ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సంస్థ అయిన డైరెక్టరేట్ ఆఫ్ ఎంప్లాయిమెంట్ మరియు ట్రైనింగ్ నుండి మరో జాబ్ మేళా ప్రకటన నోటిఫికేషన్స్ విడుదలైంది.
వివిధ జిల్లాల్లో ప్రముఖ సంస్థల్లో ఉన్న ఖాళీలను భర్తీ చేసేందుకు ఈ నోటిఫికేషన్స్ విడుదల చేశారు..
అర్హత గల అభ్యర్థులు స్వయంగా తమకు దగ్గరలో ఉండే జాబ్ మేళా ప్రదేశంలో పాల్గొని తమ అర్హతకు తగ్గ ఉద్యోగానికి ఎంపిక కావచ్చు. ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగ యువతకు ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా ఈ జాబ్ మేళాలు రాష్ట్ర వ్యాప్తంగా ఎప్పటికప్పుడు నిర్వహిస్తూ ఉన్నారు.
సెప్టెంబర్ మూడవ తేదీన రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో జాబ్ మేళా నిర్వహిస్తున్నారు. వాటికి సంబంధించిన ముఖ్యమైన వివరాలు మరియు అఫీషియల్ వెబ్సైట్ లింక్ క్రిందన ఇవ్వబడినవి.
మీ వాట్సాప్ / టెలిగ్రామ్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ మరియు టెలిగ్రామ్ ఛానల్స్ లో జాయిన్ అవ్వండి..
నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ పేరు : డైరెక్టరేట్ ఆఫ్ ఎంప్లాయిమెంట్ మరియు ట్రైనింగ్ , ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం
కంపెనీల పేర్లు & ఖాళీలు సంఖ్య : 3,555
అర్హతలు : 10th , ఇంటర్, ITI, డిప్లొమా, ఏదైనా డిగ్రీ, B.Tech, డిఫార్మసీ లేదా బీఫార్మసీ మరియు ఇతర అర్హతలు ఉన్నవారు ఈ జాబ్ మేళాలో పాల్గొనేందుకు అర్హులు.
జాబ్ మేళా తేది : September 3వ తేదీన ఈ జాబ్ మేళాలు నిర్వహిస్తున్నారు.
జాబ్ మేళాలో పాల్గొనే కంపెనీలు – ఖాళీలు:
- నెల్లూరులో జరిగే జాబ్ మేళా ద్వారా ఐదు ప్రముఖ సంస్థల్లో 1030 పోస్టులు భర్తీ చేస్తున్నారు.
- కావలిలో జరిగే జాబ్ మేళా ద్వారా ఐదు ప్రముఖ సంస్థల్లో 1030 పోస్టులు భర్తీ చేస్తున్నారు.
- శ్రీకాకుళంలో జరిగే జాబ్ మేళ ద్వారా 9 ప్రముఖ సంస్థల్లో 233 పోస్టులు భర్తీ చేస్తున్నారు.
- పల్నాడు జిల్లాలో జరిగే జాబ్ మేళా ద్వారా ఐదు ప్రముఖ సంస్థల్లో 220 పోస్టులు భర్తీ చేస్తున్నారు.
- నంద్యాలలో జరిగే జాబ్ మేళా ద్వారా 8 ప్రముఖ సంస్థల్లో 742 పోస్టులు భర్తీ చేస్తున్నారు.
- అరకులో జరిగే జాబ్ మేళా ద్వారా ఐదు ప్రముఖ సంస్థల్లో 300 పోస్టులు భర్తీ చేస్తున్నారు.
కనీస వయస్సు : కనీసం 18 సంవత్సరాలు నిండి ఉండాలి.
గరిష్ట వయస్సు : పోస్టులను అనుసరించి గరిష్ట వయస్సు 35 సంవత్సరాలు.
జాబ్ మేళా జరిగే తేదీ : సెప్టెంబర్ 3వ తేదీన ఈ జాబ్ మేళాలు నిర్వహిస్తున్నారు..
జాబ్ మేళా నిర్వహించే ప్రదేశం :
- నెల్లూరులో జరిగే జాబ్ మేళా అడ్రస్ : NAC Nellore , Near Mypadu Junction
- కావలిలో జరిగే జాబ్ మేళా అడ్రస్ : విక్రమ సింహపురి యూనివర్సిటీ కాలేజ్, పెద్ద పావని రోడ్డు, వైకుంఠపురం, కావలి – 524201
- శ్రీకాకుళంలో జరిగే జాబ్ మేళా అడ్రస్ : గవర్నమెంట్ ఉమెన్స్ కాలేజ్, శ్రీకాకుళం
- పల్నాడు జిల్లాలో జరిగే జాబ్ మేళా అడ్రస్ : SGK గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్, వినుకొండ నియోజకవర్గం, పల్నాడు జిల్లా
- నంద్యాలలో జరిగే జాబ్ మేళా అడ్రస్ : PSC KVSC గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్, నంద్యాల
- అరకులో జరిగే జాబ్ మేళా అడ్రస్ : RITI , అరకు
ఫీజు : ఈ జాబ్ మేళాకు హాజరు కావడానికి ఫీజు లేదు. రిజిస్ట్రేషన్ ఫీజు కూడా ఉండదు.
ఎంపిక విధానం ఎలా ఉంటుంది : ఇంటర్వ్యూకు హాజరైన అభ్యర్థులను కంపెనీ వారు ఇంటర్వ్యూ నిర్వహించి ఎంపిక చేస్తారు.
ముఖ్య గమనిక : ఇంటర్వ్యూకు హజరు అయ్యే అభ్యర్థులు తప్పనిసరిగా Formal Dress ధరించి వెళ్లాలి.
- ఆధార్ కార్డు , పాస్ పోర్ట్ సైజ్ ఫోటో, Resume మరియు విద్యార్హతల సర్టిఫికెట్స్ జిరాక్స్ కాపీలతో ఇంటర్వ్యూకు హాజరు కావాలి.
జాబ్ మేళా నోటిఫికేషన్ పూర్తి వివరాలు కోసం క్రింద ఉన్న లింక్ పైన క్లిక్ చేయండి.