Headlines

తెలుగు వచ్చిన వారికి ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకులో 550 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల | Indian Overseas Bank Recruitment 2024 | Latest Bank jobs

ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంక్ ఆయన ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకు నుండి 550 పోస్టులతో అప్రెంటిస్ పోస్టులకు రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదలైంది. 

ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న పోస్టులకు అర్హులైన వారు తమ దరఖాస్తులను ఆగస్టు 28వ తేదీ నుండి సెప్టెంబర్ 10వ తేదీ లోపు ఆన్లైన్ విధానంలో సబ్మిట్ చేయాలి. ఈ నోటిఫికేషన్ ద్వారా ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ బ్రాంచ్ లలో అప్రెంటిస్ పోస్టులు భర్తీ చేస్తున్నారు. ఎంపికైన వారికి ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో కూడా పోస్టింగ్ ఇస్తారు. ఈ పోస్టులకు సంబంధించిన ఎంపిక ప్రక్రియలో కంప్యూటర్ ఆధారిత పరీక్షతో పాటు లోకల్ లాంగ్వేజ్ టెస్ట్ నిర్వహిస్తారు.

ఈ పోస్టులకు అప్లై చేయడానికి ఉండవలసిన అర్హతలు , ఎంపిక విధానం, జీతము మరియు ఇతర ముఖ్యమైన వివరాలు అన్నీ ఈ ఆర్టికల్ పూర్తిగా చివరి వరకు చదివి తెలుసుకొని మీకు అర్హత ఉంటే ఈ పోస్టులకు అప్లై చేయండి. 

✅ మీ వాట్సాప్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ , టెలిగ్రామ్ ఛానల్స్ లో జాయిన్ అవ్వండి.

🏹  ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించిన ముఖ్యమైన వివరాలు ఇలా ఉన్నాయి 👇 👇 

🔥 నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ : ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ 

🔥 భర్తీ చేస్తున్న పోస్టులు : అప్రెంటిస్ పోస్టులు 

🔥 మొత్తం ఖాళీల సంఖ్య : 550

  • ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 22 పోస్టులు తెలంగాణ రాష్ట్రంలో 29 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. 

🔥 కనీస వయస్సు : ఈ పోస్టులకు అప్లై చేయడానికి ఉండవలసిన కనీస వయస్సు – 20 సంవత్సరాలు

🔥 గరిష్ట వయస్సు : ఈ పోస్టులకు 28 సంవత్సరాల లోపు వయస్సు ఉన్నవారు అర్హులు. 

🔥 వయస్సులో సడలింపు : ఈ పోస్టులకు అప్లై చేసే వారికి భారత ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయసులో క్రింది విధంగా సడలింపు వర్తిస్తుంది. అనగా 

  • ఎస్సీ మరియు ఎస్టీ అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు వయస్సులో సడలింపు ఉంటుంది.
  • ఓబిసి (నాన్ క్రీమీలేయర్) అభ్యర్థులకు మూడు సంవత్సరాలు వయస్సులో సడలింపు ఉంటుంది. 
  • PwBD అభ్యర్థులకు 10 సంవత్సరాలు వయస్సులో సడలింపు ఉంటుంది.

🔥 స్టైఫండ్ : ఈ పోస్టులకు ఎంపికైన వారికి క్రింది విధంగా స్టైఫండ్ ఇస్తారు. అభ్యర్థులు పొండి పోస్టింగ్ ప్రాంతాన్ని బట్టి ఈ స్టైఫండ్ ఉంటుంది.

  • మెట్రో ప్రాంతాల్లో పోస్టింగ్ పొందిన వారికి 15,000/- స్టైఫండ్ ఇస్తారు 
  • అర్బన్ ప్రాంతాల్లో పోస్టింగ్ పొందిన వారికి 12,000/- స్టైఫండ్ ఇస్తారు 
  • రూరల్ ప్రాంతాల్లో పోస్టింగ్ పొందిన వారికి 10,000/- స్టైఫండ్ ఇస్తారు.

🔥 అర్హత : 

  • ఏదైనా డిగ్రీ విద్యార్హత కలిగి ఉండాలి. 
  • అభ్యర్థి అప్లై చేసే రాష్ట్రంలో మాట్లాడి స్థానిక భాష వచ్చి ఉండాలి.

🔥 ఫీజు :

  • GEN / EWS / OBC అభ్యర్థులకు ఫీజు 800/- ( జీఎస్టీ తో కలుపుకొని 944/- )
  • SC, ST, Female అభ్యర్థులకు ఫీజు 600/- ( జీఎస్టీతో కలుపుకొని 708/- )
  • PwBD అభ్యర్థులకు ఫీజు 400/- ( జీఎస్టీ తో కలుపుకొని 472/- ) 

🔥 అప్లికేషన్ విధానం : ఈ పోస్టులకు అర్హులైన వారు ఆన్లైన్ విధానంలో అప్లై చేయవచ్చు.

🔥 ఎంపిక విధానం : ఈ పోస్టులకు అప్లై చేసుకున్న వారికి కంప్యూటర్ ఆధారిత పరీక్ష మరియు లోకల్ లాంగ్వేజ్ టెస్ట్ నిర్వహిస్తారు.

🔥 అప్లికేషన్ ప్రారంభ తేది : 28-08-2024

🔥 అప్లికేషన్ చివరి తేదీ : 10-09-2024

🔥 ఆన్లైన్ పరీక్ష తేదీ : 22-09-2024

Note : ఈ పోస్టులకు అప్లై చేయాలి అనుకునే అభ్యర్థులు క్రింద ఇచ్చిన లింక్ పైన క్లిక్ చేసి పూర్తి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసి వివరాలు అన్ని చదివి అప్లై చేయండి. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!