AP లో బాల సదన్ లో కాంట్రాక్టు / ఔట్ సోర్సింగ్ / పార్ట్ టైం జాబ్స్ | AP Children Home Contract / Outsourcing / Part Time Jobs 2024 | Andhrapradesh Jobs 

ఆంధ్రప్రదేశ్ లో మహిళా మరియు శిశు సంక్షేమ శాఖ నందు అంతర్భాగంగా నడుపుతున్న బాల సదనంలో (చిల్డ్రన్) ఖాళీగా ఉన్న ఉద్యోగాలను కాంట్రాక్టు , ఔట్ సోర్సింగ్ మరియు పార్ట్ టైం ప్రాతిపదికన వివిధ రకాల ఉద్యోగాలను భర్తీ చేసేందుకు అర్హత గల వారి నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది.

ఈ ఉద్యోగాలకు అర్హత ఉన్నవారు దరఖాస్తుతో పాటు అవసరమైన అన్ని సర్టిఫికెట్స్ జతపరిచి సెప్టెంబర్ 25వ తేదీ నుండి అక్టోబర్ 1వ తేది లోపు అప్లై చేయాలి.

ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి సమాచారం ఈ ఆర్టికల్ చివరి వరకు చదివి తెలుసుకొని మీకు అర్హత ఉంటే అప్లై చేయండి.

✅ నిరుద్యోగులకు అతి తక్కువ ధరలో రైల్వే ఉద్యోగాల ఆన్లైన్ కోచింగ్ ఇప్పుడు మన “ INB Jobs “ APP లో కేవలం 499/- రూపాయలకు మాత్రమే.

RPF, NTPC, Group D, ALP, Technicians ఉద్యోగాలకు సిలబస్ ప్రకారం ఆన్లైన్ Classes మరియు ప్రాక్టీస్ టెస్ట్ లతో పూర్తి కోర్స్ – 499/- Only. 

బ్యాంక్ , SSC MTS, SSC CGL, SSC CHSL ఉద్యోగాల పూర్తి కోర్సులు కూడా కేవలం 499/- 

🏹 డిగ్రీ అర్హతతో 8113 రైల్వే ఉద్యోగాలు – Click here 

✅ ఫ్రెండ్స్ మీ వాట్సాప్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాల సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ , టెలిగ్రామ్ ఛానల్స్ లో జాయిన్ అవ్వండి.

ప్రస్తుతం ఈ నోటిఫికేషన్ అనంతపురం జిల్లా మహిళా మరియు శిశు సంక్షేమ శాఖ అధికారి కార్యాలయం నుండి విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలు సమాచారం క్రింది విధంగా ఉంది.

🔥 నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ : జిల్లా మహిళ మరియు శిశు సంక్షేమ శాఖ అధికారి వారి కార్యాలయం , అనంతపురం జిల్లా కార్యాలయం

 🔥 భర్తీ చేస్తున్న పోస్టులు : స్టోర్ కీపర్ కం అకౌంటెంట్, హౌస్ కీపర్ , ఎడ్యుకేటర్, ఆర్ట్ & క్రాఫ్ట్ కం మ్యూజిక్ టీచర్, P.T ఇన్స్ట్రక్టర్ కం యోగ టీచర్

🔥 అర్హతలు : పదో తరగతి, డిగ్రీ, B.Ed, డిప్లొమా వంటి విద్యార్హతలతో పాటు పని అనుభవం ఉండాలి.

🔥 మొత్తం ఖాళీల సంఖ్య : 07

  • స్టోర్ కీపర్ కం అకౌంటెంట్ – 01
  • హౌస్ కీపర్ – 01
  • ఎడ్యుకేటర్ – 02
  • ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ కం మ్యూజిక్ టీచర్ – 02
  • P.T ఇన్స్ట్రక్టర్ కం యోగ టీచర్ – 01

🔥 జీతము : పోస్టులు వారీగా జీతము వివరాలు  క్రింది విధంగా ఉన్నాయి.

  • స్టోర్ కీపర్ కం అకౌంటెంట్ – 18,536/-
  • హౌస్ కీపర్ – 7,944/-
  • ఎడ్యుకేటర్ – 5000/-
  • ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ కం మ్యూజిక్ టీచర్ – 5,000/-
  • P.T ఇన్స్ట్రక్టర్ కం యోగ టీచర్ – 10,000/-

🔥 ఫీజు : ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి ఎటువంటి ఫీజు లేదు 

🏹 రైల్వేలో 3115 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల – Click here 

🔥 వయస్సు : 30 నుండి 45 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన వారు ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి అర్హులు. 

🔥 ఎంపిక విధానం ఎలా ఉంటుంది : 

  • పోస్టుల ఎంపికలో రాత పరీక్ష నిర్వహించరు.
  • ఈ ఉద్యోగాలకు అర్హత పరీక్షలో వచ్చిన మార్కుల మెరిట్ ఆధారంగా అభ్యర్థులను షార్ట్ లిస్ట్ చేస్తారు.
  • షార్ట్ లిస్ట్ అయిన అభ్యర్థులకు మాత్రమే ఇంటర్వ్యూ సమాచారం తెలియజేస్తారు.
  • ఇంటర్వ్యూ సమాచారం అందిన అభ్యర్థులు ఇంటర్వ్యూకు హాజరు కావలసి ఉంటుంది.
  • ఇంటర్వ్యూలో చూపిన ప్రతిభ ఆధారంగా ఎంపిక చేస్తారు.

🔥 అప్లికేషన్ ప్రారంభ తేదీ : 25-09-2024

🔥 అప్లికేషన్ చివరి తేదీ : 01-10-2024

🔥 అప్లికేషన్ అందజేయాల్సిన చిరునామా : జిల్లా మహిళా మరియు శిశు సంక్షేమ మరియు సాధికారత అదికారి కార్యాలయం, అనంతపురం

Note : ఈ పోస్టులకు అప్లై చేయాలి అనుకునే అభ్యర్థులు తప్పనిసరిగా క్రింద ఇచ్చిన లింక్ పైన క్లిక్ చేసి పూర్తి వివరాలు చదివి అప్లై చేయండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!