పోస్టల్ డిపార్ట్మెంట్ ఈ సంవత్సరం 44,228 పోస్టులతో GDS పోస్టులకు భారీ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం మీ అందరికీ తెలిసిందే. ఈ నోటిఫికేషన్ ద్వారా ఆంధ్రప్రదేశ్ పోస్టల్ సర్కిల్ లో 1355 , తెలంగాణ పోస్టల్ సర్కిల్ లో 981 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నట్లు ప్రకటించారు.
ఈ ఉద్యోగాలకు అర్హులైన వారి నుంచి జూలై 15వ తేదీ నుండి ఆగస్టు 5వ తేదీ వరకు ఆన్లైన్ విధానంలో దరఖాస్తులు స్వీకరించారు.
ఈ పోస్టులకి ఎంపికైన వారి యొక్క మొదటి జాబితా ఆగస్టు 19వ తేదీన పోస్టల్ డిపార్ట్మెంట్ విడుదల చేసింది.
ఆంధ్రప్రదేశ్ సర్కిల్ మొదటి జాబితా చూస్తే ఎక్కువ క్యాటగిరీల్లో 100% మార్కులు వచ్చిన వారికి ఉద్యోగాలు వచ్చాయి.
తెలంగాణ సర్కిల్ లో మొదటి జాబితా చూస్తే 95% నుంచి 100% మార్కులు వచ్చిన వారికి ఉద్యోగాలు వచ్చాయి.
ప్రతి సంవత్సరం ఈ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ పోస్టల్ డిపార్ట్మెంట్ ఇస్తూ ఉంది. ఈ ఉద్యోగానికి ఎంపికైన వారు కొన్ని రకాల కారణాల వలన ఉద్యోగాల్లో జాయిన్ అవ్వకపోవడం వలన ఉద్యోగాలు పూర్తిగా భర్తీ కావు. ఇలాంటి పరిస్థితుల్లో పోస్టల్ డిపార్ట్మెంట్ మళ్లీ మెరిట్ లిస్టులు విడుదల చేస్తూ వస్తుంది. గత సంవత్సరం ఇలా ఆరు మెరిట్ లిస్టులు విడుదల చేసింది. కాబట్టి ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకున్న అభ్యర్థులు ఈ సంవత్సరం రెండవ మెరిట్ లిస్టు కోసం ఎదురు చూస్తూ ఉన్నారు.
ఇప్పటికే రెండవ మెరిట్ లిస్ట్ విడుదల కావాల్సి ఉంది.. కొన్ని రకాల కారణాల వలన సెకండ్ మెరిట్ లిస్ట్ ఇంకా విడుదల చేయలేదు. ఈ మెరిట్ లిస్ట్ సెప్టెంబర్ మొదటి వారంలో విడుదల చేస్తారని అందరూ భావించినప్పటికీ ఇప్పటివరకు సెకండ్ మెరిట్ లిస్ట్ విడుదల కాలేదు. సెకండ్ మెరిట్ లిస్ట్ సెప్టెంబర్ రెండో వారంలో విడుదల చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.
సెకండ్ మెరిట్ లిస్ట్ పోస్టల్ డిపార్ట్మెంట్ క్రింద ఇచ్చిన అధికారిక వెబ్సైట్ లో పెడుతుంది. కాబట్టి అభ్యర్థులు ఎప్పటికప్పుడు అధికారిక వెబ్సైట్ ఓపెన్ చేస్తూ ఉండండి.
🔥 Official Website – Click here
ఈ మెరిట్ లిస్ట్ విడుదల చేసిన తర్వాత మా వాట్సాప్ మరియు టెలిగ్రామ్ ఛానల్స్ లో కూడా మీకు షేర్ చేస్తాం.. కాబట్టి మీరు అందులో వెంటనే జాయిన్ అవ్వండి.
✅ మీ వాట్సాప్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ , టెలిగ్రామ్ ఛానల్స్ లో జాయిన్ అవ్వండి.