ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగులకు 3668 పోస్టులతో జాబ్ మేళాలు | జాబ్ మేళాలో పాల్గొనే సంస్థలు, ఉద్యోగాలు ,జీతము, వివరాలు ఇవే |  Andhrapradesh Mega Job Mela

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సెప్టెంబర్ లో 26 ,27, 30 తేదీల్లో 3,668 ఉద్యోగాలకు వివిధ ప్రాంతాల్లో మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నారు. ఈ జాబ్ మేళాకు అర్హత గల నిరుద్యోగులు హాజరయ్యి తమ విద్యార్హతకు తగ్గ ఉద్యోగాలకు ఎంపిక అయ్యే అవకాశం ఉంటుంది. 

ఈ జాబ్ మేళాలు ఎక్కడ జరుగుతున్నాయి ? ఎప్పుడు జరుగుతున్నాయి ? ఏ సంస్థల్లో ఉద్యోగాలు ఇస్తున్నారు ? ఉండవలసిన అర్హతలు ఏమిటి ? వయస్సు ఎంత ఉండాలి ? ఎంపిక అయితే జీతం ఎంత వస్తుంది ? ఇలాంటి సమాచారం అంతా ఈ ఆర్టికల్ చివరి వరకు చదివి మీరు తెలుసుకుని జాబ్ మేళా లో జరిగే ఇంటర్వ్యూకు హాజరవ్వండి.

🏹 ఆంధ్రప్రదేశ్ కస్తూరిబా గాంధీ పాఠశాలల్లో 604 ఉద్యోగాలు – Click here

✅ మీ వాట్సాప్ / టెలిగ్రామ్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ మరియు టెలిగ్రామ్ ఛానల్స్ లో జాయిన్ అవ్వండి..

🔥 నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ పేరు : డైరెక్టరేట్ ఆఫ్ ఎంప్లాయిమెంట్ మరియు ట్రైనింగ్ , ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం

🔥 కంపెనీల పేర్లు & ఖాళీలు సంఖ్య : 

🔥 అర్హతలు : 10th , ఇంటర్, ITI, డిప్లొమా, ఏదైనా డిగ్రీ, డి.ఫార్మసీ, బి.ఫార్మసీ మరియు ఇతర అర్హతలు ఉన్నవారు ఈ జాబ్ మేళాలలో పాల్గొనవచ్చు.

🔥 జాబ్ మేళాలో పాల్గొనే కంపెనీలు : ఈ జాబ్ మేళాలో రాష్ట్రంలో ఉన్న వివిధ ప్రముఖ కంపెనీలు పాల్గొని తమ సంస్థల్లో ఉన్న ఖాళీ పోస్టులను ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగ యువతతో భర్తీ చేస్తున్నారు.

🔥 కనీస వయస్సు : జాబ్ మేళాలో పాల్గొనడానికి కనీసం 18 సంవత్సరాలు నిండి ఉండాలి. 

🔥 గరిష్ట వయస్సు : జాబ్ మేళాలో పోస్టులను అనుసరించి గరిష్ట వయస్సు 40 సంవత్సరాలు. 

🔥 ఫీజు : ఈ జాబ్ మేళాకు హాజరు కావడానికి ఫీజు లేదు. జాబ్ మేళాలో పాల్గొనేటప్పుడు కూడా ఎటువంటి రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించాల్సిన అవసరం ఉండదు.

🏹 ఎయిర్ పోర్టులో పదో తరగతి అర్హతతో ఉద్యోగాలు – Click here

🔥 జీతం : ఈ జాబ్ మేళా ద్వారా కనీసం 10,000 నుండి గరిష్టంగా 40,5000/- వరకు ప్రతినెల జీతం ఇచ్చే విధంగా వివిధ సంస్థల్లో ఉద్యోగాలు ఉన్నాయి.

🔥 ఎంపిక విధానం ఎలా ఉంటుంది : 

  • అభ్యర్థులు ముందుగా తమ యొక్క బయోడేటా, విద్యార్ధుల సర్టిఫికెట్స్ జిరాక్స్ కాపీలతో ఇంటర్వ్యూకు హాజరు కావాలి.
  • జాబ్ మేళాలో పాల్గొన్న కంపెనీలో ఏ పోస్టులు భర్తీ చేస్తున్నారు ? వాటికి ఉండవలసిన అర్హతలు ఏమిటి ? అనే వివరాలు తెలుసుకొని అభ్యర్థులకు అర్హత కలిగిన కంపెనీ ఇంటర్వ్యూకు హాజరు అవ్వాలి. 
  • ఇంటర్వ్యూకు హాజరైన అభ్యర్థులను కంపెనీ వారు ఇంటర్వ్యూ నిర్వహించి అభ్యర్థి ప్రతిభ ఆధారంగా ఎంపిక చేస్తారు.

🔥 జాబ్ మేళా జరిగే తేదీ : సెప్టెంబర్ 26, 27, 30 తేదీల్లో జరిగే జాబ్ మేళాల వివరాలు ఇలా ఉన్నాయి.

  • సెప్టెంబర్ 26వ తేదీ తూర్పుగోదావరి జిల్లా రాజనగరంలో ఉన్న MPDO ఆఫీసులో 120 పోస్టులకు జాబ్ మేళా నిర్వహిస్తున్నారు. 
  • సెప్టెంబర్ 26వ తేదీన తిరుపతి జిల్లాలో గూడూరు లో ఉన్న గవర్నమెంట్ ఐటిఐ కాలేజీలో 250 పోస్ట్లకు జాబ్ మేళా నిర్వహిస్తున్నారు.
  • సెప్టెంబర్ 27వ తేదీన డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో P.గన్నవరం లో ఉన్న గ్రేస్ డిగ్రీ కాలేజీలో 936 పోస్టులకు జాబ్ మేళా నిర్వహిస్తున్నారు. 
  • సెప్టెంబర్ 27వ తేదీన విజయనగరం జిల్లాలో రాజాం మండలంలో ఉన్న గవర్నమెంట్ ఐటిఐ కాలేజీలో 440 పోస్టులకు జాబ్ మేళా నిర్వహిస్తున్నారు.
  • సెప్టెంబర్ 27వ తేదీన తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో దగ్గర ఉన్న బొమ్మూరులో గవర్నమెంట్ ఐటిఐ కాలేజీలో 117 పోస్టులకు జాబ్ మేళా నిర్వహిస్తున్నారు. 
  • సెప్టెంబర్ 27వ తేదీన తిరుపతిలో ఉన్న శ్రీ వెంకటేశ్వర గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజీలో 800 పోస్టులకు జాబ్ మేళా నిర్వహిస్తున్నారు.
  • సెప్టెంబర్ 30వ తేదీన నందికొట్కూరు లో ఉన్న గవర్నమెంట్ డిగ్రీ కాలేజీలో 780 పోస్టులకు జాబ్ మేళా నిర్వహిస్తున్నారు.
  • సెప్టెంబర్ 30వ తేదీన అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం లో ఉన్న గవర్నమెంట్ డిగ్రీ కాలేజీలో 225 పోస్టులకు జాబ్ మేళా నిర్వహిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!