Headlines

ఆంధ్రప్రదేశ్ లో 729 ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు భర్తీ | AP Outsourcing Jobs Recruitment 2023 | AP KGBV Outsourcing Jobs Recruitment 2024

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 729 అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలకు రిక్రూట్మెంట్ చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ సమగ్ర శిక్షకు చెందిన టైప్ -3 మరియు టైప్ -4 కస్తూరిబా గాంధీ బాలిక విద్యాలయాల్లో 729 నాన్ టీచింగ్ పోస్టుల భర్తీకి అర్హత కలిగిన వారి నుంచి దరఖాస్తులు కోరుతున్నారు. టైప్ -3 KGBV ల్లో 547 మరియు టైప్ -4 KGBV ల్లో 182 పోస్టులు భర్తీ చేస్తున్నారు.

ఈ ఉద్యోగాలకు అక్టోబర్ 7వ తేదీన జిల్లా మరియు మండల స్థాయిలో పత్రికల్లో నోటిఫికేషన్ విడుదల చేసిన తరువాత అర్హత ఉన్నవారు అక్టోబర్ 15వ తేదీలోపు మండలాల్లో ఉన్న విద్యాశాఖ అధికారి కార్యాలయాల్లో అప్లై చేయాల్సి ఉంటుంది. ఈ ఉద్యోగాలకు ఎటువంటి రాత పరీక్ష లేకుండా ఎంపిక చేస్తారు. అప్లై చేసుకున్న వారి యొక్క దరఖాస్తులను అక్టోబర్ 21వ తేదీ నాటికి జిల్లా కార్యాలయాలకు పంపిస్తారు. జిల్లా కార్యాలయాల నుండి అక్టోబర్ 22వ తేదీ నాటికి APCOS కీ చేరుతాయి. 

🔥 రిక్రూట్మెంట్ చేపట్టే సంస్థ : ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖకు చెందిన సమగ్ర శిక్ష ఈ రిక్రూట్మెంట్ చేపడుతుంది.

🔥 భర్తీ చేయబోయే ఉద్యోగాలు : కస్తూరిబా గాంధీ బాలిక విద్యాలయాల్లో నాన్ టీచింగ్ ఉద్యోగాలు అయిన హెడ్ కుక్, అసిస్టెంట్ కుక్, వాచ్మెన్, స్వీపర్, స్కావెంజర్, చౌకిదార్ అనే ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.

🔥 మొత్తం ఉద్యోగాల సంఖ్య : 729

  • టైప్ -3 KGBV ల్లో 547 పోస్టులు భర్తీ చేస్తున్నారు. అవి హెడ్ కుక్ – 48, అసిస్టెంట్ కుక్ – 263 , వాచ్ ఉమెన్ -95, స్వీపర్ -62 , స్కావెంజర్ -79 పోస్టులు ఉన్నాయి.
  • టైప్ -4 KGBV ల్లో 182 పోస్టులు భర్తీ చేస్తున్నారు. అవి హెడ్ కుక్ – 48, అసిస్టెంట్ కుక్ – 76, చౌకిదార్ – 58 పోస్టులు ఉన్నాయి.

🔥ఎంపిక విధానం: ఈ ఉద్యోగాలు ఎంపికలో ఎటువంటి రాత పరీక్ష నిర్వహించరు.

🔥 అర్హతలు: ఈ ఉద్యోగాలకు పదో తరగతి, ఇంటర్మీడియట్ వంటి అర్హతలు ఉన్నవారు అప్లై చేసుకోవచ్చు.

🔥 అప్లికేషన్ ఫీజు : ఉద్యోగాలకు అప్లై చేయడానికి ఎటువంటి ఫీజు లేదు .

🔥వయస్సు సడలింపు: 18 నుండి 42 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్నవారు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు. 

  • ఎస్సీ, ఎస్టి, BC ,EWS వారికి 5 సంవత్సరాలు వయసులో సడలింపు వర్తిస్తుంది.
  • PWD అభ్యర్థులకు వయసులో 10 సంవత్సరాల సడలింపు వర్తిస్తుంది.

🔥 అప్లికేషన్ ప్రారంభ తేదీ : ఈ ఉద్యోగాలకు అక్టోబర్ 7వ తేదీ నుండి అప్లై చేయవచ్చు. 

🔥 అప్లికేషన్ చివరి తేదీ : ఈ ఉద్యోగాలకు అక్టోబర్ 15వ తేదీలోపు అప్లై చేయాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!