ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, సెకండరీ హెల్త్ ఆసుపత్రుల్లో ల్లో ఖాళీ ఉన్న స్టాఫ్ నర్సు పోస్టుల్ని ఎంపీహెచ్ఎ(ఎఫ్) జీఎన్ఎం అర్హతతో భర్తీ చేసేందుకు వైద్య ఆరోగ్యశాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ MT కృష్ణబాబు గారు ఉత్తర్వులు ఇచ్చారు.
ఈమేరకు ఇటీవల కుటుంబ ఆరోగ్య సంక్షేమ శాఖ కమిషనర్ C.హరి కిరణ్ కు ఆదేశాలు జారీ చేశారు. రెగ్యులర్ ప్రాతిపదికన స్టాఫ్ నర్సుగా ఈ పోస్టుల్ని భర్తీ చేయనున్నారు. గత ప్రభుత్వ హయాంలో ఏఎన్ఎం గ్రేడ్ -3 కింద రెగ్యులర్, కాంట్రాక్ట్ ప్రాతిపదికన విధులు నిర్వర్తిస్తున్న 2,112 మంది ఏఎన్ఎంలకు జనరల్ నర్సింగ్ (జీఎన్ఎం) శిక్షణ ఇచ్చారు.
✅ మీ వాట్సాప్ / టెలిగ్రామ్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ , టెలిగ్రామ్ ఛానల్స్ లో జాయిన్ అవ్వండి.
వీరంతా గడిచిన రెండున్నర ఏళ్ళుగా PHC లు, బోధనా ఆసుపత్రులు, సెకండరీ హెల్త్ ఆసుపత్రుల్లో విధులు నిర్వర్తిస్తున్నారు. స్టాఫ్ నర్సు ఖాళీలు ఉన్న చోట్ల వీరితో భర్తీ చేయాల్సిందిగా తాజాగా కృష్ణబాబు ఆదేశాలు జారీ చేశారు. స్టాఫ్ నర్సుగా విధులు నిర్వర్తించనున్న వీరికి జీతంతో పాటు నెలకు రూ.5 వేలు ప్రోత్సాహం కింద ఇస్తారు.