ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మహిళాభివృద్ది మరియు శిశు సంక్షేమ శాఖ వారు వివిధ పోస్ట్ ల భర్తీ కొరకు నోటిఫికేషన్ విడుదల చేశారు. మొత్తం 8 పోస్టులను కాంట్రాక్టు పద్ధతిలో రిక్రూట్ చేస్తారు. ఈ పోస్టులకు అర్హత కలిగిన అభ్యర్థులు తేది 01.10.2024 నుండి 08.10.2024 సాయత్రం 5:00 గంటల లోగా అప్లై చేసుకోవాలి.
ఈ నోటిఫికేషన్ కి సంబంధించి పూర్తి వివరాల కోసం ఈ ఆర్టికల్ ను చివరి వరకు చదవండి. పూర్తి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేయడానికి మరియు ఆన్లైన్లో అప్లై చేయడానికి అవసరమైన లింక్స్ ఈ ఆర్టికల్ చివరిలో ఇవ్వబడినవి.
🏹 UPSC 232 పోస్టులు భర్తీ – Click here
✅ ఫ్రెండ్స్ మీ వాట్సాప్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాల సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ , టెలిగ్రామ్ ఛానల్స్ లో జాయిన్ అవ్వండి.
🔥 రిక్రూట్మెంట్ చేపట్టే సంస్థ :మహిళాభివృద్ది మరియు శిశు సంక్షేమ శాఖ , ఏలూరు జిల్లా
🔥 భర్తీ చేయబోయే ఉద్యోగాలు :
- ప్రొటెక్షన్ ఆఫీసర్ నాన్ ఇన్స్టిట్యూషనల్ కేర్,సోషల్ వర్కర్
- డాక్టర్ ( పార్ట్ టైమ్)
- ఆయా, ఎడ్యుకేటర్( పార్ట్ టైం)
- ఆర్ట్ క్రాఫ్ట్ మరియు మ్యూజిక్ టీచర్( పార్ట్ టైం)
- పి.టి కమ్ యోగా టీచర్ ( పార్ట్ టైం)
🔥 అర్హతలు : పోస్ట్ ను అనుసరించి వివిధ విద్యార్హతలు 7 వ తరగతి,10 వ తరగతి,డిగ్రీ, పి.జి, ఏం.బి.బి.ఎస్ మరియు అనుభవం అవసరం వుంటుంది.
🔥 మొత్తం ఉద్యోగాల సంఖ్య :8
- ప్రొటెక్షన్ ఆఫీసర్ నాన్ ఇన్స్టిట్యూషనల్ కేర్ : 01
- సోషల్ వర్కర్ : 01
- డాక్టర్ ( పార్ట్ టైమ్): 01
- ఆయా :01
- ఎడ్యుకేటర్( పార్ట్ టైం) : 01
- ఆర్ట్ క్రాఫ్ట్ మరియు మ్యూజిక్ టీచర్( పార్ట్ టైం) : 02
- పి.టి కమ్ యోగా టీచర్ ( పార్ట్ టైం) : 01
🔥 ఎంపిక విధానం : దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల్లో డిపార్ట్మెంట్ వారు కోరిన అర్హతలు వున్న అభ్యర్థులు ను ఇంటర్వ్యూ కొరకు పిలుస్తారు.
ఈ ఇంటర్వ్యూ జిల్లా సెలక్షన్ కమిటీ/ జిల్లా టాస్క్ ఫోర్స్ కమిటీ ద్వారా నిర్వహించబడుతుంది.
🔥 ముఖ్యమైన తేదీలు:
- దరఖాస్తు చేసుకోవడానికి ప్రారంభ తేది – 01/10/2024
- దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేది: 08/10/2024 సాయంత్రం 5:00 గంటల లోగా అప్లై చేయాలి.
🔥 వయస్సు :
- భర్తీ చేయుచున్న పోస్టులలో డాక్టర్ పోస్ట్ మినహా అన్ని పోస్టులకు వయస్సు 25 సంవత్సరాల నుండి 42 సంవత్సరాల లోపు ఉండాలి.
- ఎస్సీ , ఎస్ టి అభ్యర్థులకు 5 సంవత్సరాల సడలింపు కలదు.
- కాగా డాక్టర్ పోస్ట్ కి ఎటువంటి వయోపరిమితి లేదు.
🔥జీతం : పోస్ట్ ను అనుసరించి నెలవారీ జీత బత్యాలు ప్రస్తావించారు.
- ప్రొటెక్షన్ ఆఫీసర్ నాన్ ఇన్స్టిట్యూషనల్ కేర్ – 27804/- రూపాయలు
- సోషల్ వర్కర్ – 18536/- రూపాయలు
- డాక్టర్ ( పార్ట్ టైమ్) – 9930/- రూపాయలు
- ఆయా – 7944/- రూపాయలు
- ఎడ్యుకేటర్( పార్ట్ టైం) – 10000/- రూపాయలు
- ఆర్ట్ క్రాఫ్ట్ మరియు మ్యూజిక్ టీచర్( పార్ట్ టైం) – 10000/- రూపాయలు
- పి.టి కమ్ యోగా టీచర్ ( పార్ట్ టైం) – 10000/- రూపాయలు
🔥 అప్లికేషన్ విధానం : ఆన్లైన్ ద్వారా అధికారిక వెబ్సైట్ లో అప్లై చేయాలి.
🔥 అప్లికేషన్ ఫీజు : ఉద్యోగానికి అప్లై చేయడానికి ఫీజు లేదు.
ఈ నోటిఫికేషన్ కి సంబంధించి సందేహాలు వుంటే డిపార్ట్మెంట్ వారి ఫోన్ నెంబర్ 08812- 249883 కి కాంటాక్ట్ అవ్వవచ్చు.
👉 Download Full Notification – Click here
👉Apply online link – Click here