Headlines

11,558 పోస్టులతో RRB NTPC Notification విడుదల | Railway NTPC Recruitment 2024 | RRB NTPC Recruitment 2024 in Telugu

రైల్వే ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతూ మరొక భారీ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదలైంది.. నాన్ టెక్నికల్ పాపులర్ క్యాటగిరీలో గ్రాడ్యుయేట్ మరియు అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్ ఉద్యోగాల భర్తీ కోసం ఈ నోటిఫికేషన్ విడుదల చేశారు. 

నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు 10+2 , డిగ్రీ వంటి వివిధ అర్హతలు కలిగిన వారు అప్లై చేసుకునే అవకాశం ఉంటుంది. 

ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 11,558 ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు. ఇందులో గ్రాడ్యుయేట్ లెవెల్ పోస్టులు 8113 ఉన్నాయి. మరియు అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్ పోస్టులు 3445 పోస్టులు ఉన్నాయి.

ఈ ఉద్యోగాలకు అర్హత గల భారతీయ పౌరులు అందరు అప్లై చేసుకునే అవకాశం ఉంటుంది.

🔥 రైల్వే, Bank, SSC, APPSC, TGPSC, పోలీసు మరియు ఇతర ఉద్యోగాల ఆన్లైన్ కోచింగ్ @ 499/- Only ( సీనియర్ ఫ్యాకల్టీతో ఈ క్లాస్లు చెప్పించడం జరిగింది – డెమో క్లాసులు చూసి నచ్చితే మీరు కోర్స్ తీసుకోవచ్చు )

✅ ఫ్రెండ్స్ మీ వాట్సాప్ / టెలిగ్రామ్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాల సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ , టెలిగ్రామ్ ఛానల్స్ లో జాయిన్ అవ్వండి.

🏹  ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించిన ముఖ్యమైన వివరాలు ఇలా ఉన్నాయి 👇 👇 

🔥 నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ : రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ (RRB)

🔥 మొత్తం ఖాళీల సంఖ్య : 11,558

  • గ్రాడ్యుయేట్ పోస్టులు – 8113
  • అండర్ గ్రాడ్యుయేట్ పోస్టులు – 3445

🔥 భర్తీ చేస్తున్న ఉద్యోగాలు :

  • గ్రాడ్యుయేట్ పోస్టులు – చీఫ్ కమర్షియల్ కం టికెట్ సూపర్వైజర్, స్టేషన్ మాస్టర్, గూడ్స్ ట్రైన్ మేనేజర్, జూనియర్ అకౌంటెంట్ అసిస్టెంట్ కం టైపిస్ట్, సీనియర్ క్లర్క్ కం టైపిస్ట్.
  • అండర్ గ్రాడ్యుయేట్ పోస్టులు : కమర్షియల్ కం టికెట్ క్లర్క్, అకౌంట్స్ క్లర్క్ కం టైపిస్ట్, జూనియర్ క్లర్క్ కం టైపిస్ట్, ట్రైన్స్ క్లర్క్

🔥 కనీస వయస్సు : ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి కనీస వయస్సు 18 సంవత్సరాలు ఉండాలి.

🔥 గరిష్ట వయస్సు : 

  • గ్రాడ్యుయేట్ పోస్టులకు గరిష్ట వయస్సు 36 సంవత్సరాలు.
  • అండర్ గ్రాడ్యుయేట్ పోస్టులకు గరిష్ట వయస్సు 33 సంవత్సరాలు

🔥 వయసులో సడలింపు వివరాలు : ఈ ఉద్యోగాలకు అప్లై చేసే అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనలు ప్రకారం వయస్సులో సడలింపు కూడా వర్తిస్తుంది. అనగా 

  • ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు 
  • ఓబీసీ (నాన్ క్రిమిలేయర్) అభ్యర్థులకు మూడు సంవత్సరాలు
  • PwBD అభ్యర్థులకు 10 సంవత్సరాలు వయసులో సడలింపు ఉంటుంది.

🔥 అప్లికేషన్ విధానం : ఈ ఉద్యోగాలకు అర్హత కలిగిన వారు తమ దరఖాస్తులను ఆన్లైన్ విధానంలో సబ్మిట్ చేయవచ్చు.

🔥 ఎంపిక విధానం : ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకున్న అభ్యర్థులకు ఆన్లైన్ లో రాత పరీక్ష నిర్వహించి ఎంపిక చేస్తారు.

🔥 ఫీజు : 

  • SC, ST , ఈబీసీ , ఎక్స్ సర్వీస్ మెన్, మైనారిటీ మరియు మహిళా అభ్యర్థులుకు – 250/-
  • మిగతా అభ్యర్థులకు 500/- రూపాయలు
  • పరీక్ష రాసిన అభ్యర్థులకు నిబంధనలు ప్రకారం బ్యాంకు చార్జీలు మినహాయించి ఫీజు రిఫండ్ చేస్తారు. 

🔥 అప్లికేషన్ ప్రారంభ తేదీ & చివరి తేదీ : 

  • గ్రాడ్యుయేట్ ఉద్యోగాలకు సెప్టెంబర్ 14 నుండి అక్టోబర్ 13వ తేదీ మధ్య ఆన్లైన్ విధానంలో అప్లై చేయవచ్చు.
  • అండర్ గ్రాడ్యుయేట్ ఉద్యోగాలకు సెప్టెంబర్ 21వ తేదీ నుండి అక్టోబర్ 20వ తేదీ మధ్య ఆన్లైన్ విధానంలో అప్లై చేయవచ్చు.

షార్ట్ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేయడానికి క్రింద ఉన్న లింకుపై క్లిక్ చేయండి. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!