తెలంగాణా ESI హాస్పిటల్స్ లో 600 ఉద్యోగాలు భర్తీ | Telangana ESI Hospital Jobs Recruitment 2024 | TG ESI Hospital Jobs Vacancies Update 

తెలంగాణ రాష్ట్రంలో మరో 600 ఉద్యోగాలను భర్తీ చేసేందుకు అనుమతిస్తూ ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఉద్యోగాలను తెలంగాణ మెడికల్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా భర్తీ చేయబోతున్నట్లు ఉత్తర్వుల్లో తెలిపారు. ఆర్థిక శాఖ అనుమతి ఇచ్చిన ఈ ఉద్యోగాలకు సంబంధించిన ముఖ్యమైన వివరాలు క్రింది విధంగా ఉన్నాయి.

రాష్ట్రంలో కార్మిక, ఉపాధి శిక్షణ, ఫ్యాక్టరీల శాఖ

పరిధిలోని ఈఎస్ఐ ఆసుపత్రుల్లో ఈ ఉద్యోగాలను భర్తీ చేసేందుకు సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టులు 124, డెంటల్ అసిస్టెంట్ సర్జన్లు 7, స్టాఫ్ నర్సులు 272, గ్రేడ్-2 ఫార్మాసిస్ట్ 99, గ్రేడ్-2 ల్యాబ్జెక్నీషియన్ 34, ఏఎన్ఎం 54, రేడియోగ్రాఫర్ 5, మూడు డెంటల్ టెక్నీషియన్, డెంటల్ హైజనిస్ట్, ఆడియోమెట్రిక్ టెక్నీషియన్ పోస్టు ఒక్కోటి చొప్పున ఈ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.

🏹 మీరు ల్యాబ్ టెక్నీషియన్, స్టాఫ్ నర్స్, ఫార్మసీస్ట్, ANM వంటి ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతుంటే మా APP Download చేసుకోండి.. తక్కువ ధరలో మా App లో కోర్సులు ఉంటాయి..

✅ ఫ్రెండ్స్ మీ వాట్సాప్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాల సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ , టెలిగ్రామ్ ఛానల్స్ లో జాయిన్ అవ్వండి.

🔥 ఉద్యోగాలను భర్తీ చేయబోయే సంస్థ : తెలంగాణ మెడికల్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు ఈ ఉద్యోగాలను భర్తీ చేస్తుంది.

🔥 భర్తీ చేయబోయే ఉద్యోగాలు : సివిల్ అసిస్టెంట్ సర్జన్, డెంటల్ అసిస్టెంట్ సర్జన్, ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ 2, ఫార్మసిస్ట్ గ్రేడ్ 2, స్టాఫ్ నర్స్, ఏఎన్ఎం, రేడియోగ్రాఫర్, డెంటల్ టెక్నీషియన్, డెంటల్ హైజినిస్ట్, ఆడియో మెట్రిక్ టెక్నీషియన్

🔥 మొత్తం ఖాళీల సంఖ్య : 600

పోస్టుల వారీగా ఖాళీలు ఇవే..

  • సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టులు – 124
  • డెంటల్ అసిస్టెంట్ సర్జన్లు – 7
  • స్టాఫ్ నర్సులు 272
  • ఫార్మాసిస్ట్ గ్రేడ్ 2 – 99
  • ల్యాబ్జెక్నీషియన్ గ్రేడ్ 2 – 34
  • ఏఎన్ఎం – 54
  • రేడియోగ్రాఫర్ 5
  • డెంటల్ టెక్నీషియన్ – 01
  • డెంటల్ హైజనిస్ట్ – 01
  • ఆడియోమెట్రిక్ టెక్నీషియన్ – 01

🏹 ఆర్ధిక శాఖ అనుమతి ఇచ్చిన ఈ ఉద్యోగాలకు మెడికల్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు త్వరలో నోటిఫికేషన్స్ విడుదల చేయవచ్చు. లేదా ఇప్పటికే MHSRB విడుదల చేసిన స్టాఫ్ నర్స్, ల్యాబ్ టెక్నీషియన్, ఫార్మసిస్ట్, ANM ఉద్యోగాల నోటిఫికేషన్స్ లో ఈ పోస్టులను కలిపి భర్తీ చేసే అవకాశం కూడా ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!