రాత పరీక్ష లేకుండా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ లో 250 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల | RINL Visakhapatnam Recruitment 2024 | Visakhapatnam Steel Plant Recruitment 2024

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విశాఖపట్నంలో ఉన్న రాష్ట్రీయ ఇస్పాత్ నిగం లిమిటెడ్ (RINL) నుండి ఒక కొత్త నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న పోస్టులకు అర్హత గలవారు సెప్టెంబర్ 31వ తేదీ లోపు అప్లై చేయాల్సి ఉంటుంది. 

RINL విడుదల చేసిన ఈ నోటిఫికేషన్ ద్వారా 250 అప్రెంటిస్ పోస్టులు భర్తీ చేస్తున్నారు. భర్తీ చేస్తున్న పోస్టుల్లో 200 గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ పోస్టులు, 50 టెక్నీషియన్ అప్రెంటిస్ పోస్టులు ఉన్నాయి. ఎంపికైన వారికి ఒక సంవత్సరం కాలం పాటు అప్రెంటిస్ ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. రాత పరీక్ష లేకుండా ఇంటర్వ్యూ చేసి ఈ అప్రెంటిస్ ట్రైనింగ్ కు ఎంపిక చేస్తారు. ఇంటర్వ్యూకు హాజరయ్యే వారికి ట్రావెల్ అలవెన్స్ ఇవ్వరు. శిక్షణ కాలంలో స్టైఫండ్ కూడా ఇస్తారు. 

వీటికి ఉండవలసిన అర్హతలుతో పాటు మరికొన్ని వివరాలు అన్నీ ఈ ఆర్టికల్ చివరి వరకు చదివి తెలుసుకొని అర్హత మరియు ఆసక్తి ఉంటే తప్పనిసరిగా అప్లై చేయండి. ఈ నోటిఫికేషన్ వివరాలు మీ మిత్రులలో ఎవరికైనా ఉపయోగపడతాయని మీకు అనిపిస్తే తప్పనిసరిగా ఈ సమాచారాన్ని వారికి షేర్ చేయండి.

10+2 అర్హతతో క్లర్క్ ఉద్యోగాలు – Click here 

✅ ఫ్రెండ్స్ మీ వాట్సాప్ / టెలిగ్రామ్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాల సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ , టెలిగ్రామ్ ఛానల్స్ లో జాయిన్ అవ్వండి.

🏹  ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించిన మరికొన్ని ముఖ్యమైన వివరాలు ఇలా ఉన్నాయి 👇 👇

🔥 నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ : ఈ నోటిఫికేషన్ వైజాగ్ స్టీల్ ప్లాంట్ అనే పేరుతో పిలవబడుతున్న విశాఖపట్నంలో ఉన్న రాష్ట్రీయ ఇస్పాత్ నిగం లిమిటెడ్ నుండి విడుదల చేశారు.

🔥 మొత్తం ఖాళీల సంఖ్య : 250

🔥 భర్తీ చేస్తున్న పోస్టులు : ఈ నోటిఫికేషన్ ద్వారా 250 అప్రెంటిస్ పోస్టులు భర్తీ చేస్తున్నారు. ఇందులో 200 గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ పోస్టులు, 50 టెక్నీషియన్ అప్రెంటిస్ పోస్టులు ఉన్నాయి.

🔥 స్టైఫండ్ : 

  • గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ పోస్టులకు ఎంపికైన వారికి 9,000/- స్టైఫండ్ ఇస్తారు. 
  • టెక్నీషియన్ అప్రెంటిస్ పోస్టులకు ఎంపికైన వారికి 8,000/- స్టైఫండ్ ఇస్తారు.

అటవీ శాఖలో 10+2 అర్హతతో ఉద్యోగాలు – Click here 

🔥 అప్రెంటిస్ శిక్షణ కాలము : ఎంపికైన వారికి ఒక సంవత్సరం పాటు శిక్షణ ఇస్తారు.

🔥 అర్హతలు : క్రింది కోర్సులు 2021, 2022, 2023, 2024 సంవత్సరాల్లో పూర్తి చేసిన వారు ఈ పోస్టులకు అప్లై చేయడానికి అర్హులు.

  • గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ పోస్టులకు సంబంధిత బ్రాంచ్ లలో BE / B.Tech పూర్తి చేసిన వారు అర్హులు. 
  • టెక్నీషియన్ అప్రెంటిస్ పోస్టులకు సంబంధిత బ్రాంచ్ లలో డిప్లమో పూర్తి చేసిన వారు అర్హులు.
  • MHRD NATS Portal (www.mhrdnats.gov.in) లో రిజిస్టర్ అయ్యి ఉండాలి.

10+2 అర్హతతో సచివాలయ అసిస్టెంట్ జాబ్స్ – Click here 

🔥 అప్లికేషన్ ఫీజు : అప్లై చేయడానికి అప్లికేషన్ ఫీజు లేదు.

🔥 అప్లికేషన్ చివరి తేదీ : 31-09-2024

🔥 అప్లికేషన్ విధానం : ఈ ఉద్యోగాలకు అర్హత ఉన్నవారు ఆన్లైన్ లో గూగుల్ ఫారం నింపి అప్లై చేయాలి.

🔥 ఎంపిక విధానం : అర్హత పరీక్షలో వచ్చిన మార్కుల మెరిట్ ఆధారంగా షార్ట్ లిస్ట్ చేసి ఇంటర్వ్యూకు పిలిచి ఎంపిక చేస్తారు. 

  • ఇంటర్వ్యూకు షార్ట్ లిస్ట్ అయిన వారికి అప్లై చేసినప్పుడు ఇచ్చిన మొబైల్ నెంబర్ లేదా ఈ మెయిల్ కు ఇంటర్వ్యూ తేదీ మరియు ఇంటర్వ్యూ ప్రదేశం వివరాలు పంపిస్తారు.

🔥 పోస్టింగ్ ప్రదేశం : ఎంపికైన వారికి RINL విశాఖపట్నం మరియు RINL ఇతర ప్లాంట్లలో పోస్టింగ్ ఇస్తారు.

🔥 గమనిక : ఈ పోస్టులకు అప్లై చేయాలి అనుకునే అభ్యర్థులు క్రింది ఇచ్చిన లింకుపై క్లిక్ చేసి పూర్తి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసి చదివి అర్హత ఉంటే అప్లై చేయండి. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!