Headlines

ఫుడ్ డిపార్ట్మెంట్ లో భారీగా పోస్టులు భర్తీకి నోటిఫికేషన్ విడుదల | BIS Recruitment 2024 | Food Department Jobs Recruitment 2024

భారత ప్రభుత్వ వినియోగదారుల వ్యవహారాలు, ఆహార మరియు ప్రజా పంపిణీ శాఖకు చెందిన బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (BIS) నుండి వివిధ రకాల ఉద్యోగాలను శాశ్వత ప్రాతిపదికన భర్తీ చేసేందుకు అర్హత కలిగిన వారి నుంచి ఆన్లైన్ విధానంలో దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేశారు . ఈ ఉద్యోగాలకు అర్హత గల వారు తమ దరఖాస్తులను సెప్టెంబర్ 9వ తేదీ నుండి సెప్టెంబర్ 30వ తేదీ వరకు ఆన్లైన్లో సబ్మిట్ చేయవచ్చు. 

ప్రస్తుతం విడుదల చేసిన ఈ నోటిఫికేషన్ ద్వారా అడ్మినిస్ట్రేటివ్ మరియు ఫైనాన్సు విభాగంలోని పోస్టులు మరియు లాబరేటరీ టెక్నికల్ విభాగంలో పోస్టులు భర్తీ చేస్తున్నారు. 

ఈ ఉద్యోగాలకు సంబంధించిన మరికొన్ని ముఖ్యమైన వివరాలన్నీ ఈ ఆర్టికల్ పూర్తిగా చదివి తెలుసుకొని మీకు అర్హత ఉంటే ఈ ఉద్యోగాలకు ఆన్లైన్ విధానంలో క్రింద ఉన్న లింకు ఉపయోగించి అప్లై చేయండి. అప్లికేషన్ సబ్మిట్ చేసే అభ్యర్థులు ముందుగా పూర్తి నోటిఫికేషన్ కూడా చదవండి. పూర్తి నోటిఫికేషన్ చదవడానికి , పూర్తి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోవడానికి ఆర్టికల్ చివరిలో లింక్ ఇవ్వడం జరిగింది.

✅ మీ వాట్సాప్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ , టెలిగ్రామ్ ఛానల్స్ లో జాయిన్ అవ్వండి.

🏹  ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించిన ముఖ్యమైన వివరాలు ఇలా ఉన్నాయి 👇 👇 

🔥 నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ : ఈ నోటిఫికేషన్ ను బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ అనే సంస్థ విడుదల చేసింది. ఇది ప్రభుత్వ రంగ సంస్థ

 🔥 భర్తీ చేస్తున్న పోస్టులు : BIS విడుదల చేసిన ఈ నోటిఫికేషన్ ద్వారా అడ్మినిస్ట్రేటివ్ మరియు ఫైనాన్సు విభాగంలో అసిస్టెంట్ డైరెక్టర్, పర్సనల్ అసిస్టెంట్, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్, అసిస్టెంట్ (కంప్యూటర్ ఎయిడెడ్ డిజైన్) , స్టెనోగ్రాఫర్, సీనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్, జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ అనే ఉద్యోగాలతో పాటు లేబరేటరీ టెక్నికల్ విభాగంలో టెక్నికల్ అసిస్టెంట్ (మెకానికల్, కెమికల్, మైక్రోబయాలజీ) , సీనియర్ టెక్నీషియన్ (కార్పెంటర్, వెల్డర్, ప్లంబర్, ఫిట్టర్ , ఎలక్ట్రీషియన్ / వైర్ మెన్) మరియు టెక్నీషియన్ ( ఎలక్ట్రీషియన్ / వైర్ మెన్) అనే పోస్టులు భర్తీ చేస్తున్నారు.

🔥 అర్హతలు : సంబంధిత ట్రేడ్లలో ITI, 10+2 , Diploma, డిగ్రీ అర్హతలు ఉన్న వారు ఈ ఉద్యోగాలకు అప్లై చేయవచ్చు.

