భారత ప్రభుత్వ హోం మంత్రిత్వ శాఖకు చెందిన ఇండో టిబిటన్ బోర్డర్ పోలీస్ ఫోర్స్ నుండి 819 పోస్టులతో కానిస్టేబుల్ (కిచెన్ సర్వీసెస్) ఉద్యోగాలకు దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ ఉద్యోగాలకు అర్హత కలిగిన భారతీయ పౌరుల నుండి ఆన్లైన్ విధానంలో దరఖాస్తులు కోరుతున్నారు.
ఈ ఉద్యోగాలకు అర్హులైన వారు తమ దరఖాస్తులను ఆన్లైన్లో సెప్టెంబర్ 2వ
తేదీ నుండి అక్టోబర్ 1వ తేదీ వరకు సబ్మిట్ చేయవచ్చు.
ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి ఉండవలసిన అర్హతలు , ఎంపిక విధానం, జీతము మరియు ఇతర ముఖ్యమైన వివరాలు అన్నీ ఈ ఆర్టికల్ పూర్తిగా చివరి వరకు చదివి తెలుసుకొని మీకు అర్హత ఉంటే ఈ ఉద్యోగాలకు తప్పనిసరిగా త్వరగా అప్లై చేయండి. అప్లై చేసే అభ్యర్థులు తప్పనిసరిగా అప్లికేషన్ సబ్మిట్ చేసే ముందు వివరాలన్నీ ఒకసారి చెక్ చేసుకుని సబ్మిట్ చేయండి.
✅ మీ వాట్సాప్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ , టెలిగ్రామ్ ఛానల్స్ లో జాయిన్ అవ్వండి.
🏹 ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించిన ముఖ్యమైన వివరాలు ఇలా ఉన్నాయి 👇 👇
🔥 నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ : ఈ నోటిఫికేషన్ ఇండో టిబిటన్ బోర్డర్ పోలీస్ ఫోర్స్ (ITBPF) నుండి విడుదలైంది.
🔥 భర్తీ చేస్తున్న పోస్టులు : ఇండో టిబిటన్ బోర్డర్ పోలీస్ ఫోర్స్ (ITBPF) విడుదల చేసిన ఈ నోటిఫికేషన్ ద్వారా కానిస్టేబుల్ (కిచెన్ సర్వీసెస్) అనే ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.
🔥 మొత్తం ఖాళీల సంఖ్య : ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 819 ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు. ఇందులో పురుష అభ్యర్థులకు 697 పోస్టులు , మహిళలకు 122 పోస్టులు ఉన్నాయి.
🔥 కనీస వయస్సు : ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి ఉండవలసిన కనీస వయస్సు – 18 సంవత్సరాలు
🔥 గరిష్ట వయస్సు : ఈ ఉద్యోగాలకు 25 సంవత్సరాల లోపు వయస్సు ఉన్నవారు అర్హులు.
🔥 వయస్సులో సడలింపు : ఈ ఉద్యోగాలకు అప్లై చేసే వారికి భారత ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయసులో క్రింది విధంగా సడలింపు వర్తిస్తుంది. అనగా
- ఎస్సీ మరియు ఎస్టీ అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు సడలింపు ఉంటుంది.
- ఓబిసి (నాన్ క్రీమీలేయర్) అభ్యర్థులకు మూడు సంవత్సరాలు సడలింపు ఉంటుంది.
🔥 జీతము : లెవల్ – 3 ప్రకారం 21,700/- నుండి 69,100/- వరకు పే స్కేల్ ఉంటుంది. మరియు ఇతర Allowance లు ఉంటాయి.
🔥 అర్హత :
- 10th పాస్
- నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లేదా గుర్తింపు పొందిన ఇన్స్టిట్యూట్ నుండి NSQF లెవల్ – 1 కోర్స్ ఫుడ్ ప్రొడక్షన్ లేదా కిచెన్ సర్వీస్ లో కోర్స్ పూర్తి చేసి ఉండాలి.
🔥 ఫీజు :
- SC, ST, Female , ESM అభ్యర్థులకు ఫీజు లేదు.
- మిగతావారు 100/- ఫీజు చెల్లించి పోస్టులకు అప్లై చేయాలి.
🔥 అప్లికేషన్ విధానం : Online
🔥 ఎంపిక విధానం : ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకున్న వారికి రాత పరీక్ష , PET, PST, వైద్య పరీక్షలు, డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి ఎంపిక చేస్తారు.
🔥 అప్లికేషన్ ప్రారంభ తేది : 02-09-2024
🔥 అప్లికేషన్ చివరి తేదీ : 01-10-2024
Note : ఈ పోస్టులకు అప్లై చేయాలి అనుకునే అభ్యర్థులు క్రింద ఇచ్చిన లింక్ పైన క్లిక్ చేసి పూర్తి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసి వివరాలు అన్ని చదివి అప్లై చేయండి.
✅ Download Notificaion – Click here