Headlines

ఆంధ్రప్రదేశ్ లో వ్యవసాయ శాఖలో రాత పరీక్ష లేకుండా ఉద్యోగాలు | Andhrapradesh Agriculture Department jobs | ANGRAU Outsourcing Jobs Recruitment 2024

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ఆచార్య ఎన్జీరంగా అగ్రికల్చరల్ యూనివర్సిటీకి చెందిన రీజనల్ అగ్రికల్చర్ రీసర్చ్ స్టేషన్ (అనకాపల్లి) నుండి “ బయో ఫెర్టిలైజర్ ప్రొడక్షన్ యూనిట్ ఎట్ రీజనల్ అగ్రికల్చర్ రిసిస్ట్రేషన్ అనకాపల్లి అనే ప్రాజెక్టులో పని చేసేందుకు అర్హత కలిగిన వారి నుంచి దరఖాస్తులు కోరుతున్నారు. ఈ ఉద్యోగాలకు అర్హత ఉన్నవారు స్వయంగా ఇంటర్వ్యూకు హాజరు కావాల్సి ఉంటుంది. 

తాజాగా విడుదలైన ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలు, ఉండవలసిన అర్హతలు, ఎంపిక విధానము, జీతము ,అప్లికేషన్ విధానము, వంటి వాటికి సంబంధించిన ముఖ్యమైన సమాచారం అంతా ఈ ఆర్టికల్ చివరి వరకు చదివి తెలుసుకొని మీకు అర్హత ఉంటే తప్పనిసరిగా ఈ ఇంటర్వ్యూకు హాజరయ్యే ప్రయత్నం చేయండి.

నోటిఫికేషన్ కి సంబంధించిన ముఖ్యమైన వివరాలు క్రింది విధంగా ఉన్నాయి. 👇 👇 👇 

✅ ఫ్రెండ్స్ మీ వాట్సాప్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాల సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ , టెలిగ్రామ్ ఛానల్స్ లో జాయిన్ అవ్వండి.

🔥 రిక్రూట్మెంట్ చేపట్టే సంస్థ : ప్రస్తుతం ఈ నోటిఫికేషన్  ఆచార్య ఎన్జీరంగా అగ్రికల్చరల్ యూనివర్సిటీ కి చెందిన రీజనల్ అగ్రికల్చరల్ రీసెర్చ్ స్టేషన్ (అనకాపల్లి) నుండి విడుదల చేయబడినది.

🔥 భర్తీ చేయబోయే ఉద్యోగాలు : ఈ నోటిఫికేషన్ ద్వారా టెక్నికల్ అసిస్టెంట్, లేబరేటరీ టెక్నీషియన్, సెమీస్ స్కిల్డ్ హెల్పర్స్ అనే ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. 

🔥 విద్యార్హతలు : క్రింది విధంగా విద్యార్హతలు కలిగి ఉండాలి.

టెక్నికల్ అసిస్టెంట్ : 

  • ఈ ఉద్యోగాలకు మైక్రోబయాలజీ స్పెషలైజేషన్లో ఎమ్మెస్సీ మైక్రో బయాలజీ లేదా ఎమ్మెస్సీ అగ్రికల్చర్ పూర్తి చేసిన వారు అర్హులు.
  • బయో ఫెర్టిలైజర్ ప్రొడక్షన్ లో అనుభవం కలిగి ఉండాలి.

ల్యాబొరేటరీ టెక్నీషియన్ : 

  • అగ్రికల్చర్ డిప్లమో లేదా బీఎస్సీ అగ్రికల్చర్ పూర్తి చేసి ఉండాలి. 
  • బయో ఫెర్టిలైజర్ ప్రొడక్షన్ లో అనుభవం కలిగి ఉండాలి.

సెమీ స్కిల్డ్ హెల్పర్స్

  • ఏడవ తరగతి పాస్ అయి ఉండాలి. 
  • బయో ఫెర్టిలైజర్ ప్రొడక్షన్ యూనిట్ లో అనుభవం ఉండాలి.

🔥 మొత్తం ఉద్యోగాల సంఖ్య : 04

🔥 జీతం : 

  • టెక్నికల్ అసిస్టెంట్ – 18,000/-
  • లేబరేటరీ టెక్నీషియన్ – 11,000/-
  • సెమీస్ స్కిల్డ్ హెల్పర్స్ – 9,000/-

🔥 ఇంటర్వ్యూ తేదీలు : 17-10-2024

🔥 వయస్సు : గరిష్ఠ వయస్సు 42 సంవత్సరాలు

🔥ఎంపిక విధానం :

ఈ ఉద్యోగాల ఎంపికలో ఎటువంటి రాత పరీక్ష లేకుండా ఇంటర్వ్యూ నిర్వహించి ఎంపిక చేస్తారు.

🔥అప్లికేషన్ ఫీజు : ఇంటర్వ్యూకు హాజరు కావడానికి ఎటువంటి ఫీజు లేదు.

🔥 అప్లికేషన్ విధానం : ఈ ఉద్యోగాలకు అర్హత ఉన్న వారు స్వయంగా ఇంటర్వ్యూకు హాజరు కావాలి 

🔥 అప్లికేషన్ పంపించాల్సిన చిరునామా : Office Of the ADR, RARS, Anakapalle 

🔥 ఉద్యోగం కాలపరిమితి : 11 నెలలు 

🔥 ముఖ్యమైన వివరాలు : 

  • ఇంటర్వ్యూకు హాజరయ్యే వారికి TA / DA చెల్లించరు.
  • ఈ పోస్టులను తాత్కాలిక పద్ధతిలో భర్తీ చేస్తున్నారు. 
  • ఈ ఉద్యోగాలకు అర్హతలు ఉన్నవారు స్వయంగా బయోడేటా , పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు, ఒరిజినల్ సర్టిఫికెట్స్ మరియు వాటి జిరాక్స్ కాపీలతో ఇంటర్వ్యూకు హాజరు కావాలి. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!