232 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసిన యుపిఎస్సి | UPSC Recruitment 2024 | UPSC Engineering Services Recruitment 2024

UPSC Recruitment 2024 : UPSC వారు ఇంజనీరింగ్ సర్వీసెస్ పోస్టుల భర్తీ నిమిత్తం నోటిఫికేషన్ విడుదల చేసారు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 232 పోస్ట్ లను భర్తీ చేయనున్నారు. ఈ ఉద్యోగాలకు అర్హత గల భారతీయ పౌరులు అందరూ అప్లై చేసుకునే అవకాశం ఉంటుంది. 

నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలు ఏమిటి ? ఉండవలసిన అర్హతలు ఏమిటి ? మీరు ఎలా ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి ? వంటి ముఖ్యమైన సమాచారం అంతా ఈ ఆర్టికల్ చివరి వరకు చదివి తెలుసుకొని మీకు అర్హత ఉంటే తప్పనిసరిగా అప్లై చేయండి. ఆర్టికల్ చివర్లో పూర్తి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేయడానికి ఆన్లైన్లో అప్లికేషన్ పెట్టుకోవడానికి అవసరమైన లింక్స్ కూడా ఇవ్వబడినవి.

✅ ఫ్రెండ్స్ మీ వాట్సాప్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాల సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ , టెలిగ్రామ్ ఛానల్స్ లో జాయిన్ అవ్వండి.

🔥 అప్లై చేయి విధానం: యూపీఎస్సీ వారి అధికారిక వెబ్సైట్ www.upsconline.nic.in ద్వారా ఆన్లైన్ లో అప్లై చేయాలి. ముందుగా OTPR ను క్రియేట్ చేసుకోవాలి.. గతంలో OTPR వున్నట్లు అయితే దాని ద్వారా లాగిన్ అయి అప్లై చేసుకోవచ్చు.

🔥 ముఖ్యమైన తేదీలు: అప్లికేషన్ అప్లై చేసుకునే వారు 18.09.2024 నుండి  08.10.2024 సాయంత్రం 6:00 గంటల లోపుగా అప్లై చేసుకోవాలి. ఆ తర్వాత అప్లై లింక్ డిసేబుల్ అవుతుంది.

కరెక్షన్ విండో: 09.10.2024 నుండి 15.10.2024 వరకు అందుబాటులో వుంటుంది.

09.02.2025 న ప్రిలిమినరీ పరీక్ష నిర్వహిస్తారు.

🔥 పోస్టుల వివరాలు: 

కేటగిరీ -1: సివిల్ ఇంజనీరింగ్

కేటగిరీ – 2:మెకానికల్ ఇంజనీరింగ్

కేటగిరీ – 3: ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్

కేటగిరీ – 4: ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్స్  ఇంజనీరింగ్

🔥 విద్యార్హతలు: పోస్టులను అనుసరించి సంబంధిత విభాగాలలో  డిప్లొమా / ఇంజనీరింగ్ డిగ్రీ పూర్తి చేసిఉండాలి.

🔥 దరఖాస్తు రుసుం : మహిళలకు, ఎస్సీ , ఎస్టీ & PwBD వారికి ఎటువంటి ఫీజు లేదు.

మిగతా అందరూ అభ్యర్థులు  200/- రూపాయలు అప్లికేషన్ ఫీ పే చేయాలి.

🔥 ప్రిలిమినరీ ఎగ్జామ్ సెంటర్లు : దేశం లో పలు ముఖ్య పట్టణాలు తో పాటు తెలుగు రాష్ట్రాలలో హైదరాబాద్ మరియు విశాఖపట్నం  కలవు.

🔥 మెయిన్స్ ఎగ్జామ్ సెంటర్లు : దేశం లో పలు ముఖ్య పట్టణాలు తో పాటు తెలుగు రాష్ట్రాలలో హైదరాబాద్ మరియు విశాఖపట్నం  కలవు.

🔥 ఎగ్జామ్ సిలబస్ మరియు విధానం: రెండు స్టేజ్ లలో ఎగ్జామ్ జరుగుతుంది.ప్రిలిమ్స్ ఎగ్జామ్  500 మార్కులకు ,మెయిన్స్ ఎగ్జామ్ 600 మార్కులకు ఉంటుంది.జనరల్ స్టడీస్ & ఇంజనీరింగ్ ఆప్టిట్యూడ్ & సంబంధిత ఇంజనీరింగ్ సబ్జెక్టు  సిలబస్ లో భాగంగా వుంటుంది.

  • 1/3 నెగెటివ్ మార్కింగ్ విధానం కలదు.
  • పూర్తి సిలబస్ కొరకు అధికారిక నోటిఫికేషన్ చదవగలరు.

🔥 వయోపరిమితి: 21 సంవత్సరాలు పూర్తి చేసుకొని 30 సంవత్సరాల లోపు వున్న వారు అప్లై చేసుకోవచ్చు.

వయస్సును  జనవరి 1/2025 నాటికి లెక్కిస్తారు.

  • ఎస్సీ/ఎస్టి వారికి 5 సంవత్సరాలు
  • ఓబీసీ వారికి 3 సంవత్సరాలు
  • డిఫెన్స్ పర్సనల్స్( డిసబుల్ ఇన్ ఆపరేషన్స్)వారికి 3 సంవత్సరాలు 
  • ఎక్స్ – సర్వీస్ మెన్ వారికి 5 సంవత్సరాలు సడలింపు కలదు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!