తెలంగాణ రాష్ట్రంలో విద్యుత్ శాఖలో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి త్వరలో నోటిఫికేషన్ విడుదల చేయబోతున్నారు. విద్యుత్ సంస్థల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భారీగా భర్తీ చేయాలని ప్రభుత్వం భావిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన జాబ్ క్యాలెండర్ ప్రకారం అక్టోబర్ లో విద్యుత్ శాఖలో ఖాళీలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయాల్సి ఉంటుంది.
✅ ఫ్రెండ్స్ మీ WhatsApp / Telegram కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ / టెలిగ్రామ్ ఛానల్ లో జాయిన్ అవ్వండి..
🔥 భర్తీ చేయబోయే పోస్టుల సంఖ్య : ఇప్పటివరకు ఉన్న ఖాళీల సమాచారం ప్రకారం విద్యుత్ శాఖలో దాదాపుగా 3000 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. నోటిఫికేషన్స్ విడుదల చేసే సమయానికి ఈ పోస్టుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉంది.
🔥 భర్తీ చేయబోయే పోస్టులు :
అసిస్టెంట్ లైన్ మెన్, జూనియర్ లైన్ మెన్, సబ్ ఇంజనీర్, సహాయ ఇంజినీర్ వంటి వివిధ రకాల ఉద్యోగాలను భర్తీ చేస్తారు.
🔥 అర్హతలు : ఈ ఉద్యోగాలకు సంబంధిత సబ్జెక్టులలో ITI, Diploma, BE /.B.tech వంటి వివిధ అర్హతలు కలిగిన వారు అప్లై చేయవచ్చు.
🔥 నోటిఫికేషన్ విడుదల తేదీ : ప్రభుత్వం ప్రకటించిన జాబ్ క్యాలెండర్ ప్రకారం విద్యుత్ శాఖలో ఉద్యోగాలకు అక్టోబర్ లో నోటిఫికేషన్ విడుదల చేయబోతున్నారు.
🔥 ఎంపిక విధానం : ఈ ఉద్యోగాలను శాశ్వత ప్రాతిపదికన భర్తీ చేస్తారు. కాబట్టి ఈ ఉద్యోగాల ఎంపికలో రాత పరీక్ష నిర్వహించి ఎంపిక చేస్తారు.