Headlines

తెలంగాణలో జాబ్ క్యాలెండర్ : ఈ నెలలో 4000 పోస్టులకు నోటిఫికేషన్స్ విడుదల | Telangana Jobs Calendar 2024-2025 Notifications in September 

తెలంగాణ రాష్ట్రంలో విడుదల చేసిన జాబ్ క్యాలెండర్ ప్రకారం ఈ నెలలో 4,000 ఉద్యోగాలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్స్ విడుదల చేయబోతున్నారు. ఈ మేరకు ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. ఈ నాలుగు వేల ఉద్యోగాలు అన్ని వైద్య ఆరోగ్య శాఖ లో ఉన్న ఖాళీలే. జాబ్ క్యాలెండర్ ప్రకారం చూస్తే సెప్టెంబర్ లో నోటిఫికేషన్ విడుదల చేసి నవంబర్లో పరీక్షలు నిర్వహిస్తారు. భర్తీ చేయబోయే పోస్టుల్లో ల్యాబ్ టెక్నీషియన్, స్టాఫ్ నర్స్ లేదా నర్సింగ్ ఆఫీసర్ , ఫార్మసిస్ట్ వంటి ఉద్యోగాలు ఉన్నాయి.

✅ మీ వాట్సాప్ / టెలిగ్రామ్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ మరియు టెలిగ్రామ్ ఛానల్స్ లో జాయిన్ అవ్వండి..

📌 Join Our What’s App Channel 

🔥 Join Our Telegram Channel 

🏹 జాబ్ క్యాలెండర్ లో ప్రకటించిన ఉద్యోగాలకు ప్రిపేర్ అయ్యేవారికి మా APP లో అతి తక్కువ ధరలో Online Classes కోర్స్ లు ఉన్నాయి.. డెమో క్లాసెస్ చూసి నచ్చితే కోర్స్ తీసుకోండి . ఈ క్లాసులు సీనియర్ ఫ్యాకల్టీ చేత చెప్పించడం జరిగింది.

🏹 భర్తీ చేయబోయే ఉద్యోగాలు – అర్హతలు :

ల్యాబ్ టెక్నీషియన్ ఉద్యోగాలు – అర్హతలు

భర్తీ చేయబోయే 4000 ఉద్యోగాల్లో మొదటి నోటిఫికేషన్ సెప్టెంబర్ లో 1280 ల్యాబ్ టెక్నీషియన్ ఉద్యోగాలకు విడుదల చేస్తారు. ల్యాబ్ టెక్నీషియన్ ఉద్యోగాలకు 8 రకాల ల్యాబ్ టెక్నీషియన్ కోర్సులు పూర్తి చేసిన వారు అర్హులు అని జాబ్ క్యాలెండర్ లో తెలియజేయడం జరిగింది.

స్టాఫ్ నర్స్ లేదా నర్సింగ్ ఆఫీసర్ ఉద్యోగాలు – అర్హతలు : 

మరో పది రోజుల్లో 2030 స్టాఫ్ నర్స్ లేదా నర్సింగ్ ఆఫీసర్ ఉద్యోగాలకు కూడా నోటిఫికేషన్ విడుదల చేయడం జరుగుతుంది. స్టాఫ్ నర్స్ ఉద్యోగాలకు GNM లేదా బిఎస్సి నర్సింగ్ పూర్తి చేసిన వారు అర్హులు.

ఫార్మసిస్ట్ ఉద్యోగాలు – అర్హతలు :

సెప్టెంబర్ నెల చివరి నాటికి ఫార్మసిస్ట్ ఉద్యోగాలకు కూడా నోటిఫికేషన్ విడుదల చేస్తారు. ఫార్మసిస్ట్ ఉద్యోగాలకు డిఫార్మసీ లేదా బీఫార్మసీ లేదా Pharm.D కోర్సులు పూర్తి చేసిన వారు అర్హులవుతారు. ఆయుర్వేద , యునాని హోమియోపతిలో ఫార్మసీ కోర్సులు పూర్తి చేసిన వారికి కూడా ఉద్యోగాలు ఉన్నాయి.

🏹 నోటిఫికేషన్ విడుదల చేయబోయే సంస్థ : 

స్టాఫ్ నర్స్,  ల్యాబ్ టెక్నీషియన్ , ఫార్మసిస్ట్ వంటి ఉద్యోగాలకు మెడికల్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డ్ నోటిఫికేషన్ విడుదల చేసి మొత్తం రిక్రూట్మెంట్ ప్రక్రియ పూర్తి చేస్తుంది. ఈ మేరకు జాబ్ క్యాలెండర్ లో కూడా రిక్రూట్మెంట్ ఏజెన్సీ గా మెడికల్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డ్ ను పేర్కొన్నారు.

🏹 ఈ ఉద్యోగాలకు ప్రిపేర్ అయ్యేవారికి మా APP లో అతి తక్కువ ధరలో Online Classes కోర్స్ లు ఉన్నాయి.. డెమో క్లాసెస్ చూసి నచ్చితే కోర్స్ తీసుకోండి . ఈ క్లాసులు సీనియర్ ఫ్యాకల్టీ చేత చెప్పించడం జరిగింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!