Headlines

రైల్వేలో 3115 పోస్టులతో మరొక నోటిఫికేషన్ విడుదల | RRC ER Recruitment 2024 | Eastern Railway Recruitment Cell Notification 2024

భారతీయ రైల్వేకు చెందిన ఈస్టర్న్ రైల్వే లో 3115 అప్రెంటిస్ పోస్టులకు దరఖాస్తుల కోరుతూ రైల్వే రిక్రూట్మెంట్ సెల్ నుండి నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఈ అప్రెంటిస్ పోస్టులకు అర్హులైన భారతీయ పౌరులు అందరూ అప్లై చేసుకునే అవకాశం ఉంది. ఈ అప్రెంటిస్ ట్రైనింగ్ పూర్తి చేయడం వలన రైల్వేలో విడుదల చేయబోయే నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేసే ఉద్యోగాల్లో కొన్ని పోస్టులు అప్రెంటిస్ ట్రైనింగ్ పూర్తి చేసిన వారికి కేటాయిస్తారు. కాబట్టి అప్రెంటిస్ ట్రైనింగ్ పూర్తి చేయడం వలన రైల్వేలో ఉద్యోగం పొందడం సులభం అవుతుంది.

ఈ పోస్టులకు సంబంధించిన ముఖ్యమైన వివరాలన్నీ ఈ ఆర్టికల్ పూర్తిగా చదివి తెలుసుకొని మీకు అర్హత ఉంటే త్వరగా అప్లై చేయండి. అప్లై చేయడానికి చివరి తేదీ అక్టోబర్ 23వ తేదీ వరకు ఇచ్చారు.

✅ ఫ్రెండ్స్ మీ వాట్సాప్ / టెలిగ్రామ్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాల సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ , టెలిగ్రామ్ ఛానల్స్ లో జాయిన్ అవ్వండి.

📌 Join Our What’s App Channel 

📌 Join Our Telegram Channel 

🏹 Apply Online – Click here

🏹  ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించిన మరికొన్ని ముఖ్యమైన వివరాలు ఇలా ఉన్నాయి 👇 👇

🔥 నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ : రైల్వే రిక్రూట్మెంట్ సెల్ , ఈస్ట్రన్ రైల్వే 

🔥 మొత్తం ఖాళీల సంఖ్య : 3115 అప్రెంటిస్ పోస్టులను భర్తీ చేస్తున్నారు.

🔥 భర్తీ చేస్తున్న పోస్టులు : ఈస్టర్ రైల్వేలో వివిధ ట్రేడ్లలో ఖాళీగా ఉన్న అప్రెంటిస్ పోస్టుల కోసం ఈ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది.

🔥 అర్హతలు : ఈ పోస్టులకు అప్లై చేయడానికి పదో తరగతి అర్హతతో పాటు సంబంధిత ట్రేడ్ లో NCVT  లేదా SCVT నుండి ITI పూర్తి చేసిన వారు అర్హులు.

🔥 వయస్సు : 15 నుండి 24 సంవత్సరాల మధ్య వయసు ఉన్నవారు ఈ అప్రెంటిస్ పోస్టులకు అర్హులు.

🔥 వయస్సులో సడలింపు వివరాలు : ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు , ఓబిసి అభ్యర్థులకు మూడు సంవత్సరాలు , PwBD అభ్యర్థులకు 10 సంవత్సరాలు వయస్సులో సడలింపు వర్తిస్తుంది.

🔥 అప్లికేషన్ ఫీజు : 

  • GEN / EWS / OBC అభ్యర్థులకు ఫీజు 100/- 
  • SC , ST, PWD , మహిళ అభ్యర్థులకు ఫీజు లేదు.

🔥 నోటిఫికేషన్ విడుదల తేది : 09-09-2024

🔥 అప్లికేషన్ ప్రారంభ తేదీ : 24-09-2024

🔥 అప్లికేషన్ చివరి తేదీ : 23-10-2024

🔥 అప్లికేషన్ విధానం : అభ్యర్థులు ఆన్లైన్ విధానంలో అప్లై చేయాలి.

🔥 ఎంపిక విధానం : 

  • అప్రెంటిస్ పోస్టులకు ఎటువంటి రాత పరీక్ష లేకుండా ఎంపిక చేయడం జరుగుతుంది. 
  • 10th మరియు ITI లో వచ్చిన మార్కుల మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు.

🔥 గమనిక : ఈ పోస్టులకు అప్లై చేయాలి అనుకునే అభ్యర్థులు క్రింది ఇచ్చిన లింకుపై క్లిక్ చేసి పూర్తి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసి చదివి అర్హత ఉంటే అప్లై చేయండి. ఇలాంటి మరికొన్ని నోటిఫికేషన్స్ యొక్క సమాచారం మీరు తెలుసుకోవాలి అంటే ఎప్పటికప్పుడు వెబ్సైట్ INB Jobs ను ఓపెన్ చేసి కొత్త నోటిఫికేషన్ తెలుసుకొని అప్లై చేయండి.

🏹 Download Full Notification – Click here 

అర్హత గల వారు క్రింద ఇచ్చిన లింక్ పైన క్లిక్ చేసి ఆన్లైన్ విధానంలో అప్లై చేయండి.

🏹 Apply Online – Click here 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!