ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు చెందిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఫౌండేషన్ ఇచ్చే ఆశా స్కాలర్షిప్ ప్రోగ్రాం – 2024 ప్రకటన విడుదల చేయడం జరిగింది. ఈ ప్రకటన ద్వారా ప్రతిభ ఉన్న పేద విద్యార్థులకు చేయూతనివ్వడానికి ఆశా స్కాలర్షిప్ తీసుకొచ్చింది.
ఈ ఆశ స్కాలర్షిప్ కు ఎలా అప్లై చేయాలి ? అప్లై చేయడానికి ఎవరు అర్హులు ? ఎంపికైన వారికి ఎంత స్కాలర్షిప్ ఇస్తారు ? ఇలాంటి వివరాలు అన్ని ఈ ఆర్టికల్ చివరి వరకు మీరు చదివి తెలుసుకొని మీకు తెలిసిన పేద విద్యార్థులు ఎవరైనా ఉంటే వారి చేత అప్లై చేయించండి.
✅ ఫ్రెండ్స్ మీ వాట్సాప్ / టెలిగ్రామ్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాల సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ , టెలిగ్రామ్ ఛానల్స్ లో జాయిన్ అవ్వండి.
🔥 స్కాలర్షిప్ ప్రకటన విడుదల చేసిన సంస్థ : స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఫౌండేషన్ ఈ ప్రకటన విడుదల చేసింది.
🔥 ఎవరు అర్హులు : 6వ తరగతి నుండి 12వ తరగతి వరకు, డిగ్రీ, పీజీ, ఐఐటి, ఐఐఎం వంటి చదువులు చదువుతున్న భారతీయ విద్యార్థులు ఎవరైనా ఈ ఆశా స్కాలర్ షిప్ కు అప్లై చేయవచ్చు.
- అప్లై చేసే విద్యార్థులు గత విద్యా సంవత్సరం తరగతిలో కనీసం 75% మార్కులు పొంది ఉండాలి.
- స్కూల్ విద్యార్థు కుటుంబ వార్షిక ఉదయం 3 లక్షల లోపు ఉండాలి.
- అండర్ గ్రాడ్యుయేట్ మరియు పోస్ట్ గ్రాడ్యుయేట్ విద్యార్థుల కుటుంబ వార్షిక ఆదాయము ఆరు లక్షల లోపు ఉండాలి.
🔥 స్కాలర్షిప్ వివరాలు : విద్యార్థులకు వారి అర్హతల ఆధారంగా క్రింది విధంగా స్కాలర్షిప్ ఇవ్వడం జరుగుతుంది.
- 6 నుండి 12వ తరగతి విద్యార్థులకు 15,000/-
- అండర్ గ్రాడ్యుయేట్ విద్యార్థులకు 50,000/-
- పోస్ట్ గ్రాడ్యుయేట్ విద్యార్థులకు 70,000/-
- ఐఐటి విద్యార్థులకు 2,00000/-
- ఐఐఎం విద్యార్థులకు 7,50,000/-
🔥 అప్లై చేసే విధానం : అర్హత కలిగిన వారు ఆన్లైన్ విధానంలో అప్లై చేయాల్సి ఉంటుంది.
అప్లై చేసే సమయంలో క్రింది డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలి..
- విద్యార్థుల గత విద్యా సంవత్సరానికి సంబంధించిన మార్కులు షీట్ అప్లోడ్ చేయాలి.
- ఆధార్ కార్డు
- ప్రస్తుత విద్యాసంవత్సరానికి చెందిన ఫీజు చెల్లించిన రసీదు.
- ఈ సంవత్సరంలో విద్యాసంస్థలో అడ్మిషన్ పొందినట్లుగా రసీదు.
- విద్యార్థులు లేదా విద్యార్థుల తల్లిదండ్రుల యొక్క బ్యాంక్ అకౌంట్ వివరాలు
- విద్యార్థి యొక్క ఫోటో
- కుల ధ్రువీకరణ పత్రము
🔥 ఎంపిక చేసే విధానం :
- అప్లై చేసుకున్న విద్యార్థుల అకాడమిక్ మెరిట్, విద్యార్థుల ఆర్థిక పరిస్థితి వంటి వాటి ఆధారంగా షార్ట్ లిస్ట్ చేస్తారు.
- షార్ట్ లిస్ట్ అయిన వారికి డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి ఎంపిక చేయడం జరుగుతుంది.
🔥 అప్లికేషన్ ఫీజు : అప్లై చేయడానికి అప్లికేషన్ ఫీజు లేదు.
🔥 అప్లికేషన్ చివరి తేదీ : ఈ స్కాలర్షిప్ అప్లై చేయడానికి చివరి తేదీ 01-10-2024
🔥 ఈ స్కాలర్షిప్ కు అప్లై చేయడానికి క్రింద ఉన్న లింకుపై క్లిక్ చేసి అప్లై చేయండి.