🔥 మొత్తం ఖాళీల సంఖ్య : 365

🔥 వయస్సు : 

  1. అసిస్టెంట్ డైరెక్టర్ ఉద్యోగాలకు గరిష్ట వయస్సు 35 సంవత్సరాలు
  2. పర్సనల్ అసిస్టెంట్, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్, అసిస్టెంట్ (కంప్యూటర్ ఎయిడెడ్ డిజైన్) ఉద్యోగాలకు గరిష్ట వయస్సు 30 సంవత్సరాలు
  3. స్టెనోగ్రాఫర్, సీనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్, జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ ఉద్యోగాలకు గరిష్ట వయస్సు 27 సంవత్సరాలు
  4. టెక్నికల్ అసిస్టెంట్ (మెకానికల్, కెమికల్, మైక్రోబయాలజీ) ఉద్యోగాలకు గరిష్ట వయస్సు 30 సంవత్సరాలు 
  5. సీనియర్ టెక్నీషియన్ (కార్పెంటర్, వెల్డర్, ప్లంబర్, ఫిట్టర్ , ఎలక్ట్రీషియన్ / వైర్ మెన్) మరియు ఉద్యోగాలకు గరిష్ట వయస్సు 27 సంవత్సరాలు
  6. టెక్నీషియన్ ( ఎలక్ట్రీషియన్ / వైర్ మెన్) ఉద్యోగాలకు గరిష్ట వయస్సు 27 సంవత్సరాలు

🔥 వయసులో సడలింపు : భారత ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయస్సులో క్రింది విధంగా సడలింపు వర్తిస్తుంది. 

  • SC, ST అభ్యర్థులకు ఐదేళ్లు 
  • OBC అభ్యర్థులకు మూడేళ్లు 
  • PwBD అభ్యర్థులకు 10 ఏళ్ళు వయసులో సడలింపు ఉంటుంది.

🔥 జీతము : ఈ ఉద్యోగాలకు క్రింది విధంగా పే స్కేల్ ఉంటుంది.

  1. అసిస్టెంట్ డైరెక్టర్ ఉద్యోగాలకు లెవల్-10 ప్రకారం పే స్కేల్ 56,100/- నుండి 1,77,500/- వరకు ఉంటుంది.
  2. పర్సనల్ అసిస్టెంట్, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్, అసిస్టెంట్ (కంప్యూటర్ ఎయిడెడ్ డిజైన్) ఉద్యోగాలకు లెవల్ – 6 ప్రకారం పే స్కేల్ 35,400/- నుండి 1,12,400/- వరకు ఉంటుంది.
  3. స్టెనోగ్రాఫర్, సీనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ ఉద్యోగాలకు లెవల్ – 4 ప్రకారం పే స్కేల్ 25,500/- నుండి 81,100/- వరకు ఉంటుంది.
  4. జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ ఉద్యోగాలకు లెవెల్ – 2 ప్రకారం 19,900/- నుండి 63,200/- వరకు ఉంటుంది
  5. టెక్నికల్ అసిస్టెంట్ (మెకానికల్, కెమికల్, మైక్రోబయాలజీ) ఉద్యోగాలకు లెవల్ – 6 ప్రకారం పే స్కేల్ 35,400/- నుండి 1,12,400/- వరకు ఉంటుంది.
  6. సీనియర్ టెక్నీషియన్ (కార్పెంటర్, వెల్డర్, ప్లంబర్, ఫిట్టర్ , ఎలక్ట్రీషియన్ / వైర్ మెన్) మరియు ఉద్యోగాలకు Level – 4 పే స్కేల్ 25,500/- నుండి 81,100/- వరకు ఉంటుంది.
  7. టెక్నీషియన్ ( ఎలక్ట్రీషియన్ / వైర్ మెన్) ఉద్యోగాలకు లెవల్ – 2 ప్రకారం పే స్కేల్ 19,900/- నుండి 63,200/- ఉంటుంది.

🔥 అప్లికేషన్ విధానం : ఈ పోస్టులకు అర్హత గల వారు ఆన్లైన్ లో అప్లై చేసుకోవచ్చు.

🔥 ఎంపిక విధానం ఎలా ఉంటుంది : ఈ పోస్టుల ఎంపికలో భాగంగా పరీక్ష నిర్వహించి ఎంపిక చేస్తారు. 

🔥 అప్లికేషన్ ప్రారంభ తేదీ : 09-09-2024

🔥 అప్లికేషన్ చివరి తేదీ : 30-09-2024

Note : ఈ పోస్టులకు అప్లై చేయాలి అనుకునే అభ్యర్థులు క్రింద ఇచ్చిన లింక్ పైన క్లిక్ చేసి పూర్తి వివరాలు చదివి అప్లై చేయండి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!