మన రాష్ట్రంలోనే పోస్టింగ్ | ONGC లో 2236 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల | ONGC Recruitment 2024 | ONGC Apprentice Notification 2024

ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పోరేషన్ లిమిటెడ్ (ONGC) నుండి 2236 పోస్టులతో రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా వివిధ ట్రేడ్ లలో అప్రెంటిస్ పోస్టుల భర్తీకి అర్హత కలిగిన వారి నుంచి దరఖాస్తులు కోరుతున్నారు. ఎంపికైన వారికి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న కాకినాడ, రాజమండ్రి ప్రాంతాల్లో కూడా ఈ అప్రెంటిస్ ట్రైనింగ్ ఇస్తారు.

ఈ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేస్తున్న అప్రెంటిస్ పోస్టులకు 10వ తరగతి , 12వ తరగతి , ఐటిఐ, డిప్లొమా, డిగ్రీ, B.E, బిటెక్ వంటి విద్యార్హతలు ఉన్నవారు అప్లై చేసుకోవచ్చు..

ఈ ఆర్టికల్ చివరి వరకు మీరు పూర్తిగా చదివితే అన్ని వివరాలు మీకు స్పష్టంగా తెలుస్తాయి. అన్ని వివరాలు పూర్తిగా తెలుసుకున్నాకే మీకు అర్హత మరియు ఆసక్తి ఉంటే ఈ పోస్టులకు అప్లై చేయవచ్చు. 

▶️ సికింద్రాబాద్ రైల్వేలో 478 ఉద్యోగాలకు నోటిఫికేషన్ – Click here

✅ ఫ్రెండ్స్ మీ వాట్సాప్ / టెలిగ్రామ్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాల సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ , టెలిగ్రామ్ ఛానల్స్ లో జాయిన్ అవ్వండి.

✅ నిరుద్యోగులకు అతి తక్కువ ధరలో రైల్వే , Bank, SSC మరియు ఇతర ఉద్యోగాల ఆన్లైన్ కోచింగ్ ఇప్పుడు మన “ INB Jobs “ APP లో ఏ కోర్స్ అయినా కేవలం 499/- రూపాయలకు మాత్రమే.

🏹  ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించిన మరికొన్ని ముఖ్యమైన వివరాలు ఇలా ఉన్నాయి 👇 👇

🔥 నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ : ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ లిమిటెడ్ (ONGC)

🔥 భర్తీ చేస్తున్న పోస్టులు : వివిధ ట్రేడ్ లలో అప్రెంటిస్ 2,236 పోస్టులకు దరఖాస్తులు కోరుతూ ఈ నోటిఫికేషన్ విడుదల చేశారు.

🔥 మొత్తం ఖాళీల సంఖ్య : 2236

🔥 అప్లికేషన్ ప్రారంభ తేదీ : 05-10-2024

🔥 అప్లికేషన్ చివరి తేదీ : 25-10-2024

🔥 ఫలితాలు విడుదల తేది : 15-11-2024

🔥 అర్హత : 

  • గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ పోస్టులకు B.A / B.Com / B.Sc / B.B.A / B.E / B.Tech అర్హతలు ఉన్నవారు అర్హులు
  • డిప్లమో అప్రెంటిస్ పోస్టులకు సంబంధిత బ్రాంచ్ లలో డిప్లమో పూర్తి చేసిన వారు అర్హులు. 
  • ట్రేడ్ అప్రెంటిస్ పోస్టులకు 10th, 12th, ITI అర్హతలు ఉన్నవారు అర్హులు.

🔥 వయస్సు : నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న పోస్టులకు 18 నుండి 24 సంవత్సరాల మధ్య వయసు ఉన్నవారు అప్లై చేయడానికి అర్హులవుతారు. 

🔥 వయస్సులో సడలింపు : క్రింది విధంగా అభ్యర్థులకు సడలింపు వర్తిస్తుంది.

  • SC, ST అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు వయస్సులో సడలింపు ఉంటుంది.
  • OBC అభ్యర్థులకు మూడు సంవత్సరాలు వయస్సులో సడలింపు ఉంటుంది.
  • PwBD అభ్యర్థులకు 10 సంవత్సరాలు వయస్సులో సడలింపు ఉంటుంది.

🔥 అప్లికేషన్ విధానం : ఈ పోస్టులకు అర్హత ఉన్న అభ్యర్థులు Online లో అప్లై చేయాలి.

🔥 అప్లికేషన్ ఫీజు : అప్లికేషన్ ఫీజు లేదు 

🔥 అప్రెంటిస్ శిక్షణ కాలం : ఒక సంవత్సరం అప్రెంటిస్ శిక్షణ ఇస్తారు.

🔥 స్టైఫండ్ :

  • B.A / B.Com / B.Sc / B.B.A / B.E./ B.Tech అర్హతలు ఉన్న వారికి స్టైఫండ్ 9,000/- ఇస్తారు.
  • డిప్లొమా పూర్తి చేసిన వారికి 8,050/- స్టైఫండ్ ఇస్తారు.
  • 10th / 12th వారికి 7,000/- స్టైఫండ్ ఇస్తారు.
  • ఒక సంవత్సరం ITI పుర్తి చేసిన వారికి 7,700/- స్టైఫండ్ ఇస్తారు.
  • రెండు సంవత్సరాల ITI పుర్తి చేసిన వారికి 8,050/- స్టైఫండ్ ఇస్తారు.

🔥 ఎంపిక విధానం : అప్లై చేసుకున్న అభ్యర్థులకు అర్హత పరీక్షలో వచ్చిన మార్కుల మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. అనగా టెన్త్ మరియు ఐటిఐ లో వచ్చిన మార్కుల మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. 

🔥 పరీక్ష విధానము : ఈ పోస్టుల ఎంపికలో ఎటువంటి పరీక్ష ఉండదు. కేవలం మార్కుల మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు.

🔥 అప్రెంటిస్ శిక్షణ కాలం : ఒక సంవత్సరం 

🔥 పోస్టింగ్ ప్రదేశం : దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో పోస్టింగ్ ఇస్తారు. మన తెలుగు రాష్ట్రాల్లో కాకినాడ, రాజమండ్రి లలో పోస్టింగ్ ఇస్తారు.

🔥 గమనిక : ఈ పోస్టులకు అప్లై చేయాలి అనుకునే అభ్యర్థులు క్రింది ఇచ్చిన లింకుపై క్లిక్ చేసి పూర్తి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసి చదివి అర్హత ఉంటే అప్లై చేయండి. ఇలాంటి మరికొన్ని నోటిఫికేషన్స్ యొక్క సమాచారం మీరు తెలుసుకోవాలి అంటే ఎప్పటికప్పుడు INB Jobs వెబ్సైట్ ఓపెన్ చేసి కొత్త నోటిఫికేషన్ తెలుసుకొని అప్లై చేయండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!