్వే టెక్నీషియన్ ఉద్యోగాలకు సంబంధించిన కంప్యూటర్ ఆధారిత పరీక్షలు డిసెంబర్ 16వ తేదీ నుండి డిసెంబర్ 26వ తేదీ వరకు నిర్వహిస్తారు. 
  • రైల్వేలో జూనియర్ ఇంజనీర్ మరియు ఇతర ఉద్యోగాలకు సంబంధించిన కంప్యూటర్ ఆధారిత పరీక్షలు (CBT-1) డిసెంబర్ 6వ తేదీ నుండి డిసెంబర్ 13వ తేదీ వరకు నిర్వహిస్తారు. 
  • పరీక్ష తేదీ , పరీక్ష నిర్వహించే పట్టణం వివరాలు మరియు ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు ట్రావెల్ అథారిటీ  డౌన్లోడ్ చేయడానికి అవసరమైన లింక్ వెబ్సైట్లో పరీక్ష తేదీకి పది రోజులు ముందు పెడతారు.  
  • పరీక్ష తేదీకు నాలుగు రోజులు ముందు నుండి హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకోవచ్చు.
  • అభ్యర్థులు పరీక్షా కేంద్రంలోకి ప్రవేశించడానికి ముందే అభ్యర్థులకు ఆధార్‌తో అనుసంధానించబడిన బయోమెట్రిక్ ప్రామాణీకరణ పరీక్షా కేంద్రంలో జరుగుతుంది 
  • కాబట్టి అభ్యర్థులు పరీక్షకు హాజరయ్యే రోజున ఒరిజినల్ ఆధార్ కార్డుతో పరీక్ష కేంద్రానికి హాజరు కావాలి. 
  • రైల్వే రిక్రూట్మెంట్ బోర్డుకి సంబంధించిన ఉద్యోగాలకు సంబంధించిన అప్డేట్స్ కోసం అభ్యర్థులు తరచుగా రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ ల అధికారిక వెబ్సైట్ ఓపెన్ చేస్తూ ఉండాలి అని తాజాగా విడుదల చేసిన ఈ నోటీసులో తెలియజేశారు. 
  • రైల్వే రిక్రూట్మెంట్ బోర్డుల ద్వారా చేసే ఎంపికలు కంప్యూటర్ ఆధారిత పరీక్షలు మరియు అభ్యర్థుల మెరిట్ ఆధారంగా జరుగుతాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!