Headlines

ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల్లో ఉద్యోగాలకు దరఖాస్తులు ఆహ్వానం | APSWREIS Recruitment 2024 | Andhrapradesh Jobs Notifications

ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యా సంస్థల్లోని ఐఐటీ, నీట్ కోచింగ్ సెంటర్లలో వివిధ సబ్జెక్టులను బోధించేందుకు తాత్కాలిక ప్రాతిపదికన అధ్యాపకులుగా పనిచేసేందుకు అర్హత కలిగిన వారి నుంచి ఆన్లైన్ విధానంలో దరఖాస్తులు కోరుతున్నారు. ఈ పోస్టులకు అప్లై చేసి షార్ట్ లిస్ట్ అయిన వారికి సెప్టెంబర్ 24వ తేదీన ఇంటర్వ్యూ చేసి ఎంపిక చేస్తారు. ఎంపికైన వారికి పోస్టింగ్ ఇవ్వడం జరుగుతుంది.

✅ ఫ్రెండ్స్ మీ WhatsApp / Telegram కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ / టెలిగ్రామ్ ఛానల్ లో జాయిన్ అవ్వండి.. 

🔥 భర్తీ చేసే పోస్టులు : లెక్కలు, ఫిజిక్స్ , కెమిస్ట్రీ, బోటనీ, జువాలజీ సబ్జెక్టుల బోధనకు అర్హత కలిగిన వారి నుండి దరఖాస్తులు కోరుతున్నారు.

🔥 జాబ్ లొకేషన్స్ : ఎంపికైన అభ్యర్థులు చీపురుపల్లి (విజయనగరం) , శ్రీకృష్ణాపురం (విశాఖపట్నం) , పిఠాపురం (కాకినాడ) , ద్వారకా తిరుమల (పశ్చిమగోదావరి) , సింగరాయకొండ (ప్రకాశం) , కుప్పం (చిత్తూరు) , బి.పప్పూర్ (అనంతపురం) , చిన్నటేకూరు (కర్నూలు) , ఈడుపుగల్లు (కృష్ణ) , అడవి తక్కెళ్లపాడు (గుంటూరు) సెంటర్లలో పనిచేయాల్సి ఉంటుంది. 

🔥 అప్లికేషన్ చివరి తేదీ : పై సబ్జెక్టులలో బోధించుటకు అర్హత మరియు ఆసక్తి ఉన్నవారు సెప్టెంబర్ 20వ తేదీలోపు క్రింది ఇచ్చిన లింకుపై క్లిక్ చేసి గూగుల్ ఫారం నింపి అప్లై చేయండి.

🔥 ఎంపిక విధానము :  

  • ముందుగా అప్లై చేసుకున్న అభ్యర్థులకు షార్ట్ లిస్ట్ చేస్తారు. షార్ట్ లిస్ట్ అయిన వారికి ఇంటర్వ్యూ సమాచారం తెలియజేస్తారు.
  • షార్ట్ లిస్ట్ అయిన అభ్యర్థులకు సెప్టెంబర్ 24న ఈడుపుగల్లులోని బీఆర్ అంబేడ్కర్ గురుకులంలో డెమో క్లాసులు, ఇంటర్వ్యూలు నిర్వహించి ఎంపిక చేస్తారు.

🔥 జీతం : అప్లై చేసుకున్న వారిని ఇంటర్వ్యూ చేసి ఎంపిక చేసిన తర్వాత వారి యొక్క అర్హతలు మరియు అనుభవం ఆధారంగా జీతం ఇస్తారు. 

🔥 అప్లికేషన్ లింక్ : ఈ పోస్టులకు అన్ని రకాల విద్యార్హతలు ఉన్నవారు క్రింది ఇచ్చిన లింకుపై క్లిక్ చేసి ఆన్లైన్లో అప్లై చేయండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!