Headlines

AP లో 742 పోస్టులకు ఉద్యోగాల ప్రకటన విడుదల చేసిన DET | AP DET Mega Job Mela | Latest jobs in Andhrapradesh

పదో తరగతి , ఇంటర్మీడియట్, ఐటిఐ, డిప్లొమా, డిగ్రీ, పీజీ ,బీ.ఫార్మసీ, బి.ఫార్మసీ వంటి వివిధ అర్హతలు ఉన్న వారికి 742 పోస్టులతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ డైరెక్టరేట్ ఆఫ్ ఎంప్లాయిమెంట్ మరియు ట్రైనింగ్ నుండి ఉద్యోగ ప్రకటన విడుదల అయ్యింది. 

ఈ జాబ్ మేళాకు సంబంధించిన ముఖ్యమైన వివరాలను ఈ ఆర్టికల్ చదివి తెలుసుకొని పూర్తిగా తెలుసుకొని జాబ్ మేళాలో పాల్గొనండి.

✅ మీ వాట్సాప్ / టెలిగ్రామ్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ మరియు టెలిగ్రామ్ ఛానల్స్ లో జాయిన్ అవ్వండి..

🔥 నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ పేరు : డైరెక్టరేట్ ఆఫ్ ఎంప్లాయిమెంట్ మరియు ట్రైనింగ్ , ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం

🔥 కంపెనీల పేర్లు & ఖాళీలు సంఖ్య : 742

🔥 అర్హతలు : 10th , ఇంటర్, ITI, డిప్లొమా, ఏదైనా డిగ్రీ, డి.ఫార్మసీ, బి.ఫార్మసీ

🔥 కనీస వయస్సు : కనీసం 18 సంవత్సరాలు నిండి ఉండాలి. 

🔥 గరిష్ట వయస్సు : పోస్టులను అనుసరించి గరిష్ట వయస్సు 35 సంవత్సరాలు. 

🔥 జాబ్ మేళా జరిగే తేదీ : సెప్టెంబర్ 3వ తేదీన ఈ జాబ్ మేళాలు నిర్వహిస్తున్నారు..

🔥 జాబ్ మేళాలో పాల్గొనే కంపెనీలు – జీతం :

  • అపోలో సంస్థలో Pharmacist Trainee మరియు Pharmacist అనే ఉద్యోగాలు మొత్తం 30 ఉన్నాయి. ఈ ఉద్యోగాలకు 18 నుండి 27 సంవత్సరాలు వయస్సు ఉన్నవారు అర్హులు . జీతం 13,000/- నుండి 16,000/- వరకు ఉంటుంది.
  • Bharat Financial Inclusion Ltd అనే సంస్థలో Loan Officer 150 పోస్టులు ఉన్నాయి. Inter లేదా డిగ్రీ పూర్తి చేసిన వారు అర్హులు. 18 నుండి 28 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్నవారు అర్హులు. జీతము 14,575/- జీతము ఇస్తారు.
  • Credit Access Grameen Pvt Ltd అనే సంస్థలో ట్రైనీ కేంద్ర మేనేజర్ ఉద్యోగాలు 100 ఉన్నాయి. SSC, Inter, Diploma, ITI అర్హత గల 18 నుండి 28 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్నవారు అర్హులు. జీతము 12,000/- ఇస్తారు.
  • KL గ్రూప్ (Amazon) సంస్థలో పికింగ్, ప్యాకింగ్, స్కానింగ్ పోస్టులు 150 ఉన్నాయి. వీటికి SSC నుండి డిగ్రీ అర్హత గల 18 నుండి 34 సంవత్సరాల వయస్సు ఉన్నవారు అర్హులు. 16,500/- నుండి 17,000/- వరకు జీతము వస్తుంది.
  • L & T Construction లో స్కిల్ టెక్నీషియన్ పోస్టులు 100 ఉన్నాయి. SSC, Inter, ITI, Diploma అర్హత గల 18 నుండి 35 సంవత్సరాల వయసు గల వారు అర్హులు. ఎంపికైతె జీతము 18,000/- నుండి 18,500/- వస్తుంది.
  • Phonepe సంస్థలో బిజినెస్ డెవలప్మెంట్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు 12 ఉన్నాయి. SSC అంతకంటే ఎక్కువ అర్హతగల వారు 20 నుండి 35 సంవత్సరాల మధ్య వయస్సు ఉంటే అర్హులు. 15,616/- జీతము ఇస్తారు.
  • Transccan Pvt Ltd సంస్థలో Assembly / Production పోస్టులు 100 ఉన్నాయి. SSC, ITI, Inter, Diploma, Degree అర్హత గల వారు 18 నుండి 26 సంవత్సరాల మధ్య వయస్సు ఉంటే ఈ పోస్టులకు అర్హులు. జీతము 18,000/- నుండి 20,000/- వరకు జీతము ఇస్తారు.
  • TTE Pvt Ltd సంస్థలో 100 ఆపరేటర్ పోస్టులు ఉన్నాయి. ఈ పోస్టులకు SSC, Inter, ITI, Diploma, Degree విద్యార్హత గల 18 నుండి 28 సంవత్సరాల వయసు ఉన్న వారు అర్హులు. 15,000/- నుండి 18,000/- వరకు జీతము ఇస్తారు.

🔥 ఫీజు : ఈ జాబ్ మేళాకు హాజరు కావడానికి ఫీజు లేదు. రిజిస్ట్రేషన్ ఫీజు కూడా ఉండదు. 

🔥 జాబ్ మేళా నిర్వహించే ప్రదేశం : PSC KVSC Government Degree కాలేజ్, నంద్యాల

🔥 ఎంపిక విధానం ఎలా ఉంటుంది : ఇంటర్వ్యూకు హాజరైన అభ్యర్థులను కంపెనీ వారు ఇంటర్వ్యూ నిర్వహించి ఎంపిక చేస్తారు.

🔥 ముఖ్య గమనిక : ఇంటర్వ్యూకు హజరు అయ్యే అభ్యర్థులు తప్పనిసరిగా Formal Dress ధరించి వెళ్లాలి.

  • ఆధార్ కార్డు , పాస్ పోర్ట్ సైజ్ ఫోటో, Resume మరియు విద్యార్హతల సర్టిఫికెట్స్ జిరాక్స్ కాపీలతో ఇంటర్వ్యూకు హాజరు కావాలి.

🔥 జాబ్ మేళా నోటిఫికేషన్ పూర్తి వివరాలు కోసం క్రింద ఉన్న లింక్స్ పై క్లిక్ చేయండి..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!