మీరు డిగ్రీ పూర్తి చేశారా ? జర్నలిస్టుగా పనిచేయాలి అనుకుంటున్నారా ? అయితే ఈ అవకాశం మీకోసమే. ఈనాడు జర్నలిజం స్కూల్ నుండి నోటిఫికేషన్ వెలువడింది. తెలుగు దినపత్రికల్లో అత్యధిక సర్కులేషన్ కలిగి ఉన్న ఈనాడు సంస్థ నుండి ఈ నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది. పాత్రికేయ రంగంలో స్థిరపడాలి అనుకునే వారికి ఈ సంస్థ కల్పిస్తున్న ఒక చక్కటి అవకాశం గా మనం చెప్పవచ్చు.
ఏదైనా డిగ్రీ విద్యార్హత కలిగి, 28 సంవత్సరాల లోపు వయసు ఉన్నవారి నుండి మల్టీమీడియా, టెలివిజన్, మొబైల్ జర్నలిజం విభాగంలో పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లమా కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతున్నారు. ఎంపికైన వారికి ట్రైనింగ్ ఇచ్చి ట్రైనింగ్ సమయంలో స్టైఫండ్ కూడా ఇస్తారు. స్కూల్లో చేరిన అభ్యర్థులు ఏడాది తర్వాత చేసే శిక్షణతో కలిపి రామోజీ గ్రూప్ సంస్థల్లో మూడు సంవత్సరాలు పనిచేసే విధంగా ఒప్పందం ఉంటుంది. ఈ మేరకు ప్రారంభంలోనే ఒప్పంద పత్రాన్ని సమర్పించాల్సి ఉంటుంది.
✅ ఫ్రెండ్స్ మీ వాట్సాప్ / టెలిగ్రామ్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాల సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ , టెలిగ్రామ్ ఛానల్స్ లో జాయిన్ అవ్వండి.
🔥 రిక్రూట్మెంట్ చేపట్టే సంస్థ : ఈనాడు జర్నలిజం స్కూల్
🔥 భర్తీ చేయబోయే ఉద్యోగాలు : జర్నలిస్టు (ముందుగా ఒక సంవత్సరం పాటు ట్రైనింగ్ ఇచ్చి తర్వాత ట్రైనీగా ఉద్యోగ అవకాశం ఇస్తారు)
🔥 అర్హతలు :
- ఏదైనా డిగ్రీ అర్హత ఉండాలి.
- 28 సంవత్సరాలు లోపు వయస్సు ఉండాలి.
- తెలుగులో బాగా రాయగల సామర్థ్యం ఉండాలి.
- ఆంగ్ల భాష పై అవగాహన ఉండాలి
- లోకజ్ఞానం, వర్తమాన వ్యవహారాలపై పట్టు ఉండాలి
- మీడియాలో స్థిరపడాలని బలమైన ఆకాంక్షం ఉండాలి.
- ప్రజా శ్రేయస్సు కోసం పాటుపడాలి అనే తపన కూడా కలిగి ఉండాలి.
🔥 ఎంపిక విధానం :
- వివిధ అంశాలపై రాత పరీక్షలు నిర్వహించి అభ్యర్థులకు తెలుగు మరియు ఇంగ్లీష్ పై ఉన్న అవగాహనను పరీక్షిస్తారు.
- రాత పరీక్షల్లో ఉత్తీర్ణులైన వారికి బృంద చర్చలు మరియు ఇంటర్వ్యూలు నిర్వహించి తుది ఎంపిక చేస్తారు.
🔥 పరీక్ష కేంద్రాలు : మన తెలుగు రాష్ట్రాల్లోని అన్ని ప్రచురణ కేంద్రాల్లో ఈ పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేస్తారు.
🔥 జీతం :
- ఎంపికైన వారికి ఒక సంవత్సరం పాటు ఈనాడు జర్నలిజం స్కూల్లో శిక్షణ ఇస్తారు.
- ఈ శిక్షణ సమయంలో మొదటి ఆరు నెలలు 14 వేల రూపాయలు స్టైఫండ్ తరువాత ఆరు నెలలు 15వేల రూపాయలు స్టైఫండ్ ఇస్తారు.
- ఈనాడు జర్నలిజం స్కూల్లో విజయవంతంగా కోర్సు పూర్తి చేసిన వారికి ట్రేనిగా అవకాశం ఇస్తారు. ఇందులో ఏడాది పాటు జరిగే ట్రైనింగ్ లో 19,000/- జీతం ఇస్తారు.
- ట్రేనిగా శిక్షణ సమయంలో చూపే ప్రతిభా ఆధారంగా ఒక ఏడాది వరకు 21,000/- చొప్పున జీతం ఇస్తారు.
- తరువాత ఉద్యోగం కన్ఫర్మేషన్ చేసి 23,000/- చొప్పున జీతం ఇస్తారు.
🔥 వయస్సు : 28 సంవత్సరాలలోపు వయస్సు ఉండాలి (09-12-2024 నాటికి)
🔥 అప్లికేషన్ విధానం : అర్హత ఉన్నవారు స్వయంగా ఆన్లైన్ విధానంలో అప్లై చేయాలి.
🔥 అప్లికేషన్ ఫీజు : 200/-
🔥 నోటిఫికేషన్ విడుదల చేసిన తేదీ : 15-09-2024
🔥 అప్లికేషన్ చివరి తేదీ : 13-10-2024
🔥 ప్రవేశ పరీక్ష తేదీ : 27-10-2024
🔥 కోర్సు ప్రారంభమయ్యే తేదీ : 09-12-2024
👉 Download Notification Details – Click here