యుద్ధ వాహనాల తయారీ సంస్థల ఉద్యోగాలకు దరఖాస్తులు ఆహ్వానం | AVNL Recruitment 2024 | Latest jobs in Telugu

భారత రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన ఆర్మర్డ్ వెహికల్స్ నిగం లిమిటెడ్ (AVNL) నుండి రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా జూనియర్ మేనేజర్, డిప్లమా టెక్నీషియన్, అసిస్టెంట్, జూనియర్ టెక్నీషియన్ అనే వివిధ రకాల ఉద్యోగాలను భర్తీ చేసేందుకు అర్హత కలిగిన వారి నుంచి దరఖాస్తులు కోరుతున్నారు. 

ఈ ఉద్యోగాలకు అర్హత గల భారతీయ పౌరులు అందరు అప్లై చేసుకునే అవకాశం ఉంది. కాబట్టి మీరు ఈ ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి సమాచారం తెలుసుకొని మీకు అర్హత ఉంటే అప్లై చేయండి. మీరు ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి అవసరమైన సమాచారం అంతా ఈ ఆర్టికల్ చివరి వరకు చదవడం ద్వారా ద్వారా మీకు పూర్తిగా తెలుస్తుంది..

✅ ఫ్రెండ్స్ మీ వాట్సాప్ / టెలిగ్రామ్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాల సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ , టెలిగ్రామ్ ఛానల్స్ లో జాయిన్ అవ్వండి.

🏹  ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించిన మరికొన్ని ముఖ్యమైన వివరాలు ఇలా ఉన్నాయి 👇 👇

🔥 నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ : ప్రస్తుతం ఈ నోటిఫికేషన్ Armoured Vehicle Nigam Limited (AVNL) నుండి విడుదల చేయబడింది.

🔥 భర్తీ చేస్తున్న పోస్టులు : AVNL విడుదల చేసిన ఈ నోటిఫికేషన్ ద్వారా జూనియర్ మేనేజర్, డిప్లమా టెక్నీషియన్, అసిస్టెంట్, జూనియర్ టెక్నీషియన్ అనే ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.

🔥 మొత్తం ఖాళీల సంఖ్య : 81 పోస్టులను భర్తీ చేస్తున్నారు. ఇందులో పోస్టులు వారీగా ఖాళీల సంఖ్య క్రింది విధంగా ఉంది. 

  • జూనియర్ మేనేజర్ ఖాళీలు మొత్తం 24 పోస్టులు ఉన్నాయి. 
  • డిప్లమో టెక్నీషియన్ ఖాళీలు మొత్తం 34 పోస్టులు ఉన్నాయి. 
  • అసిస్టెంట్ ఖాళీలు మొత్తం రెండు పోస్టులు ఉన్నాయి. 
  • జూనియర్ టెక్నీషియన్ ఖాళీలు మొత్తం 19 పోస్టులు ఉన్నాయి.

🔥 కనీస వయసు : నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న అన్ని రకాల ఉద్యోగాలకు అప్లై చేయడానికి కనీస వయసు 18 సంవత్సరాలు.

🔥 గరిష్ట వయస్సు : ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి గరిష్ట వయసు 28 సంవత్సరాలు.

🔥 వయస్సులో సడలింపు : క్రింది విధంగా అభ్యర్థులకు సడలింపు వర్తిస్తుంది.

  • SC, ST అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు వయస్సులో సడలింపు ఉంటుంది.
  • OBC అభ్యర్థులకు వయసులో 10 సంవత్సరాలు సడలింపు ఉంటుంది.

🔥 విద్యార్హత : 

  • జూనియర్ మేనేజర్ ఉద్యోగాలకు సంబంధిత ఇంజనీరింగ్ లేదా మేనేజ్మెంట్ ఫీల్డ్ లో ఫస్ట్ క్లాస్ లో ఉత్తీర్ణత పొంది ఉండాలి. 
  • డిప్లమో టెక్నీషియన్ ఉద్యోగాలకు డిప్లమోను సంబంధిత టెక్నికల్ విభాగాలలో పూర్తి చేసిన వారు అర్హులు.
  • జూనియర్ టెక్నీషియన్ ఉద్యోగాలకు సంబంధిత ట్రైడ్ లో NAC లేదా NTC సర్టిఫికెట్ ఉండాలి.

🔥 అప్లికేషన్ ఫీజు : 300/-

  • SC, ST, PwBD, ఎక్స్ సర్వీస్మెన్ మరియు మహిళా అభ్యర్థులకు ఫీజు నుండి మినహాయింపు ఇచ్చారు.

🔥 జీతం : 

  • జూనియర్ ఇంజనీర్ ఉద్యోగాలకు ఎంపికైన వారికి నెలకు 47,610/- రూపాయలు జీతం ఇస్తారు.
  • డిప్లమో టెక్నీషియన్ ఉద్యోగాలకు ఎంపికైన వరకు నెలకు 37,201/- రూపాయలు జీతం ఇస్తారు. 
  • అసిస్టెంట్ ఉద్యోగాలకు ఎంపికైన వరకు నెలకు 37,201/- రూపాయలు జీతం ఇస్తారు. 
  • జూనియర్ టెక్నీషియన్ ఉద్యోగాలకు ఎంపికైన వరకు నెలకు 34,227/- రూపాయలు జీతం ఇస్తారు. 

🔥 అప్లికేషన్ విధానం : ఈ ఉద్యోగాలకు అర్హత ఉన్నవారు తమ దరఖాస్తులను పోస్ట్ ద్వారా పంపించాలి. 

  • ముందుగా అభ్యర్థులు అప్లికేషన్ డౌన్లోడ్ చేసి వివరాలన్నీ స్పష్టంగా నింపిన తర్వాత అప్లికేషన్ లో తమ ఫోటో అంటించాలి. 
  • అన్ని సర్టిఫికెట్స్ జిరాక్స్ కాపీలు పైన సెల్ఫ్ అట్టెస్టేషన్ చేసి అప్లికేషన్ కి జతపరిచి ఒక కవర్లో పెట్టి పోస్ట్ ద్వారా పంపించాలి.

🔥 ఎంపిక విధానం : ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకున్న అభ్యర్థులకు రాత పరీక్ష లేదా ఇంటర్వ్యూ నిర్వహించి, డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి ఏంపిక చేస్తారు.

🔥 అప్లికేషన్ చివరి తేదీ : నోటిఫికేషన్ విడుదల చేసిన తేదీ నుండి 21 రోజుల్లోపు అభ్యర్థులు తమ అప్లికేషన్ ను స్పీడ్ పోస్ట్ ద్వారా చేరే విధంగా పంపించాలి. 

🔥 అప్లికేషన్ పంపించాల్సిన చిరునామా : (Armoured Vehicles Nigam Limited, Machine Tool Prototype Factory, Ordnance Estate, Ambarnath, Dist. Thane, Maharashtra Pin 421 502:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!