Headlines

తెలంగాణలో 2050 పోస్టులతో నోటిఫికేషన్ విడుదల | Telangana Nursing Officer Recruitment 2024 | TG Nursing Officer Notification 2024

తెలంగాణ రాష్ట్రంలో మరొక నోటిఫికేషన్ వచ్చేసింది. జాబ్ క్యాలెండర్ లో ప్రకటించిన విధంగా ఈ నెలలో వరుస నోటిఫికేషన్స్ విడుదల చేస్తున్నారు. తాజాగా తెలంగాణ వైద్య , ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖలో ఖాళీగా ఉన్న 2,050 నర్సింగ్ ఆఫీసర్ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తుల కోరుతూ తెలంగాణ మెడికల్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ ఉద్యోగాలకు అర్హత ఉన్నవారు సెప్టెంబర్ 28వ తేదీ నుండి అక్టోబర్ 14వ తేదీ వరకు ఆన్లైన్ విధానంలో అప్లై చేయవచ్చు.

ఈ ఉద్యోగాలకు ఉండవలసిన అర్హతలు ఏమిటి ? మొత్తం ఎన్ని ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు ? ఎలా ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి ? ఎంపిక విధానం ఎలా ఉంటుంది ? వయస్సు ఎంత ఉండాలి ? ఇలాంటి ముఖ్యమైన సమాచారం అంతా ఈ ఆర్టికల్ చివరి వరకు చదివి తెలుసుకొని మీకు అర్హత ఉంటే తప్పనిసరిగా అప్లై చేయండి. ఇలాంటి రిక్రూట్మెంట్ అప్డేట్స్ కోసం మా టెలిగ్రామ్ లేదా వాట్సాప్ చానల్స్ లో జాయిన్ అవ్వండి.

✅ మీ వాట్సాప్ / టెలిగ్రామ్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ మరియు టెలిగ్రామ్ ఛానల్స్ లో జాయిన్ అవ్వండి..

🏹 ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించిన ముఖ్యమైన వివరాలు ఇలా ఉన్నాయి 👇 👇 👇 

🔥 నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ : తెలంగాణ మెడికల్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డ్ ఈ నోటిఫికేషన్ విడుదల చేసింది.

🔥 భర్తీ చేస్తున్న పోస్టులు : MHSRB విడుదల చేసిన ఈ నోటిఫికేషన్ ద్వారా నర్సింగ్ ఆఫీసర్ అనే ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.

🔥  మొత్తం ఖాళీల సంఖ్య : MHSRB విడుదల చేసిన ఈ నోటిఫికేషన్ మొత్తం 2050 పోస్టులు భర్తీ చేస్తున్నారు. డిపార్ట్మెంట్ వారీగా ఖాళీలు వివరాలు క్రింది విధంగా ఉన్నాయి. 

  • డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ / డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ లో 1576 పోస్టులు ఉన్నాయి. 
  • తెలంగాణ వైద్య విధాన పరిస్థితిలో 332 పోస్టులు ఉన్నాయి. 
  • ఆయుష్ డిపార్ట్మెంట్ లో 61 పోస్టులు ఉన్నాయి.
  • ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్ లో 01 పోస్టు ఉంది.
  • MNJ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అంకాలజీ అండ్ రీజనల్ క్యాన్సర్ సెంటర్ లో 80 పోస్టులు ఉన్నాయి.

🔥 జీతము : ఈ ఉద్యోగాలకు ఎంపికైన వారికి 36,750/- నుండి 1,06,990/- వరకు పేస్కేల్ ఉంటుంది . 

🔥 అప్లికేషన్ ప్రారంభ తేదీ : 28-09-2024

🔥 అప్లికేషన్ చివరి తేదీ : 14-10-2024

🔥 అప్లికేషన్స్ లో Edit చేయుటకు తేదీలు : అక్టోబర్ 16, తేదీల్లో అప్లికేషన్ లో ఏమైనా తప్పులు ఉంటే మార్చుకునేందుకు అవకాశం ఉంటుంది.

🔥 ఆన్లైన్ పరీక్ష తేదీ : నవంబర్ 17వ తేదీన కంప్యూటర్ ఆధారిత పరీక్ష నిర్వహిస్తారు.

🔥 కనీస వయస్సు : 18 సంవత్సరాలు (01-07-2024) నాటికి

🔥 గరిష్ట వయస్సు : 46 సంవత్సరాలు 

🔥 వయస్సులో సడలింపు : తెలంగాణ ప్రభుత్వం నిబంధనల ప్రకారం క్రింది విధంగా వయస్సులో సడలింపు వర్తిస్తుంది.

  • ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు వయసులో ఐదేళ్లు సడలింపు వర్తిస్తుంది. 
  • PwBD అభ్యర్థులకు వయసులో పదేళ్లు సడలింపు వర్తిస్తుంది.

🔥 అర్హతలు : క్రింది విధంగా అర్హతలు ఉండాలి. 👇 👇 👇 

  • GNM లేదా బిఎస్సి నర్సింగ్ పూర్తి చేసి ఉండాలి. 
  • అభ్యర్థి ఈ పోస్టులకు అప్లై చేసే సమయాన్ని నాటికి తెలంగాణ నర్సింగ్ కౌన్సిల్లో రిజిస్టర్డ్ అయి ఉండాలి. 

🔥 ఫీజు : 

  • ఆన్లైన్ పరీక్ష ఫీజు 500/- రూపాయలు అన్ని కేటగిరీ అభ్యర్థులు చెల్లించాలి.
  • తెలంగాణ రాష్ట్రానికి చెందిన SC, ST, BC, EWS, PH అభ్యర్థులు మరియు తెలంగాణ రాష్ట్ర నిరుద్యోగులు తప్ప మిగతావారు 200 రూపాయల ప్రొసీసింగ్ ఫీజు చెల్లించాలి.

🔥 పరీక్ష విధానం : 

  • ఈ ఉద్యోగాలకు సంబంధించిన ఎంపిక మొత్తం 100 పాయింట్లకు ఉంటుంది. 
  • ఇందులో కంప్యూటర్ పరీక్షను 80 పాయింట్లు నిర్వహిస్తారు. 
  • మరో 20 పాయింట్లు అభ్యర్థులకు గతంలో కాంట్రాక్ట్ లేదా అవుట్సోర్సింగ్ విధానంలో పని చేసిన అనుభవం ఉంటే అనుభవం ఆధారంగా కేటాయిస్తారు.

🔥 అప్లై చేసే అభ్యర్థులు అప్లోడ్ చేయాల్సిన డాక్యుమెంట్స్ ఇవే : 👇 👇 👇 

🔥 అప్లికేషన్ విధానం : ఈ ఉద్యోగాలకు అర్హత కలిగిన వారు ఆన్లైన్ విధానములో అప్లై చేయాల్సి ఉంటుంది. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!