పోస్టల్ GDS రెండవ మెరిట్ లిస్ట్ కోసం ఎదురు చూస్తున్న వారికి గుడ్ న్యూస్.. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలతో పాటు ఇతర రాష్ట్రాలకు చెందిన రెండవ మెరిట్ లిస్టును పోస్టల్ డిపార్ట్మెంట్ అధికారికంగా విడుదల చేసింది.
మొదటిసారి విడుదల చేసిన మెరిట్ లిస్టులో ఉద్యోగం పొందిన వారు రెండవ మెరిట్ లిస్టు కోసం చాలా రోజుల నుంచి ఎదురుచూస్తున్నారు. తాజాగా విడుదలైన ఈ మెరిట్ లిస్ట్ డౌన్లోడ్ చేసి మీరు ఈ ఉద్యోగాలకు ఎంపికయ్యారో లేదో తెలుసుకోవచ్చు. రెండో మెరిట్ లిస్టులో కూడా మీ రిజిస్టర్డ్ నంబర్ లేకపోతే మరికొన్ని మెరిట్ లిస్టులు విడుదల చేసే అవకాశం ఉంది. కనుక పోస్టల్ GDS అఫీషియల్ వెబ్సైట్ లో ఎప్పటికప్పుడు విడుదల చేస్తున్న మెరిట్ లిస్టులు చెక్ చేస్తూ ఉండండి.
పోస్టల్ డిపార్ట్మెంట్ ఈ సంవత్సరం 44,228 పోస్టులతో GDS పోస్టులకు భారీ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం మీ అందరికీ తెలిసిందే. ఈ నోటిఫికేషన్ ద్వారా ఆంధ్రప్రదేశ్ పోస్టల్ సర్కిల్ లో 1355 , తెలంగాణ పోస్టల్ సర్కిల్ లో 981 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నట్లు ప్రకటించారు.
ఈ ఉద్యోగాలకు అర్హులైన వారి నుంచి జూలై 15వ తేదీ నుండి ఆగస్టు 5వ తేదీ వరకు ఆన్లైన్ విధానంలో దరఖాస్తులు స్వీకరించారు.
ఈ పోస్టులకి ఎంపికైన వారి యొక్క మొదటి జాబితా ఆగస్టు 19వ తేదీన పోస్టల్ డిపార్ట్మెంట్ విడుదల చేసింది.
ఆంధ్రప్రదేశ్ సర్కిల్ మొదటి జాబితా చూస్తే ఎక్కువ క్యాటగిరీల్లో 100% మార్కులు వచ్చిన వారికి ఉద్యోగాలు వచ్చాయి.
తెలంగాణ సర్కిల్ లో మొదటి జాబితా చూస్తే 95% నుంచి 100% మార్కులు వచ్చిన వారికి ఉద్యోగాలు వచ్చాయి.
✅ మీ వాట్సాప్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ , టెలిగ్రామ్ ఛానల్స్ లో జాయిన్ అవ్వండి.
ప్రతి సంవత్సరం ఈ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ పోస్టల్ డిపార్ట్మెంట్ ఇస్తూ ఉంది. ఈ ఉద్యోగానికి ఎంపికైన వారు కొన్ని రకాల కారణాల వలన ఉద్యోగాల్లో జాయిన్ అవ్వకపోవడం వలన ఉద్యోగాలు పూర్తిగా భర్తీ కావు. ఇలాంటి పరిస్థితుల్లో పోస్టల్ డిపార్ట్మెంట్ మళ్లీ మెరిట్ లిస్టులు విడుదల చేస్తూ వస్తుంది. గత సంవత్సరం ఇలా ఆరు మెరిట్ లిస్టులు విడుదల చేసింది.
తాజాగా విడుదలైన ఆంధ్రప్రదేశ్ మెరిట్ లిస్ట్ గమనిస్తే మొత్తం 19 పేజీలతో 664 మంది అభ్యర్థులను రెండవ మెరిట్ లిస్ట్ ద్వారా ఎంపిక చేసింది.. ఈసారి కూడా 100% మార్కులు వచ్చిన వారు ఉన్నారు. ఇందులో అత్యల్పంగా PWD-B క్యాటగిరిలో 85.5% మార్కులు వచ్చిన అభ్యర్ధికి ఉద్యోగం వచ్చింది.
▶️ Download AP 2nd List – Click here
మరి తాజాగా విడుదల చేసిన తెలంగాణ పోస్టల్ GDS రెండో మెరిట్ లిస్ట్ గమనిస్తే మొత్తం 13 పేజీలతో ఉన్న ఈ లిస్టులో 468 మందిని ఎంపిక చేశారు. ఇందులో ఎక్కువగా 95% మార్కులు వచ్చిన వారికి కూడా ఉద్యోగాలు వచ్చాయి.
▶️ Download TG 2nd List – Click here
- ఎంపికైన అభ్యర్థులకు వాళ్లు అప్లై చేసుకున్నప్పుడు ఇచ్చిన రిజిస్టర్ మొబైల్ నెంబర్ లేదా ఈమెయిల్ కు మెసేజ్ కూడా పంపించడం జరుగుతుంది.
- ఎంపికైన వారు లిస్ట్ లో తమ రిజిస్టర్ నెంబర్ ఎదురుగా ఇచ్చిన డివిజనల్ మేనేజర్ ఆఫీస్ లో డాక్యుమెంట్ వెరిఫికేషన్ కు హాజరు కావాలి.
- డాక్యుమెంట్ వెరిఫికేషన్ కు హాజరయ్యేవారు ఒరిజినల్ సర్టిఫికెట్లతో పాటు రెండు సెట్ల జిరాక్స్ కాపీలపై అట్టేస్టేషన్ చేయించి పట్టుకుని వెళ్లాలి.
✅ తాజాగా విడుదల చేసిన అన్ని రాష్ట్రాల పోస్టల్ GDS 2nd లిస్ట్లు డౌన్లోడ్ చేయడానికి క్రింది ఉన్న లింకుపై క్లిక్ చేసి అధికారిక వెబ్సైట్ ఓపెన్ చేయండి.
🏹 Official Website – Click here